వాహనం ఢీకొనడంతో తండ్రి, కొడుకు మృతి | Father-son dies in road accident at karimnagar district | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొనడంతో తండ్రి, కొడుకు మృతి

Published Mon, May 25 2015 11:17 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

Father-son dies in road accident at karimnagar district

కరీంనగర్: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తండ్రి, కొడుకులు మృతి చెందారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మండలంలోని వెదిరి గ్రామానికి చెందిన లింగయ్య(40), తన కొడుకు శశాంక్(7) తో కలసి ఆస్పత్రికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

లింగయ్య రామడుగులోని కోళ్ల ఫారంలో కూలీగా పనిచేస్తాడు. అయితే శశాంక్‌కు అనారోగ్యంగా ఉండటంతో ఆదివారం రాత్రి వీరు ఆస్పత్రికి వెళ్లేందుకు వెదిరి గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై బస్సు కోసం ఎదురు చూశారు. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వీరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement