జిల్లాలో శిశు విక్రయాల పరంపర కొనసాగుతూనే ఉంది. పాలకులు ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా.. అధికారులు ఎంతగా చైతన్య పరిచినా సాంఘిక దురాచారానికి అడ్డుకట్ట పడడం లేదు. జిల్లాలోని చివ్వెంల, మర్రిగూడ మండలాల పరిధిలో ఆడపిల్లల విక్రయాలు ఆలస్యంగా వెలుగులోకి రావడం కలవరానికి గురిచేస్తోంది.
- సూర్యాపేట
చివ్వెంల మండలం రాజ్‌తండాకు చెందిన మంగ్త్యా-కవిత దంపతులకు మొదటి, రెండో సంతానంలో ఆడబిడ్డలు జన్మించారు. కాగా కవితకు మొదటి సంతానం నుంచే బాలిం త గుణం వస్తుండేది.. ఈ క్రమంలో ఆమె రెండో సంతానంలో కూడా ఆడ శిశువుకు జన్మనిచ్చి.. అదే మాదిరిగా బాలింత గుణం రావడంతో రెండు నెలల హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించారు. ఈలోగా ఆమె అత్త, బంధువులు కలిసి శిశువును రూ.26 వేలకు సూర్యాపేటలోని గన్నోజు దుర్గాచారి, చివ్వెంల మండలం మోదిన్‌పురానికి చెందిన ఆర్‌ఎంపీ అంజి, కొండల్‌రాయినిగూడేనికి చెందిన మరో ఆర్‌ఎంపీ రవిలకు విక్రయించారు.
గన్నోజు దుర్గాచారి ఎన్‌జీవో సంస్థలో చిరుద్యోగం చేస్తుండేవాడు. పట్టణంలోని అన్నాదురైనగర్‌కు చెందిన రమణకు తమ వద్ద ఆడ శిశువు ఉందని.. సంతానం లేని వారు ఎవరైనా ఉంటే చెప్పమన్నాడు. ఆమె అదే కాలనీకి చెందిన సైదమ్మ అనే మరో మహిళకు విషయాన్ని వివరించింది. సైదమ్మ ఆమె ఇంటి పక్కనే నివాసముంటున్న మండలి నిర్మల ఆడపడుచుకు విషయాన్ని చెప్పింది. ఆమె నిర్మలకు ఫోన్ ద్వారా విషయాన్ని తెలపడంతో తాను కొనుగోలు చేస్తానని చెప్పింది. దీంతో హైదరాబాద్‌లో నివాసముంటున్న నిర్మల వద్దకు.. దుర్గాచారి, రవి, అం లు వెళ్లి శిశువును ఆమెకు *26 వేలకు విక్రయించారు.
రెండు నెలల తర్వాత..
శిశువు తల్లి కవిత హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల కోలుకుంది. వారం రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకుని తన బిడ్డ ఏమైందని అత్తను నిలదీయగా.. నీ వద్ద పాలు లేకపోవడంతో.. బంధువుల ఇంటికి పంపించామని మాయమాటలు చెబుతూ వస్తోంది. సోదరుడు జలెందర్‌కు బాధిత మహిళ తన బిడ్డ కనిపించడం లేదంటూ విషయాన్ని తెలిపడంతో.. ఇద్దరు కలిసి మూడు రో జుల క్రితం భర్త మంగ్త్యాపై చివ్వెంల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. పోలీసులు విచారణ సాగిస్తుండగా.. విషయం వెలుగులోకి వచ్చింది. గురువారం సూర్యాపేటకు చేరుకుని దుర్గాచారిని ప్రశ్నించడంతో వివరాలు వెల్లడించి.. శిశువును తెప్పించి తల్లికి అప్పగించారు. అనంతరం దుర్గాచారి, శిశువు విక్రయానికి సహకరించిన రమణ, సైదమ్మ, కొనుగోలు చేసిన నిర్మలను చివ్వెంల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఆడపిల్లను విక్రయించేందుకు బేరం కుదుర్చుకుని..
మర్రిగూడ: మర్రిగూడ మండలం కొం డూరు గ్రామ పంచాయతీ పరిధి జం టతండాకు చెందిన జర్పుల రవి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు జన్మిం చారు. పిల్లల పోషణ భారంగా మారడంతో రెండు రోజుల క్రితం తల్లిదండ్రులు ఓ ఆడపిల్లను హెదరాబాద్‌కు చెందిన వారికి అమ్మడానికి బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చింతపల్లి సీడీపీఓ లావాణ్యకుమారి, ఐసీడీసీ సూపర్‌వేజర్ తులసి గురువారం ముందుగా తండాలో విచారణ చేశారు. అనంతరం మర్రిగూడ పోలీస్‌స్టేషన్‌కు ఆ దంపతులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి పంపించారు.
శిశు విక్రయాల పరంపర
Published Thu, Jul 23 2015 11:04 PM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM
Advertisement