వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో కుండపోత | heavy rain in warangal and karimnagar | Sakshi
Sakshi News home page

వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో కుండపోత

Published Wed, Sep 6 2017 1:29 PM | Last Updated on Tue, Sep 12 2017 2:04 AM

heavy rain in warangal and karimnagar

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో బుధవారం ఉదయం నుంచి భారీ వర‍్షం పడుతోంది. వరంగల్‌ నగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి నగరం తడిసి ముద్దయింది. హన్మకొండ, ఖాజీపేట, హసన్‌పర్తి తదితర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. హన్మకొండలోని సమ్మయ్యనగర్‌, గణేష్‌ కాలనీ, హౌసింగ్‌ బోర్డు కాలనీతో పాటు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షానికి నగరంలోని పలు ప్రైవేటు పాఠశాలలు సెలవు ప్రకటించాయి. 
 
అదే విధంగా కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లోనూ భారీవర్షం కురుస్తోంది. గత రెండ్రోజులుగా తీవ్రమైన ఎండతో పాటు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు ఒక్కసారిగా చల్లగా మారిన వాతావరణంతో ఉపశమనం పొందుతున్నారు. కరీంనగర్‌తో పాటు హుజురాబాద్‌, సైదాపూర్‌, జమ్మికుంట, పెద్దపల్లి, కమాన్‌పూర్‌, గోదావరిఖనిలో వర్షం కురుస్తోంది. ఉదయం వేళ కావడంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement