బీఎండబ్ల్యూలో మంటలు: ప్రొఫెషనల్‌ రేసర్‌ దుర్మరణం | Racer Ashwin Sundar, wife charred to death | Sakshi
Sakshi News home page

బీఎండబ్ల్యూలో మంటలు: ప్రొఫెషనల్‌ రేసర్‌ దుర్మరణం

Published Sat, Mar 18 2017 10:34 AM | Last Updated on Wed, Apr 3 2019 4:59 PM

బీఎండబ్ల్యూలో మంటలు: ప్రొఫెషనల్‌ రేసర్‌ దుర్మరణం - Sakshi

బీఎండబ్ల్యూలో మంటలు: ప్రొఫెషనల్‌ రేసర్‌ దుర్మరణం

చెన్నై: భారత ప్రొఫెషనల్‌ రేసర్‌ అశ్విన్‌ సుందర్‌, అతని భార్య నివేదిత దుర్మరణం పాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు రోడ్డుపక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు ఎగిశాయి. ఈ మంటలలో దంపతులిద్దరూ ఆహూతి అయ్యారు. శనివారం తెల్లవారుజామున చెన్నైలోని శాంతమ్‌ హైరోడ్డు ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

బీఎండబ్ల్యూ చెట్టును ఢీకొన్న తర్వాత.. వాహనంలోంచి బయటకు వచ్చేందుకు సుందర్‌ దంపతులు ప్రయత్నించారని, కానీ కారు డోర్లు తెరుచుకోలేదని, ఇంతలోనే చెట్టు, ఓ గోడ మధ్య చిక్కుకున్న బీఎండబ్ల్యూలో మంటలు ఒక్కసారిగా ఎగిశాయని, ఈ మంటలలో దంపతులిద్దరూ సజీవ దహనమయ్యారని పోలీసులు తెలిపారు. భారత జాతీయ కారు రేసింగ్‌ చాంపియన్‌ అయిన సుందర్‌ ఈ సమయంలో వాహనాన్ని నడుపుతున్నారు. ఆయన భార్య నివేదిత ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. స్థానికులు వాహనానికి నిప్పు అంటుకున్న విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement