వీణవంక (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చెల్లూరులోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మహిళా మండలి భవన నిర్మాణం చేపట్టడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు బాధ్యులైనవారికి జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే.. చెల్లూరులోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మహిళా సంఘ భవనం నిర్మించటం తగదంటూ 2009లో రిటైర్డు టీచర్ కె.రఘునాథరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం మహిళా మండలి భవన నిర్మాణంపై స్టే ఇచ్చింది.
అయినప్పటికీ అప్పటి ఎంపీ, రాష్ట్ర మంత్రులు, కలెక్టర్ నిర్మాణ పనులను ప్రారంభించారు. దీనిపై రఘునాథరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తమ ఉత్తర్వులు పట్టించుకోనందుకు తీవ్రంగా తప్పుబట్టింది. పాఠశాల ఆవరణలో జరుగుతున్న నిర్మాణాలపై పట్టించుకోనందుకు ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఏఈలు, డీపీవో, డీఈవోలకు నెల రోజుల జైలు, గ్రామ సర్పంచికి మాత్రం మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. కాగా నిందితుల తరఫు న్యాయవాది వినతి మేరకు జైలు శిక్షను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు జైలు
Published Fri, Jul 17 2015 3:50 PM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement