కమిటీలో కడియం, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం మార్గదర్శకాలను రూపొందించేందుకు ఉప ముఖ్యమంత్రి (విద్యాశాఖ మంత్రి) కడియం శ్రీహరి అధ్యక్షతన, విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డిలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి సచివాలయంలో జరిగిన కేబినెట్‌భేటీలో నిర్ణయించారు. ఈ త్రిసభ్య కమిటీ బుధవారం (ఫిబ్రవరి 4న) సచివాలయంలో విద్యాశాఖ, వివిధ సంక్షేమశాఖల అధికారులతో సమావేశమై ఈ పథకంలో భాగంగా ఏయే మార్గదర్శకాలను పెట్టాలనే విషయంపై చర్చిస్తుంది. ఈ చర్చల ప్రాతిపదికన వచ్చే సలహాలు,సూచనలతో ఈ కమిటీ సీఎం కేసీఆర్‌కు తమ ప్రతిపాదనలను సమర్పిస్తుంది. వీటిని పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం మార్గదర్శకాలను ఖరారు చేయనున్నారు.