అష్టోత్తరాల్లో పాల్గొన్న అఘోరాలు
యాదగిరికొండ(ఆలేరు) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో బుధవారం స్వామివారికి తి రుమంజన సేవ, నిత్యకల్యాణ సేవ, వెండిజోడు సేవలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా స్వా మి, అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పీఠంపై మంగళవాయిద్యాలతో ఊరేగింపు చేశారు. అలాగే సుదర్శన హోమం నిర్వహించారు. ఇందులో లక్ష్మీ, నారాయణం, గరుఢ, ఆంజనేయం, నారసింహం వంటి అనేక దేవతల మూలమంత్రాలతో హవనం చేశారు.
ఉదయం ఆరాధన, బాలబోగం, నిత్యకల్యాణం వంటి విశేష పూజలు నిర్వహించారు. 108 బంగారు పుష్పాలతో అర్చన గావించారు. కార్యక్రమంలో స్థానాచార్యులు రాఘవాచార్యులు, ఆలయ ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపూడి నరసింహాచార్యులు, మంగళగిరి నరసింహమూర్తి, సురేంద్రాచార్యులు, పూరిమెట్ల నరసిం హాచార్యులు, శ్రీధరాచార్యులు, ఆలయ అధికారులు రామ్మోహన్‌రావు, రఘు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
స్వామివారి సన్నిధిలో అఘోరాలు
యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామిని బుధవారం ఇద్దరు అఘోరాలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అఘోరాల స్థితిగతులపై ఆయనతో పాటు వచ్చిన ఒక స్వామి అఘోరాల వ్యక్తిగత విషయాలను తెలిపారు. వీరు చార్‌థామ్ యాత్ర చేస్తూ యాదాద్రికి వచ్చారని తెలిపారు. వీరంతా హరిద్వార్ నుంచి పదిరోజుల క్రితం బయలుదేరారని చెప్పారు.
అంతేకాకుండా మన స్థితిగతులకు, వారి స్థితిగతులకు చాలా తేడా ఉంటుందని వివరించారు. వీరిలో కొంతమంది శాకాహారులు, మరి కొంతమంది నరమాంస భక్షకులు ఉంటారని తెలిపారు. శాకాహారులను నాగసాధువులు అంటారని, నరమాంస భక్షకులను అఘోరాలు అంటారని చెప్పారు. రానున్నకాలంలో యాదాద్రి మంచిపేరు ప్రఖ్యాతులు పొందుతుందన్నారు. నాగసాధువులు, అఘోరాలు ఒంటిపై ఎలాంటి దుస్తులు ధరించకుండా, భస్మం పూసుకుని ఉంటారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment