(ఫైల్ ఫోటో)
సాక్షి, రంగారెడ్డి: అల్మాస్‌గూడలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్మాస్‌గూడలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థలాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం పరిశీలించారు. జరిగిన ఘటనపై అపార్ట్‌మెంట్ వాసులు, అసోసియేషన్ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రితో పాటు బండగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్,మున్సిపల్ కమిషనర్ సత్యబాబు,కార్పొరేటర్లు ఉన్నారు.
(సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య!)
అల్మాస్‌గూడలో బుధవారం ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే తెలిసిందే.. మృతుల్ని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హరీష్ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. అపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్తులో నివాసముంట్ను హరీష్ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా బయటికి రాకపోవడంతో.. ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు బద్దలు కొట్టి చూడగా.. నలుగురు విగతజీవులుగా కనిపించారు. మృతులను హరీష్, స్వప్న గిరీష్, సువర్ణగా పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment