'ఈ సారి రెండు దీపావళి పండగలు'
పాట్నా: బిహార్ ప్రజలు ఈ సారి రెండు దీపావళి పండగలు చేసుకుంటారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఒకటి పండగ రోజు (దీపావళి).. మరొకటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజు అని మోదీ పేర్కొన్నారు. శుక్రవారం బిహార్లోని బంకాలోని జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ ప్రసంగించారు.
ఇటీవల తాను అమెరికా పర్యటనకు వెళ్లినపుడు అక్కడి బిహార్ ప్రజలు.. బిహార్ను మార్చాలని కోరారని మోదీ చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం లేదని నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని విమర్శించారు. బిహార్కు ఉద్యోగాలు, అభివృద్ధి పథకాలు కావాలని అన్నారు. బిహార్ కు లక్షా 25 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని కేంద్రం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ అది ప్రజల హక్కు అని మోదీ చెప్పారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని గెలిపించాలని మోదీ కోరారు. ఈ నెల 12 నుంచి ఐదు దశల్లో బిహార్ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.