30.93 లక్షల ఖాతాలు పంట రుణవూఫీకి అర్హమైనవిగా గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణమాఫీ భారం రూ. 16,937 కోట్లకు తగ్గనున్నట్లు తెలిసింది. గ్రామాల్లో సామాజిక తనిఖీలు, ఒక రైతుకు బహుళ అకౌంట్లు, కుటుంబ సభ్యుల అకౌంట్లను లక్ష రూపాయలోపు కుదిస్తే.. రుణ మాఫీ భారం రూ. 17,337 కోట్లలో కనీసం రెండువేల కోట్ల మేరకు తగ్గుతుందని ఆశించిన ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. ఈ కసరత్తుతో కేవలం రూ.400 కోట్లు మాత్రమే తగ్గినట్లు విశ్వసనీయ సమాచారం. శనివారం నాటికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వం ఈ అంచనాకు వచ్చింది. రైతు రుణ మాఫీ విషయుంలో మొత్తం 39 లక్షల ఖాతాలు ఉంటాయని ముందుగా అంచనా వేసినా.. నిబంధనలమేరకు 30,93,574 ఖాతాలు రుణమాఫీకి అర్హమైనవిగా గుర్తించారు.
అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 4,56,286 ఖాతాలుండగా... రూ. 2,682 కోట్లు ఆ జిల్లాలో మాఫీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అత్యంత తక్కువగా రంగారెడ్డి జిల్లాలో 2.20 లక్షల ఖాతాలుండగా... అక్కడ రూ. 950 కోట్లు మాఫీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. జిల్లా వ్యవసాయాధికారులతో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ అంచనాకు వచ్చారు. ఆ ప్రకారం జిల్లాల వారీగా అంచనాలు వేశారు.