బెంగళూరు : కర్ణాటక బెంగళూరులో గురువారం నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు వైఎస్ఆర్ జిల్లా తొండూరు మండలం భద్రంపల్లికి చెందినవారు. కాగా రేషన్ షాపుల వివాదం కారణంగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ సర్కార్ అక్రమ కేసులు బనాయించింది.
ఈ నేపథ్యంలో వీరంతా బెంగళూరులో తలదాచుకుంటున్నట్లు సమాచారం. అయితే వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఎలా మృతి చెందారనే దానిపై స్పష్టత లేదు. కాగా మృతుల్లో చెన్నకేశవరెడ్డి, రాంమ్మోహన్ రెడ్డి, వీరచంద్రారెడ్డి, అరుణ్ కాంత్ రెడ్డి ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.