రక్తదానం చేసిన ‘అసుర’ మూవీ టీం | asura movie team donated blood | Sakshi
Sakshi News home page

రక్తదానం చేసిన ‘అసుర’ మూవీ టీం

Published Sat, May 16 2015 9:03 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

asura movie team donated blood

హైదరాబాద్: రెటినోబ్లాస్టోమా అవగాహన వారోత్సవాల్లో భాగంగా బంజారాహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ నేత్ర వైద్యవిజ్ఞాన సంస్థలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు సహకారంతో బ్లడ్ లైవ్ అనే కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరాన్ని శనివారం సినీనటుడు నారా రోహిత్ ప్రారంభించారు. రక్తదానం చేయడానికి ముందుకురావడం సమాజ సేవ అని ఆయన అభివర్ణించారు.

ఇలాంటి ఉత్తమ కార్యక్రమాలు, సమాజ సేవ నిర్వహిస్తున్న రెండు ప్రముఖ సంస్థలతో అనుబంధం ఉన్నందుకు గర్వపడుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో అసుర సినిమా సిబ్బంది రక్తదానం చేశారు. కంటి క్యాన్సర్‌తో బాధపడుతున్న 5 ఏళ్ల లోపు పిల్లలకు సహాయం అందించేందుకు వీరంతా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement