కరెంట్ కాటేసింది
విద్యుదాఘాతంతో రైతు మృతి
మరో ఘటనలో వాటర్‌మెన్‌కు గాయాలు
బాలానగర్ : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని మోతిఘనపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గంగధర్‌పల్లి గ్రామం లో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గట్టుపల్లి అంజయ్య(34) గ్రామంలో తనకున్న కొ ద్దిపాటి పొలంలో వ్యవసాయం చేయడం తో పాటు గ్రామంలోనే బోరుమోటార్లు రిపేరుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో బోరుమోటారును మరమ్మతుచేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతడితో పాటు పక్కనే ఉన్న మరో బాలుడు రాఘవేందర్ గాయాలతో బయటపడ్డా డు. కిందకు వేలాడుతున్న విద్యుత్‌లైన్ల ను సరిచేయాలని అధికారులకు ఎన్నోసా ర్లు విన్నవించినా పట్టించుకోలేదని గ్రా మస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతుడికి భార్య అలివేలు, ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అశోక్‌కుమార్ తెలిపారు.
మరో ఘటనలో..
కొత్తకోట: విద్యుదాఘాతంతో వాటర్‌మె న్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘట న గురువారం మండలంలోని అమడబాకుల గ్రామంలో జరిగింది. స్థానికుల కథ నం మేరకు.. గ్రామానికి చెందిన వాటర్‌మెన్ లక్ష్మయ్య నీళ్లు విడిచే క్రమంలో మో టార్లు పనిచేయలేదు. దీంతో కరెంట్‌స్తం భానికి ఉన్న విద్యుత్‌వైర్లు ఊడిపోయిన ట్లు గుర్తించాడు. వెంటనే సమీపంలో ఉ న్న ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫీజు తీసేశాడు. అయినా అక్కడమరోలైన్ విద్యుత్ సరఫరా అలాగే ఉంది. ఇదితెలియని లక్ష్మ య్య స్తంభంఎక్కి వైర్లు సరిచేయబోయా డు. విద్యుత్‌షాక్‌తో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ప్రమాదంలో లక్ష్మ య్య ఎడమచేయి పూర్తిగా కాలిపోయిం ది. స్థానికులు చికిత్సకోసం జిల్లాకేంద్రం లోని ఎస్‌వీఎస్ ఆస్పత్రికి తరలించారు.