మహబూబాబాద్: కొందరు దుండగులు చెరువులో విషప్రయోగం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా చెరువులో పురుగుల మందును కలిపారు. దీంతో పెద్ద ఎత్తున చేపలు మృత్యువాతపడ్డాయి. మహబూబాబాద్ జిల్లాలోని మల్యాల గ్రామ శివారు కొత్తచెరువులో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
గుర్తుతెలియని దుండగులు చెరువులో పురుగుల మందు కలుపడంతో సుమారు రూ. 5 లక్షల విలువైన చేపలు మృత్యువాత పడ్డాయి. దీంతో చెరువునే నమ్ముకొని జీవిస్తున్న మత్సకార్మిక కుటుంబాలు వీధిన పడ్డాయి. ఈ దారుణంపై గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చెరువులో విషప్రయోగం!
Published Sun, Dec 4 2016 7:52 PM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM
Advertisement
Advertisement