ఒకేసారి రెండు నెలల పింఛన్లు
అక్టోబర్, నవంబర్ నెలల పింఛన్లు రెండింటినీ ఒకేసారి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 10 నుంచి 15వ తేదీ మధ్య పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని, గ్రామ పంచాయతీల వారీగానే పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు.
పింఛన్ల పంపిణీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ సోమవారం భేటీ అయ్యారు. పింఛన్ల కోసం ఇప్పటివరకు 25.68 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. గుర్తించిన లబ్ధిదారులను పంచాయతీల వారీగా జాబితా విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.