సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్ గార్డ్ సంస్థ.. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద సప్లయింగ్ కంపెనీ. క్లీనింగ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డులు, హెల్పర్లు మొదలు అన్ని రకాల కార్మికులను వివిధ సంస్థలకు సమకూర్చే సంస్థ. సంపన్నుల ఇళ్లలో పనులకు కూడా కార్మికులను పనులకు కుదురుస్తుంది. రోజూ షిప్టుల వారీగా ఆయా సంస్థల వద్ద దిగబెట్టడం, ఆ తర్వాత గమ్యస్థానాలకు చేర్చడం ఈ కంపెనీ పని. అలాంటి ఈ సంస్థపై కరోనా పిడుగు పడింది. సంస్థలో పనిచేస్తున్న 12 వేల మంది వలస జీవులపై ప్రస్తుతం కత్తి వేలాడుతోంది. కార్మికుల సంఖ్యను తగ్గించుకునేందుకు వేతన రహిత సెలవు (అన్‌పెయిడ్ లీవ్)లపై వెళ్లాలని ఒత్తిడి చేస్తోంది. ఇలాంటి ఎన్నో కంపెనీలు కరోనా ప్రభావం తో కార్మికులకు కోత పెడుతున్నాయి. ఇలా గల్ఫ్ దేశాల్లో అన్ని చోట్లా కార్మికుల ఉపాధిపై కరోనా వేటు పడ నుంది. ఆఖరికి ఇంట్లో పనిచేసే సిబ్బందిని కూడా రావొద్దని సంపన్నులు చెబుతున్నారంటే కరోనా వైరస్ భయం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
భారీ సంఖ్యలో ఉద్వాసన
ఉద్యోగ, ఉపాధిరీత్యా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన 87 లక్షల మంది భారతీయుల్లో 25 శాతం మంది ఉపాధి కోల్పోతారని అంచ నా. ఈ లెక్కన తెలంగాణకు చెందిన 15 లక్షల ప్రవాస భారతీయుల్లో.. సుమారు 3.75 లక్షల మంది కొలువు లు కోల్పోయే ప్రమాదముందని ప్రవాసీ మిత్ర సంస్థ, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు గల్ఫ్ దేశాలకు కార్మికులను పంపడంలో దేశవ్యాప్తంగా కీలకంగా పనిచేస్తున్న 1,400 రిక్రూటింగ్ ఏజెన్సీల భవితవ్యం కూడా ప్రశ్నార్థకంగా మారనుంది. కార్మికుల నియామకాలపై ఆంక్షలు కఠినతరం చేసే నేపథ్యంలో ఈ ఏజెన్సీల మనుగడ కష్టం కానుంది.
బలవంతపు సెలవులు
లాక్‌డౌన్‌తో అనేక కంపెనీలు కార్యకలాపాలను బంద్ చేశాయి. ఆయా కంపెనీల్లో పనిచేసే కార్మికులను అన్‌పెయిడ్ లీవ్‌లో వెళ్లాలని యా జమాన్యాలు ఆదేశించాయి. కొన్ని సంస్థలు మాత్రం భోజనంతో సరిపెడుతున్నాయి. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన ఆసియా ప్రవాసీల్లో అత్యధికులు భారతీయులే. తాజాగా చమురు కంపెనీలు, నిర్మాణ, రిటైల్, ఆతిథ్య సేవారంగం తదితర రంగాలు కుదేలయ్యాయి. ముడిచమురు ధరలు దారుణంగా పతనమయ్యాయి. ఇది అన్ని రంగాల్లోని ఉపాధిపై ప్రభావం చూపుతుండడంతో కొలువుల కోతకు దారితీస్తోంది.
మీ పౌరులను తీసుకెళ్లండి
కరోనా కేసుల సంఖ్య పెరిగితే కష్టమని భావిస్తున్న గల్ఫ్ దేశాలు.. పౌరులను తీసుకెళ్లాలని భారత్ సహా పలు దేశాల రాయబార కార్యాలయాలకు యూఏఈ లేఖ రాసింది. అయితే ఆ దేశాల నుంచి స్పందన రాకపోవడంతో ద్వైపాక్షిక కార్మిక ఒప్పందాలను పునఃసమీక్షిస్తామని హెచ్చరించింది. కాగా, ఒమన్ నుంచి భారత్‌కు వెళ్లాలనుకునే వారు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం సూచిం చింది. లాక్‌డౌన్ ఎత్తివేయగానే స్వదేశానికి వెళ్లాలనుకునే ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా విమాన సర్వీసుల ఏర్పాటకు వీలుగా ఈ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
చట్టవిరుద్ధంగా ఉన్నవారికి ఇబ్బందులే
కరోనా సంక్షోభం వల్ల ఒమన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో చట్ట విరుద్ధంగా ఉన్న వలస కార్మికులకు ఇబ్బందులు తప్పవు. వీసా ఉన్న వారికే పని దొరికే పరిస్థితి లేదు. ఖల్లివెల్లి (అక్రమ నివాసులు) కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో వారి దేశాలకు పంపే అవకాశం ఉంది. కరోనా సంక్షోభం గట్టెక్కినా కొందరు తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. నైపుణ్యం ఉన్నవారికే ఒమన్‌లో భవిష్యత్తు ఉంటుంది. గతంలో ఉన్న వేతనాలు మున్ముందు చెల్లించే పరిస్థితి ఉండకపోవచ్చు. సాధారణ పరిస్థితులు నెలకొన్నా వలస కార్మికులకు గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి.
– నరేంద్ర పన్నీరు, మస్కట్
కార్మికులకు భరోసా కష్టమే...
ప్రస్తుత విపత్కర పరిస్థితిలో దుబాయ్‌లోని వివిధ కంపెనీల్లో పని చేస్తున్న వలస కార్మికుల ఉద్యోగానికి భద్రత కష్టమే. తీవ్రమైన ఆర్థిక సం క్షోభం వల్ల కార్మికులకు భోజనం ఇతర సదుపా యాలు తప్ప జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. వలస కార్మికులకు గతంలో ఉన్నంత మంచి స్థితి ఉండకపోవచ్చు.
– కుంట శివారెడ్డి, దుబాయ్
Comments
Please login to add a commentAdd a comment