'ఎవరి పరీక్షలు వారివే...ఉమ్మడి ప్రసక్తే లేదు' | Telangana to conduct separate inter exams | Sakshi
Sakshi News home page

'ఎవరి పరీక్షలు వారివే...ఉమ్మడి ప్రసక్తే లేదు'

Published Fri, Nov 14 2014 12:07 PM | Last Updated on Sat, Aug 11 2018 7:33 PM

Telangana to conduct separate inter exams

హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ పరీక్షల వివాదం మళ్లీ మొదటికొచ్చింది. మార్చి11 నుంచి ఉమ్మడి పరీక్షలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ సర్కార్ మాత్రం ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇంటర్ పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించే ప్రసక్తే లేదనే స్పష్టం చేసింది. ఎవరి పరీక్షలు వారే నిర్వహించుకోవాలని సూచించింది.

 

ఇంటర్ పరీక్షలను ప్రత్యేకంగా నిర్వహించేందుకు షెడ్యూల్ తయారు చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఇదే అంశం శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలను తామే నిర్వహించుకుంటామని తేల్చి చెప్పారు.


పరీక్షల టైం టేబుల్....

తేదీలు            సబ్జెక్టు

 మార్చి 11    ఇంటర్ ఫస్టియర్, ద్వితీయ భాష (తెలుగు తదితర)
 మార్చి 12    సెకండ్ ఇయర్, ద్వితీయ భాష (తెలుగు తదితర)
 మార్చి 13    ఇంటర్-1 ఇంగ్లీష్
 మార్చి 14    ఇంటర్-2 ఇంగ్లీష్
 మార్చి 16    గణితం-1ఎ, బోటనీ-1, సివిక్స్-1
 మార్చి 17    గణితం-2ఎ, బోటనీ-2, సివిక్స్-2
 మార్చి 18    జువాలజీ-1, హిస్టరీ-1
 మార్చి 19    గణితం-2బి, జువాలజీ-2, హిస్టరీ-2
 మార్చి 20    ఫిజిక్స్-1, ఎకనమిక్స్-1
 మార్చి 23    ఫిజిక్స్-2, ఎకనమిక్స్-2
 మార్చి 24    కెమిస్ట్రీ-1, కామర్స్-1, సోషియాలజీ-1
 మార్చి 25    కెమిస్ట్రీ-2, కామర్స్-2, సోషియాలజీ-2
 మార్చి  26    జువాలజీ-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, హోమ్ సైన్స్-1
 మార్చి 27    జువాలజీ-2, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, హోమ్ సైన్స్-2
 మార్చి 30    జాగ్రఫీ-1, మోడ్రన్ లాంగ్వేజ్ పేపరు-1
 మార్చి 31    జాగ్రఫీ-2, మోడ్రన్ లాంగ్వేజ్ పేపరు-2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement