సాక్షి, సూర్యాపేట : ఈ రోజుల్లోని విద్యార్థులకు పొలం పనులు అంటే ఏమిటో తెలియకుండా పోతుంది. వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో.. పొలం పనులపై కొంతమందికి చులకన భావం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సూర్యాపేట జిల్లా గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల ప్రన్సిపాల్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. కళాశాలలోని విద్యార్థినులకు పొలం పనులు పరిచయం చేయాలని అనుకున్నారు. వృతి విద్యలో భాగంగా వారిచే కాసేపు పొలం పనులు చేయించారు. మునగాల మండలం ఆకుపాముల వద్ద కళాశాల పక్కన ఉన్న పొలాల్లోకి దిగిన విద్యార్థినిలు ఉత్సాహంగా వరి నాట్లు వేశారు.100 మంది విద్యార్థినిలతో పాటు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ దృశ్యాలను చూసినవారు విద్యార్థినులపై ప్రశంసలు కురిపించారు. కాగా, ఈ మధ్య కాలంలో పలువురు ప్రభుత్వ అధికారులు కూడా పొలం బాట పడుతున్న సంగతి తెలిసిందే. తమ విధులను కాసేపు పక్కకు పెట్టి పొలం పనులు చేస్తూ సేద తీరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment