'విద్యుత్ లైన్ల నిర్మాణానికి రంగంలోకి దిగండి'
హైదరాబాద్: వచ్చే ఐదేళ్లలో 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఛత్తీస్‌గఢ్‌ను నుంచి కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్‌గడ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీతో ఎంవోయూ కుదుర్చుకోవాలని నిర్ణయానికి వచ్చింది.
విద్యుత్‌పై సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వీలైనంత తర్వగా ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ లైన్ల నిర్మాణానికి రంగంలోకి దిగాలని ఈ సందర్భంగా అధికారులను కేసీఆర్ ఆదేశించారు. రానున్న రెండేళ్ల తెలంగాణలో విద్యుత్ సమస్యలను అధిగమించాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు.