మరో రెండుసార్లు కేబినెట్ విస్తరణ: ఈటెల | Telangana cabinet likely to be expanded two times, says Etela rajendar | Sakshi
Sakshi News home page

మరో రెండుసార్లు కేబినెట్ విస్తరణ: ఈటెల

Published Mon, Jun 2 2014 12:33 PM | Last Updated on Mon, Mar 25 2019 3:09 PM

మరో రెండుసార్లు కేబినెట్ విస్తరణ: ఈటెల - Sakshi

మరో రెండుసార్లు కేబినెట్ విస్తరణ: ఈటెల

హైదరాబాద్ : మరో రెండుసార్లు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సోమవారం ఆయన తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ కేసీఆర్ అప్పగించే ఎలాంటి బాధ్యతనైనా అంకితభావంతో పూర్తి చేస్తానని తెలిపారు. కేసీఆర్తో పాటు 11మంది టీఆర్ఎస్ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

కరీంనగర్ జిల్లాకు చెందిన ఈటెల ఉస్మానియా యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. విద్యార్థి నేతగా మంచి పేరున్న ఆయన 2002లో టీఆర్ఎస్‌లో చేరారు. 2004లో కమలాపూర్‌ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నియ్యారు. తర్వాత హుజూరాబాద్‌ నుంచి 2009 సాధారణ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ వరుసగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు. ఆది నుంచి పార్టీలో కీలకపాత్ర వహిస్తున్న ఈటెల పార్టీ శాసనసభాపక్షనేతగా కూడా పనిచేశారు.

ఈటెల రాజేందర్, టీఆర్ఎస్, కేసీఆర్, మంత్రివర్గ విస్తరణ, Etela rajendar, trs, kcr, cabinet, cabinet expansion

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement