'అమ్మ'పై సుబ్రమణ్యస్వామి విసుర్లు
చెన్నై: భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతమైంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో తమిళనాట జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. రాజధాని చెన్నైలో రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం కారణంగానే వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి విమర్శించారు. జయలలిత ప్రభుత్వంపై తనదైన శైలిలో వంగ్యాస్త్రాలు సంధించారు. 'అమ్మ' వరదల్లో చెన్నై మునిగిపోయింది. 'అమ్మ' డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్లే ఈ దుస్థితి సంభవించిందని ట్విటర్ లో వ్యాఖ్యానించారు. కాగా, తమిళనాడులో భారీ వర్షాలకు వందమందిపైగా మృతి చెందినట్టు సమాచారం.