మోడీ ప్రధానైతే భారత్‌లో ఉండను: అనంతమూర్తి
మోడీ ప్రధానైతే భారత్‌లో ఉండను: అనంతమూర్తి
Published Mon, Sep 16 2013 3:24 AM | Last Updated on Mon, Sep 17 2018 7:44 PM
సాక్షి, బెంగళూరు: గుజరాత్ సీఎం నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయితే తాను భారత్‌లో ఉండబోనని ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ యు.ఆర్.అనంతమూర్తి అన్నారు. బెంగళూరులోని బసవనగుడిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గాంధీ, నెహ్రూ వంటి ఎందరో నేతలు భారత్ లౌకికవాద దేశంగా ఉండాలని కలలుగన్నారని పేర్కొన్నారు. అయితే మోడీ వంటి నాయకుడు ప్రధాని అయితే ఆ కలలకు అర్థం లేదన్నారు. మోడీ పాలనలో గుజరాత్ ప్రజలు కష్టాలు పడుతున్నారని, ఆయన ప్రధాని అయితే దేశంలోని ప్రజలందరికీ అదే గతి పడుతుందన్నారు. అందువల్లే మోడీ ప్రధాని అయితే తాను భారత్‌ను వదిలి వెళ్లడం ఖాయమని అనంతమూర్తి స్పష్టం చేశారు.
Advertisement
Advertisement