ఏడాదిన్నర పాలనలో ఏం సాధించారు? | TTDP President L.Ramana Fires on TRS Party | Sakshi
Sakshi News home page

ఏడాదిన్నర పాలనలో ఏం సాధించారు?

Published Wed, Jan 6 2016 3:20 AM | Last Updated on Sun, Sep 3 2017 3:08 PM

ఏడాదిన్నర పాలనలో ఏం సాధించారు?

ఏడాదిన్నర పాలనలో ఏం సాధించారు?

హైదరాబాద్‌ను మురికికూపంగా మార్చారు : ఎల్.రమణ
సాక్షి, హైదరాబాద్: ఏడాదిన్నర పాలనలో హైదరాబాద్‌ను టీఆర్‌ఎస్ ప్రభుత్వం మురికి కూపంగా మార్చిందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 18 నెలల పాలనలో సీఎం కేసీఆర్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, గెలుపు కోసం రాజకీయ వికృత క్రీడ ఆడుతున్నారని విమర్శించారు. మెట్రో రైలు మార్గం పాత అలైన్‌మెంట్‌ను ఆమోదించడం వెనుక వున్న చీకటి ఒప్పందాన్ని బయట పెట్టాలని మాగంటి డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను ఆహ్వానిస్తామన్నారు.
 
గ్రేటర్ ప్రచారానికి చంద్రబాబు
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 9న నిజాం కాలేజీ మైదానంలో జరిగే టీటీడీపీ బహిరంగ సభకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.  మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో సీట్ల సర్దుబాటు చర్చల బాధ్యతను టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావులతోపాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పార్టీ అధ్యక్షులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement