ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, చరిత్ర తదితర అంశాలను భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పాఠ్యపుస్తకాల్లో వాటిని పొందుపర్చాలని నిర్ణయించింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు, సాంఘిక శాస్త్రం పుస్తకాల్లో తెలంగాణ సంస్కృతి, సాహిత్యం, చరిత్ర తదితర అంశాలు ప్రతిబింబించేలా పాఠ్యాంశాల్లో మార్పులు చేసేందుకు సబ్జెక్టుల వారీగా పుస్తక సమీక్ష కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ గురువారం జీఓ 51 జారీ చేశారు. మాజీ వైస్ చాన్స్‌లర్లు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, ప్రముఖులు, అధికారులతో ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. వీటిపై పాఠశాల విద్యాకమిషనర్ తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తెలుగు పాఠ్యపుస్తకాల సమీక్ష కమిటీ సభ్యులు...
జాతీయ స్థాయి: రమాకాంత్ అగ్నిహోత్రి (రిటైర్‌డ ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీ)
రాష్ట్ర స్థాయి: రవ్వా శ్రీహరి (మాజీ వీసీ, ద్రవిడ విశ్వవిద్యాలయం), కోవెల సుప్రసన్నాచార్య(రిటైర్‌డ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ), ప్రొఫెసర్ బన్న ఐలయ్య (కాకతీయ యూనివర్సిటీ), ఎస్.రఘు (అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీ), డాక్టర్ గుమ్మన్నగారి బాలా శ్రీనివాస్‌మూర్తి (అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలంగాణ యూనివర్సిటీ).
ఎక్స్‌పర్ట్స్..: చుక్కా రామయ్య(విద్యావేత్త), నందిని సిధారెడ్డి (రిటైర్డ్ లెక్చరర్), దేశపతి శ్రీనివాస్ (తెలుగు పండిట్), డి.చంద్రశేఖర్‌రెడ్డి (రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఓరియంటల్ కాలేజీ) డి.సాంబమూర్తి(రిటైర్డ్ ప్రిన్సిపాల్, కాలేజీ టీచర్ ఎడ్యుకేషన్), వేణు సంకోజు (రిటైర్డ్ లెక్చరర్, తెలంగాణ రచయితల వేదిక), నలిమెల భాస్కర్(రిటైర్డ్ లెక్చరర్).
రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి: సువర్ణ వినాయక్ (కరిక్యులమ్ అండ్ టెక్ట్స్‌బుక్స్, తెలంగాణ ఎస్‌సీఈఆర్‌టీ, వి.శరత్‌బాబు, (తెలుగు పండిట్), పల్లెర్ల రామ్మోహన్‌రావు, వి. చెన్నయ్య (స్కూల్ అసిస్టెంట్స్).
సాంఘిక శాస్త్రాల పుస్తక సమీక్ష కమిటీ సభ్యులు..
జాతీయ స్థాయి: సీఎన్ సుబ్రహ్మణ్యం (ఏకలవ్య వర్సిటీ, భోపాల్), ఎంవీ శ్రీనివాసన్ (అసోసియేట్ ప్రొఫెసర్, డీఈఎస్‌హెచ్, ఎన్‌సీఈఆర్‌టీ).
రాష్ట్ర స్థాయి: డాక్టర్ కె.విజయబాబు (హిస్టరీ ప్రొఫెసర్ కాకతీయవర్సిటీ) కె.కైలాష్ (పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీ), ప్రొఫెసర్ కోదండరాం (పొలిటికల్ సైన్స్ విభాగం, సికింద్రాబాద్ పీజీ కాలేజీ) డాక్టర్ ఈఎస్ నాగిరెడ్డి (పురావస్తు శాఖ).
క్షేత్రస్థాయి: ఎ.లక్ష్మణరావు (ఎస్‌ఏ, కరీంనగర్) డాక్టర్ ఆర్.గణపతి (ఎస్‌ఏ వరంగల్), పి.జగన్‌మోహన్‌రెడ్డి, పి.శ్రీనివాసులు, (ఎస్‌ఏ, మెదక్) పి.రత్తంగపాణిరెడ్డి(ఎస్‌ఏ, మహబూబ్‌నగర్), ఎం.పాపయ్య (లెక్చరర్, ఎస్‌సీఈఆర్‌టీ).
అన్ని స్థాయిల సమన్వయం-మార్గదర్శనం..
దీపిక, కృష్ణమోహన్, డాక్టర్ ఎన్.ఉపేందర్‌రెడ్డి(కరిక్యులమ్ అండ్ టెక్స్ట్ బుక్స్ విభాగం) ఎస్.జగన్నాథరెడ్డి (డెరైక్టర్, తెలంగాణ ఎస్‌సీఈఆర్‌టీ).
పాఠ్యాంశాల్లో మార్పులు
Published Fri, Aug 29 2014 1:59 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM
Advertisement
Advertisement