ఏపీ సీఎంను అరెస్ట్ చేయాలి
నల్గొండ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలంటూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సోమవారం నల్గొండ జిల్లా టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాతాకుల భాస్కర్ మాదిగ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు టీడీపీ భవన్ ఎదుట ఆందోళన చేశారు. వెంటనే ఏపీ అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.