రియోకు మరో రెజ్లర్ అర్హత | Wrestler Sandeep Tomar Secures Rio Olympics Quota Place for India in the Men's 57kg Freestyle Category | Sakshi
Sakshi News home page

రియోకు మరో రెజ్లర్ అర్హత

Published Sun, Apr 24 2016 6:39 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

Wrestler Sandeep Tomar Secures Rio Olympics Quota Place for India in the Men's 57kg Freestyle Category

ఉలాన్ బాతర్(మంగోలియా):ఈ ఏడాది ఆగస్టులో జరుగనున్న రియో ఒలింపిక్స్కు మరో భారత రెజ్లర్ సందీప్ తోమర్ అర్హత సాధించాడు. వరల్డ్ రెజ్లింగ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన 57 కేజీల ఫ్రీ స్టయిల్  కేటగిరిలో సందీప్ 11-0 తేడాతో ఆండ్రీ యాట్ సెన్కో(ఉక్రెయిన్)పై విజయం సాధించి రియోకు అర్హత సాధించాడు. దీంతో పాటు కాంస్య పతకాన్ని కూడా సందీప్ తన ఖాతాలో వేసుకున్నాడు.
 

రియో ఒలింపిక్స్కు అర్హత సాధించిన నాల్గో భారత రెజ్లర్ సందీప్ కావడం విశేషం. అంతకుముందు యోగేశ్వర్ దత్(65 కేజీల ఫ్రీ స్టయిల్), నర్సింగ్ యాదవ్(74 కేజీల ఫ్రీ స్టయిల్), హర్దీప్ సింగ్( గ్రీకో-రోమన్ 98 కేజీలు)లు ఒలింపిక్స్ కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement