ప్రీపెయిడ్‌ మీటర్లు వచ్చేశాయ్‌..! | Telangana introducing prepaid electricity meters | Sakshi
Sakshi News home page

ప్రీపెయిడ్‌ మీటర్లు వచ్చేశాయ్‌..!

Published Mon, Dec 12 2016 1:58 AM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM

ప్రీపెయిడ్‌ మీటర్లు వచ్చేశాయ్‌..!

ప్రీపెయిడ్‌ మీటర్లు వచ్చేశాయ్‌..!

- ఇప్పటికే వంద మీటర్ల బిగింపు.. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌
- త్వరలో మరిన్ని కార్యాలయాలకు అమర్చేలా ప్రణాళిక
- మలి దశలో గృహ, వాణిజ్య కనెక్షన్లకు అమలు
- రూ.500 నుంచి రూ. 5 వేల ఖరీదు చేసే రీచార్జ్‌ కార్డులు  


సాక్షి, హైదరాబాద్‌:
ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లో ఎడాపెడా విద్యుత్‌ను వినియోగించడం ఇకపై కుదరదు. విద్యుత్‌ దుబారాకు చెక్‌ పెట్టేందుకు తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్‌ పీడీసీఎల్‌) సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ప్రీపెయిడ్‌ మీటర్ల విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఇప్పటికే హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ పరిధిలోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, పీవీఘాట్, ఎన్టీఆర్‌ ఘాట్, ఎర్రమంజిల్‌ కోర్టు, గవర్నర్‌ ఆఫీస్‌ సహా మరో వంద ప్రభుత్వ కార్యాల యాలు, పాఠశాలలకు పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఈ ప్రీపెయిడ్‌ మీటర్లను అమర్చింది. వీటి పనితీరు సంతృప్తికరంగా ఉండటంతో ఇకపై మీటర్ల బిగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయిచింది.

ఆలస్యంగా అమలులోకి..
గ్రేటర్‌ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, హాస్టళ్లు, కార్పొరేషన్‌ ఆఫీసులు ఇలా 22 వేల కనెక్షన్లు ఉంటాయి. వీటి నుంచి నెలానెలా బిల్లులు వసూలు కాకపోగా, బకా యిలు భారీగా పేరుకుపోతున్నాయి. పర్య వేక్షణ లోపం వల్ల విద్యుత్‌ దుబారా పెరిగి నష్టాలకు కారణమవుతోంది. ఎలాగైనా ఈ నష్టాల నుంచి సంస్థను గట్టెక్కించాలని భావిం చిన డిస్కం.. బెంగాల్‌ సహా ఉత్తరాది రాష్ట్రాలో అమల్లో ఉన్న ప్రీపెయిడ్‌ మీటర్‌ విధానాన్ని హైదరాబాద్‌లో అందుబాటులోకి తీసుకురావా లని భావించింది. నిజానికి మార్చి చివరి నాటికే ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చి ఇప్పటికీ కార్యరూపం దాల్చింది.

మలి దశలో గృహాలకు..
నగరంలో చాలామంది తమ ఇళ్లను ఇతరులకు అద్దెకు ఇస్తున్నారు. వీరిలో చాలామంది విద్యు త్‌ వినియోగంపై ఆంక్షలు పెడుతున్నారు. ఈ క్రమంలో యజమానులు, అద్దెవాసులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రదేశాల్లో ప్రీపెయిడ్‌ మీటర్లను అమర్చడం వల్ల ఘర్షణలకు తావు లేకుండా చేయవచ్చని భావిస్తుంది. ప్రస్తుతం గ్రేటర్‌లో 41 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 35.5 లక్షల గృహ, ఐదున్నర లక్షల వాణిజ్య, 45 వేల పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. వీటి నుంచి నెలకు రూ.750–800 కోట్ల బిల్లు వసూలు కావాల్సి ఉండగా సగానికిపైగా వసూలు కావడం లేదు. దీంతో ఈ నష్టాలను అధికారులు లైన్‌లాస్‌ ఖాతాలో జమ చేసి చేతులు దులుపుకుంటున్నారు.

కస్టమర్‌ సెంటర్లలో రీచార్జ్‌ కార్డులు..
ప్రస్తుతం ఉన్న మెకానికల్‌ మీటర్లను తొలగించి, వాటి స్థానంలో ప్రీపెయిడ్‌ కార్డుతో అనుసంధానించిన ప్రత్యేక మీటర్‌(సెల్‌ఫోన్‌ రీచార్జ్‌ తరహా)ను అమర్చుతారు. దీనికి ఓ సిమ్‌కార్డును అనుసంధానిస్తారు. వినియోగదారుడు ప్రతినెలా తన చేతిలోని సెల్‌ ఫోన్‌ రీచార్జీ చేసుకున్నట్లుగానే ఇకపై ఇంట్లోని విద్యుత్‌ మీటర్‌ను రీచార్జ్‌ చేసు కోవాల్సి ఉంటుంది. కార్డులో బ్యాలెన్స్‌ ఉన్నంత వరకే ఇంట్లో విద్యుత్‌ లైట్లు వెలుగుతాయి. ఈ ప్రీపెయిడ్‌ మీటర్ల రీచార్జి కార్డులను రూ.500 నుంచి రూ.5 వేల విలువతో అందుబాటులోకి తెచ్చింది. నగరంలోని అన్ని కస్టమర్‌ సర్వీసు సెంటర్లలో ఇవి అందుబాటులో ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement