భూసేకరణే అడ్డంకి! | Obstacle to the acquisition of land! | Sakshi
Sakshi News home page

భూసేకరణే అడ్డంకి!

Published Thu, Nov 20 2014 4:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM

భూసేకరణే అడ్డంకి!

భూసేకరణే అడ్డంకి!

భూ సేకరణ పరిస్థితి ఇలా... (ఎకరాల్లో)
 

 

 

 

 


 ప్రాజెక్టు                  కావాల్సింది    సేకరించింది    సేకరించాల్సింది
 నెట్టెంపాడు               26,542        21,657            4,885
 రాజీవ్‌భీమా              25,799        24,166            1,633
 కల్వకుర్తి లిఫ్ట్            17,254        16,532                722
 జూరాల                     9,167          8,363                804
 కోయిల్‌సాగర్ లిఫ్ట్         7,230          6,476               754
 మొత్తం                    85,992        77,194             8,798
 
గద్వాల: వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా నిర్ణయించిన జిల్లా ప్రాజెక్టులకు భూసేకరణ అడ్డంకిగా మారింది. కీలక పనులు చేసేందుకు మూడు ప్రధాన ప్రాజెక్టులకు 7,240 ఎకరాలు, కోయిల్‌సాగర్ 754, జారాల ప్రాజెక్టుకు 804 ఎకరాల భూమి అవసరం. ఇంతటి కీలకమైన భూసేకరణ ముందుకు సాగకపోవడంతో ప్రాజెక్టు పనులు లక్ష్యం లోగా పూర్తయ్యేలా కనిపించడం లేదు.

నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి భారీ ఎత్తిపోతల పథకాల్లో మట్టి పనులు, రిజర్వాయర్ పనులు, కాలువల తవ్వకాలు పూర్తయ్యా యి. డిస్ట్రిబ్యూటర్లు, తూములు, ప్రధాన సి మెంటు నిర్మాణ పనులకు అవసరమైన భూ మిని సేకరించే సమయంలో కొత్త చట్టం అమల్లోకి రావడం, ప్రభుత్వం భూసేకరణకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. నా లుగేళ్లలో ప్రధాన ప్రాజెక్టుల పనులు పూ ర్తయి ఇప్పటికే పూర్తిస్థాయి ఆయకట్టుకు సా గునీటిని అందించాల్సి ఉంది.

2009 నుంచి 2012 మధ్య అప్పటి ప్రభుత్వాల నిర్లక్ష్యంతో పనులు పూర్తిగా స్తంభించాయి. 2013లో పంప్‌హౌస్‌లలో మినహా మిగతా పనులు కొనసాగలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చా క ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తయి 2015 ఖరీఫ్ నాటికి పూర్తిస్థాయి ఆయకట్టు కు సిద్ధమవుతాయని భావించిన తరుణంలో కొత్త భూసేకరణ చట్టం అడ్డంకిగా మా రింది.

ఇదే అదునుగా కాంట్రాక్టర్లు పేరుకు మాత్రమే పనులు కొనసాగిస్తున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంచనాలను పెం చుతూ జీఓ 13ను జారీ చేశారు. దాని ప్రకా రం కొత్త రేట్లను అమలు చేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రైతు లు కొత్తచట్టం ప్రకారం పరిహారం కావాలని కోరుతున్నారు.
 
 కల్వకుర్తి ఎత్తిపోతల
 
 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు     : 4
 ఆయకట్టు లక్ష్యం            : 3.40లక్షల ఎకరాలు
 నీటి కేటాయింపులు        : 25టీఎంసీలు మొదటి పంప్‌హౌస్ ద్వారా 13వేల ఎకరాలకు
 
 సాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసి, ఇప్పటికే ట్రయల్న్‌న్రు విజయవంతం చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో మొదటి పంపు ద్వారా నీటి విడుదలను ప్రారంభించారు. రెండో లిఫ్టులో మొత్తం ప్రాజెక్టు లక్ష్యం ఉన్నందున మిగతా పనులను వేగవంతం చేసి వచ్చే ఖరీఫ్ నాటికి ప్రాజెక్టులో పనులను పూర్తి చేసేందుకు మిగిలి ఉన్న కొద్దిపాటి భూసేకరణ కీలకంగా ఉంది. ఈ ప్రాజెక్టుకు 17,254ఎకరాలకు సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 16,532ఎకరాలను సేకరించారు. ఇంకా 722ఎకరాలను సేకరించాల్సి ఉంది.
 
 
 జూరాల ప్రాజెక్టు
 
 బ్యాలెన్సింగ్ రిజార్వాయర్లు     : 2
 ఆయకట్టు లక్ష్యం            :  1.07 లక్షల ఎకరాలు
 నీటి కేటాయింపులు        : 17.81 టీఎంసీలు
 
 జూరాల ప్రాజెక్టు జాతికి అంకితమై 17ఏళ్లు పూర్తయినా ఇప్పటి వరకు చివరి ఆయకట్టుకు నీళ్లందని పరిస్థితి. ఇందుకు కారణం లైనింగ్ పనులు పూర్తిస్థాయిలో కాకపోవడం, ఫీల్డ్ ఛానల్స్‌ను చివరి వరకు ఏర్పాటు చేయకపోవడంతో, ప్రాజెక్టు నిర్వాహణ పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. జిల్లాలో ృష్ణానదిపై ఉన్న ఏకైక భారీ సాగునీటి ప్రాజెక్టుకు నిధులను ఇవ్వడంలో నిర్లక్ష్యం చూపడంతో నేటికి పనులు పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 9,167 ఎకరాలు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 8,363 ఎకరాలు సేకరించారు. మిగిలిపోయిన పనులు పూర్తి చేసేందుకు 804ఎకరాలను సేకరించాల్సి ఉంది.
 
 రాజీవ్ భీమా ఎత్తిపోతల
 
 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు    : 5
 ఆయకట్టు లక్ష్యం            : 2.0 లక్షల ఎకరాలు
 నీటి కేటాయింపులు        : 20టీఎంసీలు
 
 రెండవ లిఫ్టు ద్వారా 10వేల ఎకరాలకు సాగునీటి ని అందించేందుకు పనులు పూర్తి చేశారు. భీమా నదిపై ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడం ద్వారా, మక్తల్, దేవరక ద్ర నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. ఈ ప్రాజె క్టు సంగంబండ ఎత్తిపోత, స్టేజి -2 కొత్తకోట లిఫ్టు ద్వారా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో కనీసం 50 నుంచి 60వేల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో నీటి విడుదల ప్రారంభించారు. ఆయకట్టుతో పాటు చెరువులను రిజర్వాయర్లుగా మార్చడంతో పాటు, తాగునీటి అవసరాలకు నీటిని వినియోగిస్తారు. భీమా ప్రాజెక్టు కోసం 25,799ఎకరాలను సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు 24,166ఎకరాలను సేకరించారు. ఇంకా 1,633ఎకరాలను సేకరించాల్సి ఉంది.
 
 నెట్టెంపాడు ఎత్తిపోతల
 
 పంప్‌హౌస్‌లు        : 2, బ్యాలెన్సింగ్  రిజర్వాయర్లు : 7
 ఆయకట్టు లక్ష్యం    : 2లక్షల ఎకరాలు
 నీటి వినియోగం    : 20టీఎంసీలు
 
 గుడ్డెందొడ్డి పంప్‌హౌస్‌లో మొదటి పంపు ద్వారా 10వేల ఎకరాలకు సాగునీటిని అందించేలా అన్ని పనులు పూర్తిచేశారు. ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి అనుబంధ రిజర్వాయర్లకు నీటిని విడుదల చేసే కాల్వలు పూర్తి చేయడంతో పాటు, 40వేల ఎకరాల ఆయకట్టుకు ప్రస్తుత ఖరీఫ్ పంటలకు నీటి విడుదలను ప్రారంభించారు. ఆయకట్టుతో పాటు రిజర్వాయర్ల ద్వారా చెరువును రిజర్వాయర్లుగా మార్చనున్నారు. అన్ని రిజర్వాయర్ల నుంచి డిస్ట్రిబ్యూటరీలు, ఫీల్డ్ చానల్స్‌ను నిర్మించాల్సిన కీలక పనులున్నాయి. నెట్టెంపాడు ప్రాజెక్టు కోసం మొత్తం 26,542 ఎకరాలను సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 21,657 ఎకరాలను సేకరించారు. ఇంకా 4,885 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఈ పనుల్లో ఫీల్డ్ ఛానల్స్, డిస్ట్రిబ్యూటరీల గేట్ల నిర్మాణం, పిల్ల కాలువల తవ్వకాలు చేపట్టాలి.
 
 కోయిల్‌సాగర్ ఎత్తిపోతల
 
 బ్యాలెన్సింగ్ రిజార్వాయర్లు     : 2
 ఆయకట్టు లక్ష్యం            : 50,250ఎకరాలు
 నీటి కేటాయింపులు        : 3.90టీఎంసీలు
 
 ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎత్తిపోతలను ప్రారంభిం చా రు. ఈ ఖరీఫ్‌లో 25వేల ఎకరాల ఆయకట్టు నీటిని అం దించే లక్ష్యం నిర్ణయించారు. ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చే సేందుకు భూసేకరణ పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 7,230ఎకరాలు సేకరించాల్సి ఉండగా 6,476ఎకరాలను సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement