తెలంగాణ ప్రాంత విముక్తి కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారని, వారి చరిత్ర ప్రజలకు తెలిసేలా ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నస్పూర్ కాలనీలోని సింగరేణి న్యూ కమ్యూనిటీ హాలులో విమోచన దిన వార్షికోత్సవ సభ నిర్వహించారు.
శ్రీరాంపూర్ : తెలంగాణ ప్రాంత విముక్తి కోసం ఎంద రో ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర ప్రజలకు తెలిసే విధంగా ప్రభుత్వం తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. శని వారం సాయంత్రం నస్పూర్ కాలనీలోని సింగరేణి న్యూ కమ్యూనిటీ హాల్‌లో విమోచన దిన వార్షికోత్సవ సభ నిర్వహించారు. అంతకుముం దు నర్సయ్య భవన్ నుంచి కమ్యూనిటీ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండా ఎగురవేసి సభ వేదిక వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. అనంతరం సభలో వెంకటరెడ్డి మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో అమరు ల పేర్లను ప్రస్తావించిన సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే విముక్తి దినాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. మహా రాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తుండ గా గత ప్రభుత్వాల లాగే కే సీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చే శారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అన్ని వర్గాలు పాల్గొనగా బీజేపీ దీనిని హిందువులపై ముస్లింల దాడిగా పేర్కొంటూ మతం రంగు పు లుముతోందని విమర్శించారు. తెలంగాణ సా యుధ పోరాట యోధుల స్మృతి చిహ్నాలను ఏ ర్పాటు చేయాలన్నారు. తెలంగాణకు విముక్తి జ రిగినప్పటికీ ఇంకా అభివ ృద్ధిలో వెనుకబడే ఉం దన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో ఎందరో కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేసి తెలంగాణ కోసం ప్రా ణత్యాగాలు చేశారన్నారు.
నైజాం సైన్యం గిరిజ న వీరులైన రాంజీగోండా, కొమురంభీం వంటి యోధులను హతమార్చిందన్నారు. తెలంగాణ పోరాటంలో పాల్గొన్న ముగ్ధం మొహినొద్దీన్, శేషగిరిరావు, రంగయ్య, పాపయ్య, కొమురయ్య, గంగారాంలు ఏఐటీయూసీ నిర్మాణంలో ఉన్నారని తెలిపారు. అప్పటి పోరాటంలో నిర్మల్‌లో వెయ్యి మందిని ఉరి తీశారని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరిచి అధికారింగా విమోచన దినాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పోరాట చరిత్ర గ్రంథాలను పుస్తకాల రూపంలో తెచ్చి ప్రజలను చైతన్య పరుస్తామన్నారు. నిషేధ కాలంలో అజ్ఞాతంగా సాయుధ పోరాటాలు చేసిన కమ్యూనిస్టుల ఆశయాలు నెరవేరే వరకు సమరశీల పోరాటాలు చేస్తామన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేని శంకర్ సభకు అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ డెప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం.వీరభద్రయ్య, మంద మల్లారెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి కలవేని కుమారస్వామి, బ్రాంచి కార్యదర్శులు ఎల్.శ్రీనివాస్, కిషన్‌రావు, బాజీసైదా, సీపీఐ జిల్లా నాయకుల ఖలీందర్, భీంరాజు, పాల్, జోగుల మల్లయ్య, కే శంకరయ్య, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఉప్పలయ్య, నర్సింహులు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుకూరి నగేశ్ పాల్గొన్నారు.
సాయుధ పోరాటంలో ప్రాణత్యాగాలు..
తాండూర్ : తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది కమ్యూనిస్టులు ప్రాణ త్యాగం చేయడంతోనే తెలంగాణకు విముక్తి లభించింద ని మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ అన్నారు. తె లంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవం సం దర్భంగా శనివారం తాండూర్‌లో పార్టీ జెండా ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణ విముక్తి కోసం జరిగిన ఉద్య మం చారిత్రాత్మకమైందన్నారు. ఉద్యమకారుల పేర్లు వాడుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేడు రజాకార్ల నాయకుడైన ఖాసీంరజ్వీని కొని యాడడం సిగ్గుచేటన్నారు.
కార్పొరేట్, పారిశ్రామిక శక్తులకు ప్రధాని నరేంద్రమోడీ ఏజెంట్‌గా పని చేస్తున్నారని ఆరోపించారు. ఆనాడు క్విట్ ఇండియా పేరుతో దేశం నుంచి బ్రిటిష్‌వాళ్లను తరిమికొడితే నేడు ఎఫ్‌డీఐల పేరుతో పరాయిదేశస్తులను దేశానికి స్వాగతించడం హేయమైన చర్య అన్నారు. విదేశీ దోపిడీని ఆహ్వానించే ప్రక్రియను మానుకోవాలని హితవుపలికారు. ఏఐటీయూసీ జిల్లా నాయకుడు చిప్ప నర్సయ్య, సీపీఐ మండల కార్యదర్శి మామిడాల రాజేశ్, నాయకులు సంపత్‌రావు, కృష్ణమోహన్, మల్లయ్య, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు అజయ్, రాజశేఖర్ పాల్గొన్నారు.
విమోచన దినోత్సవాన్నిప్రభుత్వమే నిర్వహించాలి..
Published Sun, Sep 14 2014 1:27 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM
Advertisement