కూలీల సొమ్ము వడ్డీకి.. | The amount of labor   Interest .. | Sakshi
Sakshi News home page

కూలీల సొమ్ము వడ్డీకి..

Published Wed, Jun 25 2014 3:06 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

కూలీల సొమ్ము  వడ్డీకి.. - Sakshi

కూలీల సొమ్ము వడ్డీకి..

‘ఉపాధి’ డబ్బుతో ఏజెన్సీల అక్రమ వ్యాపారం
 
4 నెలలుగా కూలీలకు అందని వేతనాలు
బ్యాంకులతో నిర్వాహకుల కుమ్మక్కు
డ్వామా అధికారుల విచారణలో వెల్లడి
28 ఏపీజీవీబీ శాఖలకు నోటీసులు
జీరోమాస్ సంస్థకు కళ్లెం త్వరలో పోస్టాఫీసుల ద్వారా చెల్లింపులు
రాష్ర్ట కార్యాలయానికి నివేదిక అందజేత

 
 
హన్మకొండ :జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మరో బాగోతం బట్టబయలైంది. కూలీలకు చెల్లించాల్సిన వేతనాలను సకాలంలో ఇవ్వకుండా... వాటిపై వచ్చే వడ్డీతో జేబులు నింపుకుంటున్నారు. ప్రతి నెలా రూ.10 లక్షలకు పైగా మిత్తిని తమ ఖాతాలో జమ చేసుకుంటున్నారు. వడ్డీ వ్యాపారంలో ఏజెన్సీలు ప్రధాన పాత్ర పోషించగా... బ్యాంకర్లు, మండలస్థాయి అధికారులు తమ వంతు సహకారం అందించారు. ఫలితంగా కూలీలకు నెలల తరబడి వేతనాలు పెండింగ్‌లోరూ.50 లక్షలకు పైగా మిత్తి స్వాహా
 జిల్లాలో ఉపాధి హామీ కింద పనులు చేసిన కూలీలకు నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవడం... ఏజెన్సీల ఖాతాల్లో ఈ నిధులు భద్రంగా ఉండడాన్ని డ్వామా అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. అనుమానంతో మూడు ఏజెన్సీల పని తీరుపై విచారణ చేపట్టారు. కూలీల సొమ్మును నెలల తరబడి బ్యాంకుల్లో నిల్వచేసినట్లు గుర్తించారు. ఆ సొమ్ముకు సంబంధించి సంస్థ నిర్వాహకులు వడ్డీ తీసుకున్నట్లు, ప్రతి నెలా ఆలస్యంగా వేతనాలు ఇస్తున్నట్లు తేటతెల్లమైంది. ప్రధానంగా ఏపీజీవీబీ బ్యాంక్ నుంచి రావాల్సిన సుమారు రూ. 14 కోట్లు ఇప్పటికీ జీరోమాస్ సంస్థ ఖాతాల్లోనే ఉన్నట్లు గ్రహించారు.

రెండు నెలల కిందటే నిధులు విడుదల చేసినా.. పలు కారణాలను సాకుగా చూపిస్తూ ఆ సంస్థ తమ ఖాతాల్లోనే పెట్టుకున్నట్లు... బ్యాంకర్లు కూడా వారికి సహకరిస్తూ వడ్డీ జమ చేసినట్లు వారి విచారణలో బహిర్గతమైంది. అదేవిధంగా ఎనిమిది మండలాల్లో ఫిమో, ఒక్క మండలంలో మణిపాల్ ఏజెన్సీలు కూడా కూలీ డబ్బును చెల్లించలేదు. నాలుగు నెలల వ్యవధిలో 50 మండలాల పరిధిలోని మూడు ఏజెన్సీలు కూలీల వేతనాలపై సుమారుగా రూ. 50 లక్షలకు పైగా వడ్డీని పొందినట్లు తేలింది. దీంతో ఎక్కువ మండలాల్లో ఏపీజీవీబీ నుంచి వేతనాలు చెల్లిస్తున్న జీరోమాస్ సంస్థకు కళ్లెం వేశారు. చెల్లింపు అధికారాలను నిలిపివేశారు. ప్రస్తుతం 28 మండలాల్లో చెల్లింపులన్నీ నేరుగా రాష్ట్ర కార్యాలయం నుంచి పోస్టాఫీసు ఖాతాలకు మారుస్తూ డ్వామా పీడీ ఆదేశాలిచ్చారు.

 పడగా... వారి కుటుంబాలు పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారుు.  ఎట్టకేలకు ఈ బాగోతాన్ని గ్రహించిన డ్వామా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఏజెన్సీలకు కళ్లెం వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏజెన్సీల పాత్ర లేకుండా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్టల్ (డీఓపీ) విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. కూలీలకు ఏజెన్సీలతో సంబంధం లేకుండా నేరుగా చెల్లింపులు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర కార్యాలయానికి నివేదించారు. అంతేకాదు... కూలీ డబ్బులతో వడ్డీ వ్యాపారం చేస్తున్న మూడు ఏజెన్సీలు, 28 బ్యాంకులకు నోటీసులు జారీ చేశారు.

జిల్లాలో 3 ఏజెన్సీలు...

ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించేందుకు అప్పటి సర్కారు ఏజెన్సీలకు అధికారాన్ని కట్టబెట్టింది. కూలీలు చేసిన పని దినాలను క్షేత్రస్థాయి సిబ్బంది నమోదు చేసిన తర్వాత... వారి కూలి డబ్బులు ఏజెన్సీల ఖాతాల్లో జమ అవుతాయి. అక్కడ నుంచి కూలీలకు చెల్లింపులు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో మూడు ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించారు. ఎనిమిది మండలాల పరిధిలో యాక్సిస్ బ్యాంక్ తరఫున ఫిమో... తాడ్వాయి మండలంలో యాక్సిస్ బ్యాంక్ తరఫున మణిపాల్.... 28 మండలాల్లో ఏపీజీవీబీ తరఫున జీరోమాస్ సంస్థలు ఏజెన్సీలుగా ఉన్నాయి. ఈ క్రమంలో ఏజెన్సీ నిర్వాహకులు అక్రమాలకు తెరలేపారు. బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై వడ్డీ వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. కూలీలకు చెల్లించాల్సిన డబ్బులను వారికి ఇవ్వకుండా.. ఏజెన్సీ ఖాతాల్లో సర్కారు జమ చేసిన మొత్తాన్ని నెలల తరబడి నిల్వ ఉంచుతూ వడ్డీ దండుకుంటున్నారు.

ఆ మండలాలు ఇవే...

28 మండలాలకు సంబంధించి జీరోమాస్ సంస్థ ఖాతాలో ఉన్న కూలీ డబ్బులు రూ. 14 కోట్లను కూలీల పోస్టాఫీసు ఖాతాల్లో జమ చేసేలా డ్వామా అధికారులు చర్యలు చేపట్టారు. బచ్చన్నపేట, భూపాలపల్లి, చెన్నారావుపేట, చేర్యాల, ధర్మసాగర్, డోర్నకల్, ఘన్‌పూర్, గూడూర్, జనగాం, కేసముద్రం, కొడకండ్ల, మద్దూర్, మహబూబాబాద్, మరిపెడ, మొగుళ్లపల్లి, నల్లబెల్లి, నర్సంపేట, నర్సింహులపేట, నెల్లికుదురు, పరకాల, రేగొండ, శాయంపేట, వెంకటాపూర్, వర్ధన్నపేట, చిట్యాల, దేవరుప్పుల, దుగ్గొండి, గీసుగొండ, స్టేషన్ ఘన్‌పూర్, గోవిందరావుపేట, హన్మకొండ, హసన్‌పర్తి, ఖానాపూర్, కురవి, ములుగు, నర్మెట్ట, నెక్కొండ, పాలకుర్తి, రాయపర్తి, తొరూర్, జఫర్‌గఢ్ మండలాల్లో పోస్టాఫీసుల్లో ఖాతాలు తీయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ మండలాల్లో చెల్లింపులు ఆగిపోనున్నాయి.
 
 వడ్డీ వ్యాపారం నిజమే..

బ్యాంకులు, ఏజెన్సీలు కూలీల వేతనాలు చెల్లించకుండా ఖాతాల్లోనే నిల్వ చేశారుు. కూలీలకు వేతనాలు అందకపోవడంపై విచారణ చేశాం. కూలీల వేతనాలతో ఏజెన్సీలు వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నట్లు గుర్తించాం. ముందుగా 28 మండలాల్లో ఏపీజీవీబీ ఖాతాల రద్దుతోపాటు బ్యాంకులకు నోటీసులు జారీ చేశాం. ఆ సంస్థ పరిధిలోని ఉపాధి కూలీలకు పోస్టాఫీసుల నుంచి వేతనాలు ఇస్తాం. యాక్సిస్ బ్యాంక్ ఖాతాలను కూడా వచ్చే నెల నుంచి రద్దు చేయనున్నట్లు లేఖ పంపించాం.

 - వాసం వెంకటేశ్వర్లు, డ్వామా  పీడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement