కడప కార్పొరేషన్ : ఇప్పటివరకు మనం బంగారంతో చేసిన పళ్లను పెట్టించుకోవడమే చూశాం. తాజాగా, బంగారు మోకీళ్లూ అందుబాటులోకి వచ్చేశాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా వైఎస్సార్ జిల్లా కడపలో ఇద్దరు మహిళలకు ఈ బంగారు మోకీళ్లు అమ ర్చారు. అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన సుశీలమ్మ, వైఎస్సార్ జిల్లా మైదుకూరుకు చెందిన పుల్లమ్మలకు నగరం లోని సన్‌రైజ్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో ఆర్థో వైద్య నిపుణులు డాక్టర్ గోసుల శివభారత్‌రెడ్డి నేతృత్వంలో బంగారు మోకీళ్లను విజయవంతంగా అమర్చారు.
వీరిరువురినీ శనివారం ఆస్పత్రి యాజమాన్యం మీడియా సమక్షంలో హాజరుపరిచారు. ఈ సందర్భంగా డాక్టర్ గోసుల శివభారత్‌రెడ్డి మాట్లాడుతూ మూడు నెలల కిందట దక్షిణా ఫ్రికాలో జరిగిన ప్రపంచ ఆర్థోపెడీషియన్ల సదస్సులో ఓపులెంట్ బయోనిక్ గోల్డ్ (బంగారు మోకీలు)ను ఆవిష్కరించార న్నారు. ఇది 30ృ40 ఏళ్ల వరకూ మన్నుతుందన్నారు. టైటానియం డైఆక్సైడ్ తో తయారయ్యే ఈ మోకీళ్లకు 8 బంగారు పొరలుంటాయని, అంతేకాక.. 130ృ140 డిగ్రీల కోణంలో మోకీలును వంచే సౌలభ్యం ఉందన్నారు. ఇది అన్ని రకాల సైజుల్లో లభిస్తుందని, ఆపరేషన్ ఖరీదు రూ.2లక్షల వరకు ఉంటుందన్నా రు. సర్జరీ తర్వాత నెలపాటు ఫిజియోథె రపీ చేయిస్తే 99 శాతం విజయవంత మవుతాయని శివభారత్‌రెడ్డి వివరించారు.
బంగారు మోకీళ్లు వచ్చేశాయ్!
Published Sun, Jan 28 2018 1:45 AM | Last Updated on Sun, Jan 28 2018 1:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment