ఆ ఇద్దరూ బొమ్మా బొరుసే: ఓవైసీ | asaduddin owaisi speech in elections | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరూ బొమ్మా బొరుసే: ఓవైసీ

Published Thu, Feb 16 2017 5:37 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM

ఆ ఇద్దరూ బొమ్మా బొరుసే: ఓవైసీ - Sakshi

ఆ ఇద్దరూ బొమ్మా బొరుసే: ఓవైసీ

ఖాన్‌పూర్‌: నరేంద్ర మోదీ, అఖిలేష్‌ యాదవ్‌ లు నాణానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్లని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఎద్దేవా చేశారు. బుధవారం సాయంత్రం ఆయన కొలోనిలాంజ్‌ ప్రాంతంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఈ వాఖ్యలు చేశారు. మోదీ, అఖిలేశ్‌ ఇద్దరూ.. ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తమ రాష్ట్రాలలో చోటు చేసుకున్న అల్లర్లను అదుపుచేయలేకపోయారని ఎండగట్టారు. ఆర్యానగర్‌ నియోజక వర్గం నుంచి తమ పార్టీ పోటిచేస్తుందని, ఇక్కడ ఎస్‌పీ, బీఎస్‌పీలు ముస్లిం ఓట్లను తమవైపు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

ముజఫర్‌ నగర్‌లో అల్లర్లు జరిగినప్పుడు బాధితులకు అఖిలేశ్‌ ప్రభుత్వం సరైన న్యాయం చేయలేకపోయిందని, అదేవిధంగా గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు మోదీ ముస్లింలకు సరైన న్యాయం చేయలేదని విమర్శించారు. తాను ఉత్తరప్రదేశ్‌లో డజన్ల సంఖ్యలో సభలు నిర్వహించిన్నప్పటికీ ఎక్కడా కూడా ఎలాంటి అల్లర్లు చోటుచేసుకోలేదని తెలిపారు. నిజానికి సమాజ్‌వాదీ పార్టీ ముస్లిం ఓట్లను ఎక్కడ మేము లాక్కుపోతామని భయపడుతుందన్నారు. అఖిలేష్‌ ప్రభుత్వం ముస్లింలకు ఇళ్లు, స్కూళ్లు కట్టిస్తామని వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చలేదన్నారు. తమ పార్టీ నుంచి .. 8 నుంచి 10 మంది ఎమ్యేల్యేలు రాష్ట్ర శాసనసభకు ఎన్నికవుతారని ధీమా వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement