వొడాఫోన్ స్పెషల్ 4జీ ఆఫర్.. ఏంటది?
వొడాఫోన్ స్పెషల్ 4జీ ఆఫర్.. ఏంటది?
Published Mon, Mar 20 2017 12:18 PM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM
ముంబై : టెలికాం సర్వీసు ప్రొవైడర్ వొడాఫోన్ ఓ స్పెషల్ 4జీ ప్లాన్ ను ప్రకటించింది. తమ కస్టమర్లకు బాలీవుడ్, హాలీవుడ్, రీజనల్ మూవీస్, అమెరికా టీవీ షోలు, కిడ్స్ ప్రొగ్రామింగ్, గ్లోబల్ అమెజాన్ ఒరిజనల్స్ అందించేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాతో కంపెనీ భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. మార్చి 22 నుంచి వొడాఫోన్ ఈ సూపర్ నెట్ 4జీ నెట్ వర్క్ స్పెషల్ ఆఫర్ ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది. అప్పటి ఉంచి అమెజాన్ ప్రైమ్ ను ఎంజాయ్ చేయొచ్చని కస్టమర్లకు తెలిపింది. రూ.499 వార్షిక సబ్ స్క్రిప్షన్ తో అమెజాన్ ప్రైమ్ ను మై వొడాఫోన్యాప్ లేదా వొడాఫోన్ వెబ్ సైట్ ద్వారా కస్టమర్లు దీన్ని సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.
రూ.250 క్యాష్ బ్యాక్ ను యూజర్లు పొందనున్నారు. ఆండ్రాయిడ్ డివైజ్ లకే ప్రస్తుతం ఇది అందుబాటులో ఉంది. తమ కస్టమర్లలో వినోద వినియోగ శైలి చాలా వేగంగా మారుతూ వస్తుందని, కంటెంట్ ను పొందడానికి వారు ఎక్కువ స్వేచ్ఛను, అనుకూలతను ఆశిస్తున్నారని వొడాఫోన్ పేర్కొంది. అమెజాన్ ప్రైమ్ వీడియో భాగస్వామ్యంతో తమ కస్టమర్లకు ఇది తేలికగా అందించవచ్చని పేర్కొంది. తమ కంటెంట్ ప్రతిపాదనకు మరింత బలం చేకూర్చేందుకు ఈ పార్టనర్ షిప్ ఎంతో సహకరించనుందని తెలిపింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న తొలి టెలికాం కంపెనీ వొడాఫోనే.
Advertisement
Advertisement