గొత్తికోయల గూడు కూల్చుతున్నారు..
నిరాశ్రయులను చేస్తున్న అటవీశాఖ అధికారులు
ఏటూరునాగారం: పొట్ట చేతపట్టుకొని ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన గొత్తికోయల బతుకులు దుర్బరంగా మారుతున్నాయి. అటవీ శాఖ అధికారుల వేధింపులతో వారి జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. వరంగల్ జిల్లాలోని తాడ్వాయి, మంగపేట మండలాల్లో మంగళ, బుధవారాల్లో గొత్తికోయలు వేసుకున్న గుడిసెలను అధికారులు ధ్వంసం చేశారు. అడ్డువచ్చి న వారిని విచక్షణరహితంగా కొట్టారు. వారి సామగ్రిని విసిరేశారు. తాడ్వాయి మండలం లింగాల పంచాయతీ పరిధిలోని మొం డ్యాలతోగు వద్ద సుమారు 30 మంది గొత్తికోయ కుటుంబాలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నా యి. మంగళవారం అక్కడికి వచ్చిన అటవీశాఖ అధికారులు డోజర్‌తో వారు వేసుకున్న గుడిసెలను కూలి వేశారు. సామగ్రిని చిందరవందర చేశారు. సెల్‌ఫోన్‌లో ప్రజాసంఘాలు, తదితరులకు సమాచారం ఇస్తున్నాడని మామిడి కోసయ్య అనే గొత్తికోయపై దాడిచేసి కొట్టారు.
మంగపేట మండలం బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీ(కేశవపురం)లో 20 గొత్తికోయ కుటుంబాలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నాయి. బుధవారం అటవీశాఖ అధికారులు దాడి చేసి వారి నివాసాలను ధ్వంసం చేశారు. ఆహార సామగ్రిని పారబోశారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం చింతలపాడు, మామిడిగూడెం, గంటల కుంట, గుర్రాలబావి, ఐలాపురం కొత్తూరు, దొడ్ల కొత్తూరు, మం గపేట మండలంలోని రేగులగూడెం, కేశవపురం, తాడ్వాయి మండలం లవ్వాల, కొండపర్తి, చింతలమోరి గ్రామాల్లో.. అటవీ ప్రాం తాల్లో సుమారు 3,500 మంది గొత్తికోయలు పదేళ్లు వలస వచ్చారు. ఆయా ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న గొత్తికోయలు అటవీలో దొరికే తునికిపళ్లు, విప్పపూవ్వు, చీపురు పుల్లలు, తమకు తెలిసిన వ్యవసాయంతో కాలం గడుపుతున్నారు. అయితే, అడవిలో చెట్లను నరికివేస్తున్నారని అటవీశాఖ అధికారులు గొత్తికోయలపై దాడులు చేస్తున్నారు. తమకు పట్టాలు ఇవ్వాలని ఐటీడీఏకు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడంలేదు.
ప్రభుత్వ కార్డులు జారీ చేసినా ...
ఆయా మండలాల్లో నివాసం ఉంటున్న గొత్తికోయలకు ప్రభుత్వం ఓటర్, ఆధార్, రేషన్‌కార్డులు జారీ చేసింది. అడవిలో జీవించేహక్కు ఉన్న తమకు ప్రభుత్వం కార్డులను జారీ చేసిన విషయాన్ని అట వీ అధికారులు గుర్తించడంలేదని గూడేల పెద్దలు నాగరాజు, జోగయ్య, కోసయ్య అంటున్నారు.