'ఆయన ప్రధానినే మించిపోయారు'
కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానినే మించి పోయారని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ భూ సేకరణ ఆర్డినెన్స్ తీసుకొస్తే.. తెలంగాణ సీఎం కేసీఆర్ భూ వినియోగ చట్టం తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు.
లక్షకుపైగా ఎకరాల్లో పంటనష్టం జరిగితే పరామర్శించని కేసీఆర్ విందు భోజనాలు ఆరగిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పర్యటన చేయడం లేదని చెప్పారు. రాహుల్ రైతు సమస్యలపై పాదయాత్ర చేస్తున్నారని జీవన్రెడ్డి స్పష్టం చేశారు.