-
సేఫ్టీలో జీరో రేటింగ్: భద్రతలో ఫ్రెంచ్ బ్రాండ్ ఇలా..
అతి తక్కువ కాలంలోనే అధిక అమ్మకాలు పొందిన సిట్రోయెన్ కంపెనీకి చెందిన 'సీ3 ఎయిర్‌క్రాస్' (C3 Aircross) ఇటీవల క్రాష్ టెస్టులో జీరో సేఫ్టీ రేటింగ్ పొందింది. ఈ వార్త ఒక్కసారిగా సిట్రోయెన్ కారు కొనుగోలు చేసిన వారికి భయాన్ని కలిగించింది.సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ 'లాటిన్ ఎన్సీఏపీ' క్రాష్ టెస్టులో జీరో రేటింగ్ సాధించింది. అయితే ఇక్కడ టెస్ట్ చేయడానికి ఉపయోగించిన మోడల్ 'బ్రెజిల్ స్పెక్' కావడం గమనార్హం. ఇది గత ఏడాది మార్కెట్లో లాంచ్ అయింది. అప్పటి నుంచి మంచి అమ్మకాలతో దూసుకెల్తూనే ఉంది. అయితే సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ అని తెలియడంతో.. రాబోయే అమ్మకాలు బహుశా తగ్గే అవకాశం ఉంది.సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్ సొంతం చేసుకుందన్న విషయాన్ని లాటిన్ ఎన్సీఏపీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. క్రాష్ టెస్ట్ కోసం ఎంచుకున్న మోడల్ రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి స్టాండర్డ్ ఫీచర్స్ పొందింది.అడల్ట్ సేఫ్టీలో 33.01 శాతం, చైల్డ్ సేఫ్టీలో 11.37 శాతం స్కోర్ సాధించిన సీ3 ఎయిర్‌క్రాస్.. ముందున్న ప్రయాణికులకు పటిష్టమైన భద్రత అందించడంలో విఫలమైంది. సైడ్ ఇంపాక్ట్ కూడా ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం. తలకు కూడా మంచి రక్షణ అందించడంలో కంపెనీ సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో ఇది ప్రయాణికులకు భద్రత అందించడంలో విఫలమైందని లాటిన్ ఎన్సీఏపీ ధ్రువీకరించింది.ఇదీ చదవండి: ఇంటర్నెట్ లేకుండా ట్రాన్సక్షన్స్: వచ్చేస్తోంది 'యూపీఐ 123 పే'మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉన్న సీ3 ఎయిర్‌క్రాస్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో పెట్రోల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇవి రెండూ కూడా అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధరలు రూ. 6.16 లక్షల నుంచి రూ. 10.15 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. -
గోల్డ్ లోన్ చెల్లింపు విధానంలో మార్పులు
బంగారంపై రుణాల కోసం బ్యాంకులు, గోల్డ్ లోన్ అందించే సంస్థలు నెలవారీ చెల్లింపు ప్రణాళికలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రస్తుత రుణ పంపిణీ ప్రక్రియలో అంతరాలను గుర్తించినట్లు ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్‌లో వెల్లడించింది. కొత్తగా అమలు చేయాలనుకుంటున్న విధానం ప్రకారం రుణగ్రహీతలు లోన్ ప్రారంభమైనప్పటి నుంచే ఈఎంఐల ద్వారా ఏకకాలంలో వడ్డీ, అసలు చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఇప్పటి వరకు ఉన్న పరిస్థతిబంగారు ఆభరణాలపై రుణం తీసుకునేవారు నిర్ణీత కాలం తర్వాత వడ్డీతో కలిపి మొత్తం అప్పు తీరుస్తున్నారు. వినియోగదారుల వద్ద నగదు ఉన్నప్పుడు పాక్షికంగా రుణం చెల్లించే అవకాశం ఉంది. కానీ నెలవారీ ఈఎంఐ పద్ధతి లేదు. ఒకవేళ రుణగ్రహీతలకు రుణ కాలావధి కంటే ముందే డబ్బు సమకూరితే ఒకేసారి రుణం తీర్చే వెసులుబాటు అయితే ఉంది.ప్రతిపాదిత విధానంబంగారంపై రుణాలిచ్చే బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు తనఖా పెట్టుకుని అప్పు ఇచ్చిన నెల నుంచి వడ్డీ, అసలును ఏకకాలంలో ఈఎంఐ రూపంలో చెల్లించేలా ప్రతిపాదనలున్నాయి. ఆర్థిక సంస్థలు కూడా రుణగ్రహీతలకు లోన్లు ఇచ్చేందుకు వీలుగా టర్మ్ లోన్లును తీసుకోవచ్చనేలా విధానాల్లో మార్పులు తీసుకురాబోతున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: ఆరేళ్లలో రూ.84 లక్షల కోట్లకు చేరే రంగం!అంతరాలు గుర్తించిన ఆర్బీఐతనఖాపెట్టిన బంగారం విలువను కొన్ని సంస్థలు సరిగ్గా లెక్కించడం లేదని ఆర్బీఐ గుర్తించింది. దాంతోపాటు అప్పు తీర్చని వారికి సంబంధించిన బంగారాన్ని వేలం వేయడంలో అవకతవలు జరుగుతున్నాయని తెలిపింది. రుణం ఇచ్చేందుకు బంగారం విలువనే ప్రాతిపదికగా తీసుకోకూడదని స్పష్టం చేసింది. అప్పు చెల్లించేవారి చెల్లింపుల రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. రుణాన్ని రోలోవర్ చేయకుండా నెలవారీ చెల్లింపు విధానాన్ని తీసుకురావాలని చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. -
టీజర్లోనే ఇన్ని బూతులు ఉంటే.. ఇక సినిమా పరిస్థితి ఏంటో..?
ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో బూతు డైలాగ్స్‌కు ఎలాంటి కొదవ లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా టీజర్,ట్రైలర్లోనే కొన్ని డైలాగ్స్‌తో సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వచ్చిన 'డ్రింకర్ సాయి' సినిమా టీజర్ కూడా అదే కోవకు చెందినట్లు కనిపిస్తుంది. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్లు ‘డ్రింకర్ సాయి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్ కూడా ఉంచారు. ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్‌ను డైరెక్టర్ మారుతి లాంచ్ చేసిన విషయం తెలిసిందే.యూత్‌ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ డ్రింకర్ సాయి చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్లో ఎక్కువగా బోల్డ్ డైలాగ్స్‌తో పాటు ధర్మ , ఐశ్వర్య శర్మ లవ్ స్టోరీ హైలెట్‌గా కనిపిస్తుంది. వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ యూత్‌ను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ ఐశ్వర్య శర్మకు యూత్ ఫిదా అవుతున్నారు. షోషల్ మీడియాలో ఆమె డైలాగ్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రమ్, బిగ్ బాస్ ఫేమ్ కిర్రాక్ సీత, రీతూ చౌదరి, ఫన్ బకెట్ రాజేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. -
లగచర్ల ఘటన.. సీఎస్, డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: లగచర్ల ఫార్మా బాధితుల అరెస్టులపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) స్పందించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. లగచర్ల ఘటనపై రెండు వారాల్లో సమగ్ర నివేదిక పంపాలని ఆదేశించింది. ఘటన తీవ్రత నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల సంఘం లా అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లతో కూడిన జాయింట్ టీమ్‌ను లగచర్ల పంపాలని నిర్ణయించింది.వారం రోజుల్లో ఈ అంశంపై జాయింట్ టీం నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై పోలీసుల దాడిపై ఎన్హెచ్ఆర్సీ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసుల భయంతో ఊరు విడిచి గ్రామస్తులు వెళ్లిపోవడం తీవ్రమైన విషయం అని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. ఫార్మా కంపెనీ భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ.. ఈనెల 18న ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ‘ఫార్మా కంపెనీలకు భూములివ్వకుంటే కేసులు పెడతామంటున్నారు. జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు.ఢిల్లీలో న్యాయం జరుగుతుందని వచ్చామంటూ లగచర్ల బాధిత మహిళలు జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్ల ముందు కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. బీఆర్ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, కోవా లక్ష్మిలతో కలిసి ఆదివారం ఢిల్లీకి వచ్చిన మహిళలు.. ఆయా కమిషన్లను కలిశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇదీ చదవండి: మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు -
నల్గొండ డీఈవో లీలలు.. భార్య ఉండగానే మరో మహిళతో..
సాక్షి, నల్గొండ జిల్లా: నల్గొండ డీఈవో భిక్షపతి లీలలు వెలుగులోకి వచ్చాయి. భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆ మహిళ ద్వారా ముగ్గురు పిల్లలకు భిక్షపతి తండ్రి అయినట్లు మొదటి భార్య ఆరోపిస్తోంది. ప్రియురాలితో ఉండగా డీఈవో భిక్షపతిని భార్య రెడ్ హ్యాండెడ్ పట్టుకుంది. పెళ్లైన నెలకే వదిలేశాడంటూ డీఈవో ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. గతంతోనూ డీఈవోపై అనేక ఆరోపణలు రాగా, గత కొన్నేళ్లుగా నల్లగొండ డీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. తనను మోసం చేసి వేరే కాపురం పెట్టాడంటూ డీఈవో భిక్షపతి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకో మహిళతో ఉంటూ తనకు విడాకుల నోటీసులు పంపించారని.. ఈ వ్యవహారం ఏంటని ప్రశ్నిస్తే చంపుతానంటూ బెదిస్తున్నారని ఆమె తెలిపారు. -
ఇంట్లో ఇల్లాలు.. పీజీలో ప్రియురాలు
మైసూరు: వివాహమై భార్యతో కాపురం చేస్తున్నా మరొక మహిళతో ప్రేమాయణం నడిపి గర్భవతిని చేయడమే కాకుండా రూ.9 లక్షలను తీసుకుని మోసగించిన ఘటన మైసూరులోని వీవీ మొహల్లాలో వెలుగుచూసింది. మోసపోయిన మహిళ జయలక్ష్మిపురం పోలీసు స్టేషన్లో బెంగళూరు నివాసి భరత్‌గౌడ, అతని తల్లిదండ్రులు సురే‹Ù, అంకితలపై ఫిర్యాదు చేసింది. వయసులో పెద్దయినా.. వివరాలు..బాధితురాలు భాగ్యలక్ష్మి (32) గోకులంలో ప్రైవేటు హాస్టల్ (పీజీ) నడుపుతున్నారు. 2022లో భరత్‌గౌడ (29)తో ఇన్‌స్టా లో పరిచయం ఏర్పడింది. తనకన్నా ఆమె పెద్దదైనప్పటికీ, ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. అప్పటికే అతనికి పెళ్లయింది. కానీ విడాకులు ఇచ్చానని బాధితురాలికి నమ్మబలికాడు. మోసగానికి అతని తల్లిదండ్రులు కూడా వంతపాడుతూ బాధిత మహిళను వలలోకి లాగారు. నమ్మిన మహిళ పెళ్లికి ఒప్పుకుంది. స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రుల సమక్షంలో 2023లో ఫంక్షన్ హాల్లో పెళ్లి జరిగింది. ఆ సమయంలో వ్యాపారం కోసమంటూ రూ.10 లక్షలు, 100 గ్రాముల బంగారు ఆభరణాలను భరత్‌గౌడ వరకట్నంగా తీసుకున్నాడు. ఆ తర్వాత రూ.8 లక్షలు ఇచ్చి కార్ వాషింగ్ సెంటర్‌ని పెట్టించింది. అంతేగాకుండా ఆమె క్రెడిట్ కార్డు నుంచి భరత్‌గౌడ రూ.1.25 లక్షలను డ్రా చేసుకున్నాడు. మొదటి భార్యకు తెలిసి ఇలా ఉండగా మొదటి భార్య మోనిక ఈ విషయాన్ని తెలుసుకుని భాగ్యలక్ష్మికి భరత్‌గౌడ మోసగాడు, జాగ్రత్తగా ఉండాలని మెసేజ్ చేసింది. దీనిపై భాగ్యలక్ష్మి నిలదీయగా, ఆమె మాటలు నమ్మవద్దని చెప్పాడు. మొదటి భార్యతో కాపురం చేస్తూనే నాటకమాడి తనను మోసగించినట్లు అర్థమైంది. దీంతో నిలదీయగా చంపుతానని ఆమెను బెదిరించాడు. ఈ నేపథ్యంలో అతని మోసాల గురించి భాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
రౌడీలా రెచ్చిపోయిన పృథ్వీ.. విశ్వక్సేన్ దగ్గర అవినాష్ కక్కుర్తి!
ఈసారి మెగా చీఫ్ పోస్టు అందుకోవడం అంత ఈజీ పనిలా లేదు. బిగ్‌బాస్ పెట్టిన పలు టాస్కులు ఆడి గెలిస్తేనే హౌస్‌లో చివరిసారి చీఫ్ అవుతారు. ఇకపోతే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హౌస్‌లో అడుగుపెట్టి అందరితో ఇట్టే కలిసిపోయాడు. మరి షోలో ఇంకా ఏమేం జరిగాయో నేటి (నవంబర్ 21) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..చివరి కంటెండర్పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, తేజ మెగా చీఫ్ కంటెండర్లవగా చివరగా నిఖిల్, రోహిణి మాత్రమే మిగిలారు. వీరిలో ఎవర్ని కంటెండర్ చేస్తారో హౌస్మేట్స్ నిర్ణయించాలన్నాడు. ఈ క్రమంలో గౌతమ్.. చాలామంది వైల్డ్‌కార్డ్స్‌ను పంపించేద్దామని ప్లాన్ చేశారు. అవన్నీ తట్టుకుని రోహిణి ఇక్కడిదాకా వచ్చిందంటూ ఆమెకు సపోర్ట్ చేశాడు. యష్మి, ప్రేరణ, తేజ కూడా రోహిణికే సపోర్ట్ ఇచ్చారు.గ్రూప్ గేమ్‌ను ప్రశ్నించిన గౌతమ్విష్ణుప్రియ నిఖిల్‌కు మద్దతిచ్చింది. ఇక పృథ్వీ.. వైల్డ్ కార్డ్స్‌ను పంపించేయాలని ప్లాన్ చేశామన్నారు. ఓజీ, రాయల్ టీమ్స్‌గా ఉన్నప్పుడు అది జరిగింది. కానీ ఇప్పుడు క్లాన్స్ లేవు కాబట్టి అలాంటి ప్లానింగ్స్ ఏవీ చేయడం లేదని క్లారిటీ ఇస్తూనే నిఖిల్‌కు సపోర్ట్ ఇచ్చాడు. ఇక గ్రూపిజం ఉందని గౌతమ్.. పృథ్వీతో గొడవపడుతుంటే యష్మి, విష్ణుప్రియ, నిఖిల్ వెంటనే దూసుకువచ్చి ఆ మాట నిజమేనని నిరూపించారు. నా వెంట్రుక కూడా పీకలేవుపృథ్వీ.. గౌతమ్ పైపైకి వెళ్తూ వాడు, వీడు అని మాట్లాడాడు. వాడు అని పిలవొద్దని చెప్తున్నా పృథ్వీ వెనక్కు తగ్గలేదు. దీంతో గౌతమ్ నువ్వు నన్నేం పీకలేవన్నాడు. దానికి పృథ్వీ.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు అని మరింత రెచ్చిపోయాడు. ఇలా వీరిద్దరూ చాలాసేపు గొడవపడ్డారు. మెజారిటీ ఓట్లు రోహిణికి రావడంతో ఆమె కంటెండర్ అయింది. విశ్వక్సేన్ ఎంట్రీమెగా చీఫ్ అవడానికి ఒకటి కంటే ఎక్కువ టాస్కులుంటాయన్నాడు బిగ్‌బాస్. అలా మొదటగా పట్టువదలని విక్రమార్కుడు టాస్క్ ఇచ్చాడు. ఇందులో విష్ణుప్రియ 10, యష్మి 20, పృథ్వీ 30, రోహిణి 40, తేజ 50 పాయింట్లు సాధించారు. అనంతరం విశ్వక్సేన్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. అవినాష్ కక్కుర్తివస్తూనే రుచికరమైన ఇంటి భోజనం తీసుకువచ్చి అందరితో కలిసి తిన్నాడు. విశ్వక్ కోరిక మేరకు తేజ, అవినాష్ పోల్ డ్యాన్స్ చేశారు. అనంతరం రోహిణి, అవినాష్‌తో కలిసి విశ్వక్ స్కిట్ కూడా చేశాడు. తర్వాత అవినాష్.. విశ్వక్ దగ్గర టీషర్ట్ దోచేశాడు. చివరగా అందరితో కలిసి స్టెప్పులేసి వీడ్కోలు తీసుకున్నాడు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పాకిస్థాన్‌లో ప్రయాణికుల వాహనాలపై కాల్పులు.. 50 మంది మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో కుర్రం గిరిజన జిల్లాలో ప్రయాణికుల వాహనాలపై దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మహిళలు, పిల్లలతో సహా 50 మంది మృతి చెందగా, మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. కుర్రం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.పెషావర్-పరాచినార్ మధ్య ప్రయాణిస్తున్న రెండు ప్యాసింజర్ వాహనాల కాన్వాయ్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ ప్రధాన కార్యదర్శి నదీమ్ అస్లాం చౌదరి వెల్లడించారు. ఈ దాడిని ఆయన పెను విషాదంగా ఆయన అభివర్ణించారు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దాదాపు 10 మంది, రహదారికి ఇరువైపుల నుండి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో అధికంగా మహిళలు, పిల్లలు ఉన్నారు.At least 39 killed on Thursday (Nov 21) after gunmen opened fire on passenger vehicles in the #Kurram district of #Pakistan's Khyber Pakhtun.The convoy of vehicles was travelling from Parachinar to #Peshawar when unidentified gunmen attacked in the Uchat area of Kurram pic.twitter.com/U1SnQbOUzi— Ravi Pratap Dubey 🇮🇳 (@ravipratapdubey) November 21, 2024 -
జగిత్యాల జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్.. ఛార్జింగ్ పెట్టిన ఐదు నిమిషాల్లోనే..
సాక్షి, జగిత్యాల జిల్లా: కొనుగోలు చేసిన నెల రోజుల్లోనే ఎలక్ట్రిక్ బైక్ పేలిన సంఘటన జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో ఛార్జింగ్ పెడుతుండగా ఘటన జరిగింది. ఛార్జింగ్ పెట్టిన క్రమంలో కేవలం ఐదు నిమిషాల్లోనే బైక్ పేలిపోయింది.బైక్ పేలడంపై బాధితుడు బేతి తిరుపతి రెడ్డి, కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇంటి తలుపులు పాక్షికంగా ధ్వంసమవ్వగా, స్కూటీ పూర్తిగా కాలిపోయింది. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపులోకి తెచ్చారు. బైక్ డిక్కీలోనే ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బులు సుమారు లక్షా 90 వేల రూపాయలున్నట్టు బాధితుడు పేర్కొన్నారు.కాగా, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బైక్ పేలుడుపై టీవీఎస్ మోటార్ డీలర్‌తో బాధితుడు వాగ్వాదానికి దిగారు. ఇన్సూరెన్స్ ద్వారా నష్టం పూడ్చే ప్రయత్నం చేస్తామని కంపెనీ డీలర్ తెలిపారు. వరసగా జరుగుతున్న ఎలక్ట్రిక్ బైక్‌ల పేలుడు ఘటనలతో వాహనదారుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఓవైపు ఇంధన ధరల పెరుగుదల.. మరోవైపు పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్న వారిలో టెన్షన్ కలిగిస్తున్నాయి.ఇదీ చదవండి: ‘ఈవీ’లు... టైంబాంబులు! -
మంచి పని చేశార్సార్! లేకుంటే ఎగ్జిట్‌పోల్స్‌లో గెలుస్తున్నాం.. ఒరిజినల్ పోల్స్‌లో ఓడిపోతున్నాం..!!
మంచి పని చేశార్సార్! లేకుంటే ఎగ్జిట్‌పోల్స్‌లో గెలుస్తున్నాం.. ఒరిజినల్ పోల్స్‌లో ఓడిపోతున్నాం..!!