పేలుళ్లతో పరేషాన్..! | Cracks in the floating homes | Sakshi
Sakshi News home page

పేలుళ్లతో పరేషాన్..!

Published Sat, Apr 23 2016 2:31 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

పేలుళ్లతో పరేషాన్..! - Sakshi

పేలుళ్లతో పరేషాన్..!

పగుళ్లు  తేలుతున్న గృహాలు
విపరీతమైన ధ్వని కాలుష్యం
ఎండిపోయిన బావులు
హామీలు పట్టించుకునే అధికారులు కరువయ్యారు

 
 
కాసిపేట :  సింగరేణి అధికారులు హామీలకు మాత్రమే పరిమితం కావడం మినహా సంస్థ ద్వారా నష్టపోతున్న వారిని పట్టించుకోవడం లేదు. కాసిపేట భూగర్భ గని ద్వారా తీవ్రంగా నష్టపోతున్నట్లు ముత్యంపల్లి, కాసిపేట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందమర్రి ఏరియా కాసిపేటగని ప్రారంభమైన 20 ఏళ్ల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ముత్యంపల్లి వాసులు వాపోతున్నారు. గని పని స్థలాలు గ్రామం కింద నడుస్తుండటంతో గృహాలు పగుళ్లు తేలుతూ కూలిపోయే దశకు వచ్చాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గని పేలుళ్లకు ఇంటి గోడలు నెర్రెలు బారి సామగ్రి కింద పడుతోందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో నలభై శాతం గృహాలు పగుళ్లు తేలినట్లు  సింగరేణి, రెవెన్యూ అధికారులు గతంలో సర్వేచేసి నిర్ధరించారు. పరిహరం అందజేస్తామని హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికీ పట్టించుకోవడం లేదని కాసిపేట ముత్యంపల్లి గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పనిస్థలాల్లో సక్రమంగా ఇసుక నింపక పొవడం గ్రామం క్రింద పనులు నడవడటంతో గ్రామస్తులంతా ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. రెండు గ్రామాల్లో కనీసం ఒక్క బావి లేకుండా ఎండిపోగా కనీసం బోర్‌వెల్ వేసినా పనిచేసే పరిస్థితి లేదని దీంతో సింగరేణి సరఫరా చేసే నీటిపైనే ఆధారపడుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.


 జాయింట్‌సర్వే ఏమైనట్లు
 సింగరేణి అధికారులు పన్నెండు సంవత్సరాల క్రితం నుంచి పరిహారం చెల్లిస్తామని ఇందుకోసం జాయింట్ సర్వేచేసి నివేదిక రూపించనున్నట్లు చెప్తూవస్తున్నారు. జాయింట్‌సర్వే, నష్టపరిహరం ఏమైనట్లు అని స్థానికులు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. గతం నుంచి రెవెన్యూ, సింగరే ణి అధికారులు పగుల్లు తేలిన ఇళ్లు, ఎండిపోయి న బావులు, గని ద్వారా జరిగిన నష్టాన్ని జా యింట్ సర్వే చేసి పరిహారం అందజేస్తామని సింగరేణి అధికారులు హమీలు ఇస్తూ వచ్చారు. 2012లో బుంగ పడ్డ సందర్భంలో ఉన్నాతాధికారులు పరిశీలించి గృహాలను చూసి విస్తుపోయా రు. పరిహరం అందించె భాధ్యత మాదే అయి నా అంచనా వ్యయం రెవెన్యూ, ఇంజనీరింగ్ అ ధికారులతో సర్వే చేయించి పరిహారం నిర్ణయిం చాల్సి ఉందని త్వరలో సర్వే చేపిస్తామన్నారు. అధికారులు మారుతున్నా నేటికీ పరిహారం ఊ సేలేదు.అలాగే భూగర్భ గనుల వల్ల తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేలుళ్ల సమయంలో తీవ్ర ధ్వని కాలుష్యం, ఇంటి గోడలు నెర్రెలు బారుతున్నాయని పరిహారం అందించి తమను ఆదుకోవాలని ఇరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
 
 
 పేలుళ్ల తాకిడికి తట్టుకోలేకపోతున్నాం
 ఇండ్ల కింద పనులు నడుస్తుండటంతో గనిలో జరిగే పేలుళ్ల శబ్ధం తట్టుకోలేకపోతున్నాం. ఇంట్లోని సామాగ్రి కిందపడుతోంది. ప్రహరీ గోడలు కూలిపోతున్నాయి. నిర్మించుకున్న ఇళ్లు పగుల్లు తేలాయి. సింగరేణి మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ, అధికారులు పాలకులు శ్రద్ధ పెట్టి పరిహారం అందించెలా చూడాలి.- కుర్మ నర్సయ్య


 నీటి చుక్క లేకుండా పోయింది..
 కాసిపేటని ఏర్పాటు చేసిన నాటి నుంచి ముత్యంపల్లి, కాసిపేట గ్రామాలలో నీటిచుక్క లేకుండా పోయింది. వందల సంఖ్యలో బావులు ఎండిపోయాయి. ఇళ్లు పగుల్లు తేలుతున్నట్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ అధికారులు సింగరేణి వాళ్లపై చెప్తున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలి.  - బోగె రాజారాం

అధికారులు పట్టించుకోవడం లేదు
అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టిం చుకోవడం లేదు. నష్టం సింగరేణి ద్వా రా జరుగుతున్నా దాన్ని నివేదించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద లే దా? ఏదైనా ఘటన జరిగినప్పుడు, అవసరం ఉన్నప్పుడు సింగరేణి అధికారులు సర్వే చేపించి పరిహారం అందిస్తామంటారు. మళ్లీ కనిపిం చారు. నష్టపోతున్న బాధితులకు అధికారులు, పాలకులు సహకరించి పరిహరం అందించాలి.          - జాడి మల్లేష్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement