అమెరికాలో జాతివైవిధ్య మ్యాప్
న్యూయార్క్: దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నివసించేవారి వివరాలతో జాతి వైవిధ్య డిజిటల్ మ్యాప్‌ను అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి పరిశోధకులు రూపొందించారు. దీని ద్వారా 1990 నుంచి 2010 వరకు అమెరికాలోని జాతి వైవిధ్యంలో వచ్చిన మార్పుల్ని తెలుసుకోవచ్చు. యూఎస్ సెన్సస్ బ్యూరో నుంచి గత 20 ఏళ్ల వివరాలు సేకరించిన పరిశోధకులు నాసా మ్యాప్ తయారీ పద్ధతుల్ని వాడారు.
గ్రిడ్ పద్ధతిలో ప్రతి 30 చదరపు మీటర్లను ఓ బ్లాక్‌గా గుర్తించి అత్యంత కచ్చితత్వంతో డిజిటల్ మ్యాపును తయారు చేశారు. ఈ మ్యాప్‌లను విద్యార్థులు తమ పరిశోధనల కోసం వాడుకోవచ్చని ప్రొఫెసర్ టొమాస్జ్ స్టెఫిక్సీ తెలిపారు. ఇందులోని వివరాలను సామాన్యులు సైతం సులభంగా అర్థం చేసుకోగలరని ఆయన అన్నారు. ఈ పరిశోధన పీఎల్‌వోఎస్ వన్ జర్నల్‌లో ప్రచురితమైంది.