‘బాబు’పై టీఆర్‌ఎస్ ఫైర్ | trs leaders takes on tdp | Sakshi
Sakshi News home page

‘బాబు’పై టీఆర్‌ఎస్ ఫైర్

Published Wed, Oct 22 2014 2:41 AM | Last Updated on Sat, Sep 22 2018 7:53 PM

‘బాబు’పై టీఆర్‌ఎస్ ఫైర్ - Sakshi

‘బాబు’పై టీఆర్‌ఎస్ ఫైర్

ఆదిలాబాద్ టౌన్ : తెలంగాణకు కరెంటు వా టాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం ఆది లాబాద్‌లోని తెలంగాణ చౌక్‌లో అతడి దిష్టిబొమ్మను టీఆర్‌ఎస్ నాయకులు దహనం చేశారు. తెలంగాణకు వచ్చే కరెంటు వాటాను కట్టడి చేయాలని చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు సాజిదొద్దీన్, నాయకులు పవన్, ప్రశాంత్, ప్రేమేందర్, వామన్, నర్సింగ్, ఉరుస్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
 
కాగజ్‌నగర్ టౌన్ : కాగజ్‌నగర్‌లోని రాజీవ్‌గాంధీ చౌక్ వద్ద మంగళవారం టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చంద్రబాబు ఫ్లెక్సీ దహనం చేశారు.   సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య,  నాయకులు భాస్కర్‌రెడ్డి, ఈర్ల విశ్వేశ్వర్ రావు, కీర్తి శ్రీనివాస్, సురేశ్ యాదవ్, కొంగ సత్యనారాయణ, కలికోట రమణయ్య  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement