హ్యాపీ బర్త్‌డే కేసీఆర్‌ గారు: వైఎస్‌ జగన్ | Narendra Modi greets Telangana CM KCR on his birthday | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

Published Sun, Feb 17 2019 11:09 AM | Last Updated on Sun, Feb 17 2019 1:14 PM

Narendra Modi greets Telangana CM KCR on his birthday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ప‍్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ సంపూర్ణ ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా ఉండాలని ప్రధాని మోదీ, వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. మోదీతో పాటు పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

ఇప్పటికే భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ముఖ్యమంత్రికి లేఖ పంపారు. సీఎం కేసీఆర్‌ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో చిరకాలం ప్రజాసేవకు అంకితం కావాలని ఆకాంక్షించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతికి కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.  

కాగా కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడి నేపథ్యంలో తన పుట్టినరోజు (ఫిబ్రవరి 17, ఆదివారం) సందర్భంగా ఎలాంటి వేడుకలు జరుపుకోరాదని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ తన పుట్టినరోజు వేడుకలు జరపవద్దని ఆయన విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement