చేవెళ్ల, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పి.వెంకటస్వామి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రానికి చెందిన కె. మల్లారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం 50 మంది యువకులు పలు పార్టీలనుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల కల నెరవేర్చిన సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు యువజన కాంగ్రెస్ నాయకులు కృషిచేయాలన్నారు. అసెంబ్లీ అభ్యర్థి కాలె యాదయ్య మాట్లాడుతూ.. ఎన్నికల సమయం సమీపిస్తున్నందునా ప్రచారం విస్తృతం చేయాలని కార్యకర్తలను కోరారు.
జిల్లాలోని రెండు పార్లమెంటు, 14 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డెరైక్టర్ ఎస్.బల్వంత్‌రెడ్డి, మండల అధ్యక్షుడు ఎం.రమణారెడ్డి, ఉపాధ్యక్షుడు జి.చంద్రశేఖర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఎం.వెంకటేశంగుప్త, వైస్‌చైర్మన్ పి.గోపాల్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఎం.బాల్‌రాజ్, మాజీ ఎంపీపీ విజయభాస్కర్‌రెడ్డి, నాయకులు శివానందం, జి.రవికాంత్‌రెడ్డి, ఎం.యాదగిరి, నర్సింహులు, సాగర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి
Published Sat, Apr 26 2014 12:36 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement
Advertisement