అవినీతిపై చర్చకు వస్తే నిరూపిస్తా
టీఆర్‌ఎస్‌కు నాగం సవాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చకు వస్తే నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ నేత నాగం జనార్దనరెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్ల పాలన సాగుతోందని ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ మొత్తం అవినీతిమయమని ఆరోపించారు.
ఈ ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో సాగునీటి ప్రాజెక్టుగా చూపి కోర్టుకు మాత్రం తాగునీటి ప్రాజెక్టు అని చెప్పడం సరికాదన్నారు. అవినీతిని ప్రశ్నించే వారిని సన్నాసులని తిట్టడం కేసీఆర్‌కు అలవాటై పోయిందన్నారు. అవినీతికి పాల్పడినందుకు గతంలో మాజీ సీఎంలు మధుకోడా, లాలూ ప్రసాద్ యాదవ్‌కు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని దుయ్యబట్టారు.