ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన మహిళలు
హైదరాబాద్: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇంటి ముందు మహిళలు ధర్నాకు దిగారు. గత పదిహేనేళ్లుగా ఉన్న అమ్ముగూడా భూ వివాదాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇంటి ముందు బైఠాయించారు. సైనిక పురి అమ్ముగూడా వద్ద 15 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే లేఅవుట్ చేసి 120 ప్లాట్లను అమ్మారు. హుడా అప్రూవుడ్ లేఅవుట్ అని చెప్పడంతో చాలా మంది మాజీ సైనికులు ప్లాట్లు కొనుగోలు చేశారు.
అనంతరం ఇళ్లు కట్టుకోవడానిక అనుమతి కోసం వెళ్ళితే అధికారులు ఈ లేఅవుట్ పై కేసు నడుస్తోంది అనుమతీ ఇవ్వలేమని చెప్పారు. గత 15 సంవత్సరాలుగా తమ సమస్యను పరిష్కరించాలని భాదితులు ముత్తిరెడ్డి చుట్లూ తిరుగుతున్నారు. అయినప్పటికీ తమ సమస్యను పరిష్కరించక పోవడంతో భాదితులు గురువారం హబ్బిగూడలోని ఎమ్మెల్యే ఇంటి ముందు ఆందోళనకు దిగారు.