మళ్లీ విరాట్ కోహ్లి నిరాశ | virat kohli again flops against new zealand test | Sakshi
Sakshi News home page

మళ్లీ విరాట్ కోహ్లి నిరాశ

Published Fri, Sep 30 2016 11:25 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

మళ్లీ విరాట్ కోహ్లి నిరాశ

మళ్లీ విరాట్ కోహ్లి నిరాశ

కోల్ కతా: మూడు టెస్టు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఈడెన్ గార్డెన్ లో న్యూజిలాండ్ తో ఆరంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన కోహ్లి.. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో తొమ్మిది పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్ లో లాథమ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 28 బంతులను ఎదుర్కొన్న కోహ్లి ఒక ఫోర్ మాత్రమే సాధించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(1), మురళీ విజయ్(9) లు తీవ్రంగా నిరాశపరిచారు. అనంతరం జట్టు స్కోరు 46 పరుగుల వద్ద విరాట్ మూడో వికెట్ గా వెనుదిరిగాడు. ఈ మూడు వికెట్లలో హెన్రీకి రెండు వికెట్లు లభించగా, బౌల్డ్ ఒక వికెట్ తీశాడు. తొలి టెస్టులో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో కూడా గెలిచి సిరీస్ ను, నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తుండగా, ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలని కివీస్ యోచిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement