హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరో వర్ధంతి వేడుకలు హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. అనంతరం పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి బయలుదేరి ఆ తర్వాత అసెంబ్లీ, శాసనమండలికి నేతలు వెళ్లనున్నారు.
కాగా తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. వైఎస్ జగన్ బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించి, ప్రార్థనలు చేశారు. ఇవాళ రాత్రి అక్కడి నుంచి బయలుదేరి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి గురువారం ఉదయానికి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
మహానేతకు వైఎస్ఆర్ సీపీ ఘన నివాళులు
Published Wed, Sep 2 2015 7:58 AM | Last Updated on Sat, Jul 7 2018 3:36 PM
Advertisement