రైలు ప్రమాదంలో నలుగురి మృతి | Four died in Train accident | Sakshi
Sakshi News home page

రైలు ప్రమాదంలో నలుగురి మృతి

Published Sun, Nov 3 2013 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM

Four died in Train accident

ముంబై: ముంబై నుంచి కొల్హాపూర్‌కు బయలుదేరిన కోయినా ఎక్స్‌ప్రెస్ నలుగురు గ్యాంగ్‌మెన్లను ఢీకొట్టింది. దీంతో ఘటనాస్థలంలోనే నలుగురు మృతి చెందారు. అందిన వివరాల మేరకు ఆదివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో టాకూర్లి-కళ్యాణ్ రైల్వేస్టేషన్ల మధ్య ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రతి రోజు మాదిరిగానే ఈ రోజు కూడా రైల్వేట్రాక్‌ను గ్యాంగ్‌మెన్లు తనిఖీ చేస్తున్నారు.

 

అదే సమయంలో వేగంగా వచ్చిన కోయినా ఎక్స్‌ప్రెస్‌ను వీరు గమనించలేకపోయారు. రైలు ఒక్కసారిగా వారిని ఢీకొట్టి ముందుకు వెళ్లింది. దీంతో ఘటనాస్థలంలోనే కార్మికుల మృతదేహాలు నుజ్జనుజ్జయి కనిపించాయి. దీపావళి పర్వదినం నాడే ఈ దుర్ఘటన సంభవించడంతో మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement