ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో కొత్త మెనూ
నల్లగొండ :గర్భిణు లు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ‘ఇందిరమ్మ అమృతహస్తం’ పథకంలో తెలంగాణ ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. పేరుతోపాటు మెనూ కూడా మార్చేసింది. ‘ఒకపూట సంపూర్ణ భోజనం’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల పరిధిలోనూ అమలు చేయనుంది. మాతా, శిశు మరణాలు తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలుచేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇప్పటి వరకు గర్భిణు లు, బాలిం తలకు నెలకు 16 ఉడికిం చిన కోడుగుడ్లు మాత్ర మే అందించేవారు. ఇక నుంచి ప్రతిరోజూ గుడ్లు, పాలు ఇవ్వనున్నారు. ప్రోటీన్లు, విటమిన్లతో కూడిన ఆహారాన్ని అందజేయనున్నారు. ఈ పథకం నిర్వహణ బాధ్యతలు అంగన్‌వాడీ కార్యకర్తలకే అప్పగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి ‘ఒకపూట సంపూర్ణభోజనం’అనే కార్యక్రమాన్ని ప్రారంభించేం దుకు అధికారులు సిద్ధమయ్యారు.
లబ్ధిపొందే వారు..
అమృతహస్తం పథకాన్ని 2013 జనవరిలో జిల్లాలోని 11 ప్రాజెక్టుల్లో ప్రారంభించారు. అప్పుడు ఏడు ప్రాజెక్టుల పరిధిలో ఈ పథకం అమలుకు నోచుకోలేదు. ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ‘ఒకపూట సంపూర్ణభోజనం’ లో మాత్రం అన్ని ప్రాజెక్టుల పరిధిలోని 4,402 అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రారంభించను న్నారు. దీనిలో భాగంగా జిల్లాలోని గర్భిణులు 29,905, బాలింతలు 40,020, 3 ఏళ్ల నుం చి 6 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు 70,516 మందికి పౌష్టికాహారం అందించనున్నారు. రూ. 15 విలువ గల భోజ నాన్ని ప్రతిరోజూ వారికి ఇవ్వనున్నారు. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం అయిన తర్వాత ఆరు నెలల వరకు కూడా మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
నిర్వహణ బాధ్యత అంగన్‌వాడీలదే...
ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను అంగన్‌వాడీల కార్యకర్తలకే అప్పగించనున్నారు. ప్రస్తుతం గ్రామ సమైక్య సంఘాల సభ్యులు భోజనం వండి గర్భిణులు, బాలింతలకు అందజేస్తున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సమైక్యసంఘాల సభ్యుల మధ్య సమన్వయలోపంతో ఈ పథకం అస్తవ్యస్తంగా తయారైందనే ఆరోపణలువెల్లువెత్తుతున్నాయి. ఐసీడీఎస్ ద్వారా బియ్యం, పప్పు, కోడిగుడ్లు, నూనె, అందిస్తుండగా...అంగన్‌వాడీకార్యకర్తలు పా లు, కూరగాయలు, ఆకుకూరలు, పెరుగు అందజేయాల్సి ఉంటుంది. అంగన్ వాడీ కార్యకర్తల పేరిట జీరోఅకౌంట్ తీయాలి. ప్రతినెలా వారి ఖాతాల్లో ఖర్చు పెట్టిన సొమ్మును జమ చేస్తారు.
కమిటీ సభ్యులు వీరే..
ఈ పథకం నిర్వహణకుగాను చైర్మన్‌గా సర్పంచ్ లేదా వార్డుసభ్యుడు /కౌన్సిలర్, ఆశ కార్యకర్త, ఇద్దరు తల్లులు, సైన్స్ ఉపాధ్యాయుడు లేదా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, అంగన్‌వాడీ కార్యకర్త, ఇద్దరు గ్రామస్తులు సభ్యులుగా ఉంటారు.
త్వరలో మరిన్ని మార్పులు..
‘ఒకపూట సంపూర్ణభోజనం’ కార్యక్ర మానికిసంబంధించిన పేరును ప్రభుత్వం తాత్కాలికంగానే నామకరణం చేసింది. త్వరలో అసలు పేరు ఖరారు చేయనుంది. కా గా అంగన్‌వాడీ వ్యవస్థలో వేళ్లూనుకున్న అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నదని ప్రాజె క్టు డెరైక్టర్ మోతీ తెలిపారు. లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న పప్పు, కోడిగుడ్లు పక్కదారి పట్టకుండా నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.
దీని లో భాగంగానే వాటిని సప్లయి చేస్తు న్న కాంట్రాక్టు వ్యవస్థను పూర్తిగా రద్దుచేయాలనే నిర్ణయానికి వచ్చింది. కోడి గుడ్ల సరఫరా కాంట్రాక్టు ఈ నెలాఖరు తో ముగుస్తుంది. ఇక నుంచి గుడ్లను టెండర్ల ద్వారా కాకుండా అంగన్‌వాడీ ప్రాజెక్టులకు సమీపంలో ఉన్న పౌల్ట్రీ రైతులకు సప్లయి బాధ్యతలు అప్పగించనున్నారు. దీనివల్ల గుడ్ల సైజులో తేడా రాకపోవడమే గాక, రవాణా ఖర్చుల భారం కూడా తగ్గనుంది. మూడురంగుల్లో గుడ్లు పంపిణీ చేయ డం వల్ల బ్లాక్ మార్కెట్‌కు వాటిని తరలించడానికి వీలుండదు. అదేవిధంగా కంది పప్పు కూడా జిల్లా మేనేజర్ సివిల్ సప్లయ్ ద్వారానే సరఫరా చేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో మహిళా సంఘాల ద్వా రా పప్పు సప్ల యి చేస్తున్నారు. అంగన్‌వాడీ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ ఈ నెలాఖరులోగా అమలయ్యే అవకాశం ఉంది.
ఇదీ కొత్త మెనూ
సోమవారం అన్నం, సాంబారు, కూరగాయలు, ఎగ్‌కర్రీ, పాలు, కోడిగుడ్డు
మంగళవారం అన్నం, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, కోడిగుడ్డు, పాలు
బుధవారం అన్నం, పప్పు, ఆకుకూరలు, ఎగ్‌కర్రీ, కోడిగుడ్డు, పాలు
గురువారం అన్నం, సాంబారు, కూరగాయలు, పెరుగు, కోడిగుడ్డు, పాలు
శుక్రవారం అన్నం, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, కోడిగుడ్డు, పాలు
శనివారం అన్నం, పప్పు, కూరగాయలు, పెరుగు, కోడిగుడ్డు, పాలు