Ali Abbas Zafar
-
అందరి కన్నూ ప్రధాని కుర్చీ మీదే..
రాజకీయాలు వ్యాఖ్యానించే సినిమాలు బాలీవుడ్లో కొత్త కాదు. కాని కొన్ని సినిమాలే శక్తిమంతంగా తెర వెనుక భాగోతాలను చెప్పి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గతంలో ప్రకాష్ ఝా దర్శకత్వంలో ‘రాజ్‌నీతి’ సినిమా పెద్ద హిట్ అయ్యింది. రణ్‌బీర్ కపూర్, అజయ్ దేవ్‌గణ్ తదితరులు ఇందులో నటించారు. ఈ సినిమా ఉత్తరప్రదేశ్ తరహా రాష్ట్ర రాజకీయాలను చర్చించింది. ఇప్పుడు అమేజాన్‌లో జనవరి 15 నుంచి స్ట్రీమ్ అవుతున్న ‘తాండవ్’ వెబ్ సిరీస్ దేశ రాజకీయాలను చర్చించే ప్రయత్నం చేసింది. 9 ఎపిసోడ్ల ఈ సిరీస్ ప్రధానంగా ప్రధాని కుర్చీ ఎక్కడానికి నేతలు ఏయే ఆటలు ఆడతారో చెప్పే ప్రయత్నం చేస్తుంది. అలీ అబ్బాస్ దర్శకత్వంలో ‘గుండె’, ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ వంటి భారీ సినిమాలు తీసిన దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఓటిటి ప్లాట్‌ఫామ్ మీద మొదటిసారిగా పొలిటికల్ డ్రామాతో కూడిన వెబ్ సిరీస్ ‘తాండవ్’తో ఎంట్రీ ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. అందుకు దేశ రాజకీయాలను వస్తువుగా తీసుకున్నాడు. ‘మీరు ఈ కథను చూస్తే ఏది సరైన నిర్ణయం ఏది కాదు అనేది నిర్ణయించలేరు. అధికారం కోసం ఏ పని చేసినా సరైనదే అనే అభిప్రాయానికి వస్తారు’ అంటాడతను. సైఫ్ అలీ ఖాన్, డింపుల్ కపాడియా ఇందులో ప్రధాన తారాగణం. సునీల్ గ్రోవర్, క్రితికా కమ్రా, డినో మోరియా తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. (చదవండి: హిందూస్తాన్‌ను నడిపించేది ఒకటే.. అది రాజనీతి) ఆ కుర్చీపై కూర్చోవడం ఎలా? ఈ సిరీస్‌లో ప్రధానిగా తిగ్మాన్షు థులియా అధికారం చలాయిస్తూ ఉంటాడు. అయితే అతని కుమారుడైన సైఫ్ అలీ ఖాన్‌కి ఆ కుర్చీలో కూచోవాలని ఉంటుంది. అందుకు తగినట్టుగా పావులు కదిలిస్తాడు. చదరంగం బల్ల మీద మన ఎత్తు మనం ఎత్తవచ్చు. కాని ఎదుటివాడు ఎత్తు వేయడానికి కూడా చాన్స్ ఇచ్చినవారం అవుతాము. ఎప్పుడైతే సైఫ్ రంగంలోకి దిగాడో ప్రధాని కుర్చీ మీద ఆశలు పెట్టుకున్నవారంతా కదలుతారు. వారిలో ఒకరు డింపుల్ కపాడియా. ఈమె పార్టీ సీనియర్ కార్యకర్త. దాంతో పాటు ప్రధాని ప్రియురాలు కూడా. ఆమె తన గేమ్ మొదలెడుతుంది. ఈమెతో పాటు ప్రధాని కోటరీలో ఉండే మరో మహిళ కూడా రంగంలో దిగుతుంది. (చదవండి: జీవితాంతం నువ్వు నా దానివే..: దర్శకుడు) వర్తమాన ఘటనలు ఈ సిరీస్‌లో వర్తమాన ఘటనలను పోలిన సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమాలో ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ‘రైట్ వింగ్’ పార్టీ అని సంకేతం ఇస్తాడు దర్శకుడు. అలాగే ‘లెఫ్ట్ వింగ్’ పార్టీలు బయట విమర్శలు చేస్తూ దేశ పరిస్థితి మీద వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి. మరోవైపు ఒక యూనివర్సిటీ లో ఉవ్వెత్తున ఎగిసిన స్టూడెంట్ ఉద్యమం కూడా కనిపిస్తుంది. దేశ రాజకీయాలను మార్చాలనే విద్యార్థి నాయకులకు ప్రతినిధిగా నటుడు జీషాన్ అయూబ్ కనిపిస్తాడు. మూస రాజకీయాలకు ఇటువంటి విద్యార్థి రాజకీయాల నుంచి భంగం తప్పకపోవచ్చు అనే సంకేతం కూడా ఉంటుంది. సామాన్యుడి ఊహకు కూడా అందని ఎన్నో రాజకోట రహస్యాలు దేశంలో జరుగుతూ ఉంటాయి. వాటిలో ఎన్నో కొన్ని ఇలా ఫిక్షన్ రూపు తీసుకుంటూ ఉంటాయి. ఈ సిరీస్ గొప్ప హిట్ అవకపోవచ్చు. కాకపోతే డింపుల్ కపాడియా వంటి ఆర్టిస్టుల ప్రతిభకు అద్దం పడుతుంది. రాజకీయాలు ఆసక్తి ఉన్నవారు తప్పక చూడదగ్గ సిరీస్ ఇది. -
జీవితాంతం నువ్వు నా దానివే..: దర్శకుడు
కొత్త సంవత్సరం.. మరింత కొంగొత్తగా మొదలు పెట్టారు దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్. తన కలల రారాణి అలీసియాని జీవితంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ కొత్త మజిలీని మొదలు పెట్టారు. ఆమె వెన్నంటే తిరుగుతూ సంతోషాల హరివిల్లులో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు.. భార్య చేయి పట్టుకుని దిగిన ఫొటోను షేర్ చేస్తూ తనకు షాదీ అయిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తాజాగా మంగళవారం నాడు ఆమెతో మరింత దగ్గరగా ఉన్న ఫొటోను షేర్ చేస్తూ మనసులోని భావాలను బయటపెట్టారు. (చదవండి: 'అది నీ సినిమా అని ఎలా చెప్పుకుంటావ్?') "14 వందల ఏళ్ల క్రితం ఇమామ్ అలీ.. ఫాతిమాతో ఏమన్నాడో తెలుసా? నిన్ను చూస్తే చాలు.. నా బాధలు, భయాలు అన్నీ ఏదో మంత్రం వేసినట్లుగా మటుమాయవుతాయి అని! సరిగ్గా ఇప్పుడు నాక్కూడా అదే అనిపిస్తోంది అలీసియా. నిన్ను చూస్తే నా బాధరబందీలు అన్నీ మర్చిపోయి మనసంతా హాయిగా ఉంటోంది. ఏదేమైనా జీవితాంతం నువ్వు నాదానివే.." అంటూ భార్య మీద ప్రేమను కురిపించారు. కాగా అలీ అబ్బాస్ జాఫర్ కేవలం దర్శకుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్‌గా, నిర్మాతగానూ వ్యవహరించారు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సుల్తాన్, టైగర్ జిందా హై, భారత్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం ఆయన తాండవ్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తుండగా, దీనికి హిమాన్షు కిషన్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో డింపుల్ కపాడియా, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దేశ రాజకీయాల నేపథ్యంలో సాగనున్న ఈ వెబ్ సిరీస్ జనవరి 15 నుంచి ప్రసారం కానుంది. (చదవండి: దీపిక ఎందుకిలా చేసింది?: ఫ్యాన్స్ కంగారు) View this post on Instagram A post shared by Ali Abbas Zafar (@aliabbaszafar) -
హిందూస్తాన్‌ను నడిపించేది ఒకటే.. అది రాజనీతి
ముంబై: బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న వెబ్ సిరీస్ ‘తాండవ్’ టీజర్ గురువారం విడుదలైంది. హిమాన్షు కిషన్ మెహ్రా దర్శకత్వం వహిస్తుండగా, అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సైఫ్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఇక టీజర్ విషయానికొస్తే.. భారతదేశాన్ని నడిపించేది ముఖ్యంగా రాజకీయాలు అంటూ మొదలవుతుంది. ఆ తర్వాత పెద్ద జన సముహం పార్టీ జెండా పట్టుకుని జైజైలు కొడుతుండగా.. వైట్ షర్ట్, వెస్ట్ ధరించి రాజకీయ వేత్తగా సైఫ్ ఇచ్చిన ఎంట్రీ ఈ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజల ఎదురుగా వచ్చి రాజకీయ నేతగా అభివాదం చేసుకుంటు ముందుకు నడుచుకుంటూ వస్తుండగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ‘హిందూస్తాన్‌ను నడిపించేది ఒకే ఒకటి... అది రాజనీతి’ అని వినిపిస్తుంది. తొమ్మిది ఎపిసోడ్ల ఈ సిరీస్ జనవరి 15న ఓటీటీ ప్లాట్‌ఫాం ఆమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. దేశ రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్‌లో డింపుల్ కపాడియా, తిగ్మాంషు ధులియా, సునీల్ గ్రోవర్లు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక కుముద్ మిశ్రా, మహ్మద్ జీషన్ అయూబ్, కృతికా కమ్రా, గౌహర్ ఖాన్, అనుప్ సోని తదితరులు కూడా నటిస్తున్నారు. ఇందులో సైఫ్ పవర్ఫుల్ రాజకీయ నేతగా కనిపించనున్నారు. కాగా ప్రస్తుతం సైఫ్ టాలీవుడ్ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. సైఫ్ రావణాసురుడి పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పాత్రపై చేసిన వ్యాఖ్యలకు పరిశ్రమలో తీవ్ర దుమారం రేగడంతో ఇటీవల సైఫ్ క్షమాపణలు కోరాడు. అయినప్పటికి అతడి వ్యాఖ్యలు రావణుడిని ప్రశంసిస్తున్నట్లు ఉండటంతో యూపీకి చెందిన ఓ న్యాయవాది.. సైఫ్‌తో పాటు దర్శకుడుపై కోర్టులో పిటిషన్ వేశారు. -
'అది నీ సినిమా అని ఎలా చెప్పుకుంటావ్?'
మిస్టర్ ఇండియా సినిమాకు బాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 1987లో రిలీజైన 'మిస్టర్ ఇండియా' అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా శేఖర్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కథను సలీమ్-జావేద్ అక్తర్‌లు అందించారు. తాజాగా ఈ సినిమాను మిస్టర్ ఇండియా 2గా తీయాలని 'టైగర్ జిందా హై' ఫేమ్, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ రీమేక్‌గా తెరకెక్కించాలని భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని అబ్బాస్ తన ట్విటర్లో వెల్లడిస్తూ.. ' మిస్టర్ ఇండియా సినిమా కోసం పనిచేయడం నాకెంతో సంతోషంగా అనిపించింది. ప్రతి ఒక్కరి చేత ప్రశంసలందుకున్న ఐకానిక్ పాత్రలను మరోసారి మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాను. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నా.. నటీనటులు ఎవరనేది ఇంకా ఏం నిర్ణయించలేదు' అని పేర్కొన్నారు. (‘అమృతగా తాప్సీ నన్ను ఆకట్టుకుంది’) అయితే మిస్టర్ ఇండియా సినిమాలో హీరోగా నటించిన అనిల్ కపూర్, చిత్ర దర్శకుడు శేఖర్ కపూర్‌ను సంప్రదించకుండా రీమేక్ ఎలా తీస్తారంటూ నటి, అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. వారి అనుమతి లేకుండా సినిమాను తీస్తే వారిని అగౌరవపరిచినట్టేనని పేర్కొన్నారు. దీనిపై దర్శకుడు శేఖర్ కపూర్ ట్విటర్లో స్పందించారు.' మిస్టర్ ఇండియా సినిమా గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా... నన్ను అడగకుండా, నా అనుమతి లేకుండా సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నారు. మిస్టర్ ఇండియా సినిమా మంచి విజయం సాధించి దర్శకుడిగా నాకు గుర్తింపునిచ్చింది. ఈ సినిమాపై నాకు హక్కులు ఉండవా ?' అంటూ పేర్కొన్నారు. Shekhar saheb the story the situations the scenes the characters the dialogue the lyrics even the title none of these were yours .I gave it all to you . Yes you execute it very well but how can your claim on the film be more than mine . It wasn’t you idea . It wasn’t your dream — Javed Akhtar (@Javedakhtarjadu) February 28, 2020 దీనిపై జావేద్ అక్తర్ శేఖర్ కపూర్‌ను తప్పుబడుతూ రీట్వీట్ చేశారు.' మిస్టర్ ఇండియా కథ, పాటలు, డైలాగ్‌లు, సన్నివేశాలు, కనీసం చిత్రం టైటిల్ కూడా మీకు సొంతం కాదు. వాటిన్నంటిని నేను సలీమ్ కలిసి మీకు అందించాం అన్న విషయాన్ని మరిచిపోయారు. నిజమే.. మీరు సినిమాను చాలా బాగా తెరకెక్కించారు.. ఆ విషయం నేను ఒప్పుకుంటా.. కానీ సినిమా మీద మొత్తం హక్కులు నీకే ఉన్నాయనడం ఏం బాగాలేదు. అసలు ఈ సినిమా మీ ఆలోచన కాదు, అది మీ కల కూడా కాదు' అంటూ జావేద్ మండిపడ్డారు. -
యాక్షన్‌కి రెడీ
హీరోయిన్ కత్రినాకైఫ్ ఈ ఏడాది సూపర్‌హీరోగా మారబోతున్నారని బాలీవుడ్ సమాచారం. ఆల్రెడీ ఇందుకు తగ్గ పనులు కూడా మొదలయ్యాయట. సల్మాన్‌ఖాన్‌తో ‘సుల్తాన్’ (2016), ‘టైగర్ జిందా హై’(2017), ‘భారత్’ (2019) చిత్రాలను తెరకెక్కించిన అలీ అబ్బాస్ జాఫర్, కత్రినాను సూపర్ హీరోగా మార్చే కథను రెడీ చేస్తున్నారట. ఇందులో క్యారెక్టర్ పరంగా కత్రినా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను చేయబోతున్నారని బాలీవుడ్ టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు అలీ అబ్బాస్. వీలైనంత త్వరగా కథను ముగించి, ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు. కాగా అలీ అబ్బాస్ దర్శకుడిగా తెరకెక్కించిన తొలిచిత్రం ‘మేరే బ్రదర్‌కీ దుల్హన్’లో హీరోయిన్గా నటించిన కత్రినా ఆ తర్వాత ‘టైగర్ జిందా హై’, ‘భారత్’ చిత్రాల్లోనూ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. -
ఆకట్టుకుంటోన్న ‘భారత్’ ట్రైలర్
దేశంతో పాటే ఎదిగిన మనిషి కథను తెరపై ఆవిష్కరిస్తూ.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా వస్తోన్న చిత్రం ‘భారత్’. పోస్టర్స్‌తోనే ఓ రేంజ్లో హైప్ క్రియేట్చేసిన భారత్.. బాలీవుడ్లోనే కాక దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తోన్న చిత్రంగా బజ్ క్రియేట్ అయింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, భిన్న వయస్కుడిగా సల్మాన్ నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు. దేశానికి ఎప్పుడైతే స్వాతంత్ర్యం వచ్చిందో.. అప్పుడే నా కథ మొదలైంది అంటూ సల్మాన్ వాయిస్ ఓవర్‌తో మొదలైన ట్రైలర్.. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. సర్కస్‌లో ఫీట్లు చేసే పాత్రలో, కత్రినా కైఫ్‌తో ప్రేమ సన్నివేశాల్లో, కార్మికుడిగా, నావీ ఆఫీసర్‌గా ఇలా ప్రతీ పాత్రలో సల్మాన్ యాక్టింగ్ అదిరిపోయేలా ఉంది. ప్రతి నవ్వు వెనకాల తెలియని బాధ ఉంటుందని సల్మాన్ చెప్పడంతో.. ట్రైలర్లో కనిపించనిది ఇంకా ఏదో ఉందని అర్థమవుతోంది. మొత్తానికి భారత్ చిత్రం సల్మాన్ అభిమానులకు ఈ రంజాన్(జూన్ 5)కు నిజమైన పండుగను తెచ్చేట్టు కనిపిస్తోంది. ‘Journey of a man and a nation together’#BharatTrailer OUT NOW - https://t.co/Sp7o8g4cjg @Bharat_TheFilm @aliabbaszafar @atulreellife @itsBhushanKumar #KatrinaKaif #Tabu @bindasbhidu @DishPatani @WhoSunilGrover @nikhilnamit @reellifeprodn @SKFilmsOfficial @TSeries — Salman Khan (@BeingSalmanKhan) 22 April 2019 -
‘నా జీవితం మాత్రం రంగులమయం’
2019లో విడుదల కానున్న భారీ చిత్రాల్లో భారత్ ఒకటి. అలీ అబ్బాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పట్ల ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. టీజర్ రిలీజ్‌కు కొన్ని రోజుల ముందర సల్మాన్ తన అభిమానులకు ఓ ట్రీట్ ఇచ్చాడు. భారత్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. ‘నా జుట్టు, గడ్డం నెరిసిపోవచ్చు.. కానీ నా జీవితం మాత్రం చాలా రంగులమయం’ అంటూ సల్మాన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ అభిమానులను ఒకింత షాక్‌కు గురిచేసింది. కారణం ఈ పోస్టర్లో సల్మాన్ 70 ఏళ్ల వృద్ధిడిలా కనిపిస్తున్నారు. సినిమాలో సల్మాన్ 20 ఏళ్ల యువకుడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు వివిధ రకాల లుక్స్‌లో కనిపిస్తారంటూ చిత్రబృందం మొదటి నుంచి చెబుతూనే ఉంది. దానిలో భాగంగానే సల్మాన్ ఇలా వృద్ధిడిగా ఉన్న గెటప్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఓ మనిషి, దేశం కలిసి చేసిన ప్రయాణం అంటూ పోస్టర్ మీద ఉన్న వ్యాఖ్యలు సినిమా పట్ల మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. పోస్టర్లో జాకీష్రాఫ్ కూడా ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన సల్మాన్ తండ్రిగా కనింపిచనున్నారని సమాచారం. ఈ నెల 24న చిత్ర ట్రైలర్ విడుదల కానుంది. 2014లో వచ్చిన కొరియన్ హిట్ మూవీ ‘యాన్ ఓడ్ టు మై ఫాదర్’కి ‘భారత్’ హిందీ రీమేక్. ఈ ఏడాది ఈద్ స్పెషల్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram Jitne safed baal mere sar aur dhaadi mein hain, usse kahin zyada rangeen meri zindagi rahi hain! #Bharat @bharat_thefilm @aliabbaszafar @atulreellife #BhushanKumar @katrinakaif @tabutiful @apnabhidu @sonalikul @dishapatani @whosunilgrover @norafatehi @iaasifsheikhofficial @nikhilnamit #ReelLifeProduction @skfilmsofficial @tseries.official A post shared by Salman Khan (@beingsalmankhan) on Apr 14, 2019 at 10:30pm PDT -
‘నీ కులం, జాతి, మతం ఏంటని అడుగుతుంటారు’
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భారత్’ . కత్రినా కైఫ్, దిశా పటానీ, జాకీ ష్రాఫ్ ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ‘నీ ఇంటిపేరు, నీ జాతి, నీ కులం, నీ మతం ఏంటి అని అందరూ నన్ను అడుగుతుంటారు. వారందరికీ చిరునవ్వుతో నేనిచ్చే సమాధానం.. మా నాన్న ఈ దేశం పేరు మీదుగా నాకు భారత్ అనే పేరు పెట్టారు. దేశ ప్రతిష్టకు మచ్చ రాకుండా నడుచుకుంటాను’ అంటూ సల్మాన్ వాయిస్ ఓవర్‌తో సాగిన భారత్ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. దేశ విభజన సన్నివేశాలతో ప్రారంభమైన టీజర్లో.. నేవీ అధికారిగా, బైక్‌స్టంట్స్ చేసే వ్యక్తిగా, బాక్సర్‌గా సల్మాన్ కనిపించాడు. ఇక సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారత్ ఈ ఏడాది రంజాన్‌కు విడుదల కానుంది. -
వాఘాలో పాగా!
భారతదేశంలోని అమృత్సర్, పాకిస్తాన్‌లోని లాహోర్ నగరాలను కలిపే రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాఘా గ్రామంలో పాగా వేశారు సల్మాన్‌ఖాన్ అండ్ కత్రినా కైఫ్. ఇంతకీ సల్మాన్, కత్రినా భారత్‌కు వస్తున్నారా? లేక పాకిస్తాన్ వెళ్తున్నారా? అనే విషయాలు వెండితెరపై తెలుసుకోవాలి. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, దిశా పాట్నీ, జాకీ ష్రాఫ్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ‘భారత్’. సౌత్ కొరియన్ మూవీ ‘ఓడ్ టు మై ఫాదర్’కి ఇది రీమేక్. ఈ సినిమా తాజా షెడ్యూల్ పంజాబ్‌లోని లూధియానాలో ప్రారంభమైంది. సల్మాన్, కత్రినాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నిజానికి ఈ సినిమా షెడ్యూల్‌ను వాఘా గ్రామంలో ప్లాన్ చేశారు చిత్రబృందం. కానీ అనుమతి లభించకపోవడంతో లూధియానాలోనే వాఘా గ్రామ సరిహద్దు సెట్‌ను భారీ స్థాయిలో ఏర్పాటు చేసి, చిత్రీకరణ జరుపుతున్నారట. ఈ షెడ్యూల్ మరో వారం రోజులపాటు సాగుతుంది. ‘భారత్’ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల కానుంది. -
వెయ్యి సార్లు ఫోన్ చేసింది!
పార్టీకి వెళ్లినా, ఈవెంట్‌కి వెళ్లినా, సినిమా ప్రమోషన్‌కి పోయినా సల్మాన్ ఖాన్‌ను మాత్రం ఓ ప్రశ్న వెంటాడుతూనే ఉంది. మీ ‘భారత్’ సినిమా నుంచి ప్రియాంకా చోప్రా ఎందుకు తప్పుకున్నారు? అని. నిన్న మొన్నటి వరకు పెళ్లి కోసం ప్రియాంకా చోప్రా తప్పుకున్నారని సల్మాన్ కూడా మాట దాట వేశారు. రీసెంట్గా గోవాలో జరిగిన ‘బిగ్ బాస్ 12’ ఈవెంట్ లాంచ్‌లో మాత్రం అసలు విషయం చెప్పేశారు. ‘‘నిజానికి ‘భారత్’ సినిమాకు హీరోయిన్గా నిర్మాత అతుల్ అగ్నిహోత్రి ముందుగా కత్రినా కైఫ్‌ను తీసుకుందాం అన్నారు. కానీ ఆ టైమ్‌లోనే ప్రియాంకా చోప్రా నా సిస్టర్ ఆర్పితా ఖాన్‌కు సుమారు వెయ్యిసార్లు ఫోన్ చేసింది. ‘భారత్’ ప్రాజెక్ట్‌పై ఇంట్రస్ట్‌గా ఉన్నాను. సల్మాన్ ఖాన్‌తో వర్క్ చేయాలనుకుంటానని చెప్పింది. అంతేకాదు దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్‌కి కూడా కాల్ చేసింది. ప్రియాంకను తీసుకోవడానికి అది కూడా ఓ కారణమే. సడన్‌గా ఓ రోజు ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానని చెప్పింది. పెళ్లి కోసమే అయితే షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకోమని చెప్పాను. కానీ ప్రాజెక్ట్‌లో నేను కొనసాగను అని ప్రియాంకా తేల్చి చెప్పింది. ఎందుకలా చేసిందో అడగలేదు. ‘సరే నీ ఇష్టం.. ఆల్ ది బెస్ట్’ అని చెప్పాం. ఆమెకు బాలీవుడ్లో సినిమాలు చేయడం ఇష్టం లేదునుకుంటాను. ఇప్పుడు కత్రినా కైఫ్ మా ప్రాజెక్ట్‌లోకి వచ్చింది. ‘భారత్’ బాగానే సాగుతోంది’’ అని చెప్పుకొచ్చారు సల్మాన్. అదండీ సంగతి. ఇందులో కత్రినా కైఫ్‌తో పాటు దిశా పాట్నీ కథానాయికలుగా నటిస్తున్నారు. రీసెంట్గా మాల్తా షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రియాంక ‘ద స్కై ఈజ్ పింక్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌కి కాస్త విరామం దొరకడంతో ప్రస్తుతం కాబోయే భర్త నిక్ జోనాస్‌తో హాలీడేస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. -
‘అందుకే ఆ సినిమా ఒప్పుకున్నా’
‘నా ప్రియ స్నేహితుని కోసం ఈ సినిమా ఒప్పుకున్నాను’ అంటున్నారు అందాల ‘మల్లీశ్వరి’ కత్రినా కైఫ్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో, సల్మాన్ ఖాన్ హీరోగా ‘భారత్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో తొలుత ప్రియాంక చోప్రాను హీరోయిన్గా అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రియాంక చోప్రా ఈ చిత్రం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రియాంక స్థానంలోకి కత్రినా కైఫ్ వచ్చారు. కత్రినా - సల్మాన్ జంటగా నటించిన చిత్రాల్లో ‘భారత్’ ఆరోది. ఇప్పటికే వీరిద్దరు జోడిగా ‘మైనే ప్యార్ క్యోం కియా’, ‘పార్టనర్’, ‘యువ్‌రాజ్’, ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ వంటి చిత్రాల్లో నటించారు. ‘భారత్’ చిత్రంలో నటించడం గురించి కత్రినాను అడగ్గా ‘డైరక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ అంటే నాకు చాలా అభిమానం, గౌరవం. ఆయన నా ప్రియ స్నేహితుడు. అలీ సినిమాల్లో నటించడం చాలా బాగుంటుంది. గతంలో నేను అలీ దర్శకత్వంలో కొన్ని చిత్రాల్లో నటించాను. అవన్ని మంచి విజయం సాధించాయి. అన్నింటికి మించి అలీ దర్శకత్వంలో పని చేయడం అంటే చాలా కంఫర్ట్‌గా ఫీలవుతాను. అందుకే ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నాన’న్నారు. అంతేకాక ‘అలీ నాతో మాట్లాడినప్పుడు నీకో స్క్రిప్ట్ పంపిస్తున్నాను. చదివి, దానిపై నీ అభిప్రాయం చెప్పమని అడిగాడు. అలీ పంపిన స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ చిత్రంలో నా పాత్ర చాలా బాగుంటుంది. ఎప్పుడెప్పుడు నన్ను నేను తెర మీద చూసుకుంటానా అని ఆత్రంగా ఎదురు చూస్తోన్నాను. ఇంత మంచి చిత్రంలో నేను భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందని’ తెలిపారు. -
ప్రియాంక పోయి కైఫ్ వచ్చె!
‘భారత్’ సినిమా నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకున్నారు ప్రియాంకా చోప్రా. బాయ్ ఫ్రెండ్ నిక్ జోనస్‌తో వివాహం కారణంగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని బీ టౌన్ టాక్. ఈ సినిమా నుంచి ప్రియాంక వెళ్లిపోయినా చిత్రదర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఫీలవ్వలేదు. హ్యాపీగా అంగీకరించారు. కానీ ప్రియాంకా చోప్రా పాత్రకు సంబంధించిన షూటింగ్ వచ్చే వారంలో స్టార్ట్ కావాల్సింది. ఇప్పుడు ప్రియాంక ప్లేస్‌ను కత్రినా కైఫ్ రీప్లేస్ చేయనున్నారట. ఆల్రెడీ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్లది హిట్ కాంబినేషన్ కాబట్టి కత్రినా కరెక్ట్ అని చిత్రబృందం ఆలోచిస్తోందని బాలీవుడ్ సమాచారం. ఈ సినిమాలో దిశా పాట్నీ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దిశాది సల్మాన్ సిస్టర్ పాత్ర అని వినికిడి. సల్మాన్ ఫాదర్‌గా జాకీ ష్రాఫ్ నటిస్తున్నారని బీ టౌన్లో ప్రచారం జరుగుతోంది. ‘భారత్’ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ కానుంది. -
పెళ్లి కోసమేనా?
ఇవ్వక ఇవ్వక రెండేళ్ల తర్వాత ప్రియాంకా చోప్రా బాలీవుడ్లో ‘భారత్’ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఆమె అభిమానులు ఆనందపడ్డారు. ఇప్పుడు ఆ సినిమా నుంచి ఆమె తప్పుకున్నారని తెలిసి రెట్టింపు ఆనందపడుతున్నారు. ప్రియాంక సినిమా చేయకపోతే హ్యాపీ ఫీలవ్వాల్సిన అవసరం ఏంటీ? అంటే.. ఓ స్పెషల్ రీజన్ ఉంది. ‘భారత్’ సినిమా డేట్స్‌ను క్యాన్సిల్ చేసిన ప్రియాంకా, పెళ్లికి డేట్స్ ఇచ్చారని బాలీవుడ్ టాక్. సల్మాన్‌ఖాన్ హీరోగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘భారత్’. ఈ సినిమా నుంచి సడన్‌గా ప్రియాంక తప్పుకున్నారు. ఈ విషయంపై దర్శకుడు జాఫర్ క్లారిటీ ఇస్తూ– ‘‘అవును..‘భారత్’ సినిమాలో ప్రియాంకా చోప్రా నటించడం లేదు. ఈ నిర్ణయాన్ని ఆమె నిక్ ఆఫ్ టైమ్ (చివరి నిమిషం) లో చెప్పారు. హ్యాపీ లైఫ్‌ని ప్రియాంక గడపాలని ‘భారత్’ టీమ్ కోరుకుంటోంది’’ అని పేర్కొన్నారు. ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనాస్ పేరు వచ్చేట్లు ‘నిక్ ఆఫ్ టైమ్’ అని దర్శకుడు జాఫర్ ప్రస్తావించడంతో.. నిక్‌తో ప్రియాంక పెళ్లికి రెడీ అయిట్లు ఆయన హింటు ఇచ్చినట్లుగా కొందరు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే సోనాలి బోస్ దర్శకత్వంలో రూపొందనున్న ‘ద స్కై ఈజ్ పింక్’ సినిమాను కూడా ప్రియాంక ఒప్పుకున్నారు. మరి ఈ సినిమాలో నటించే విషయం గురించి కూడా ప్రియాంక ఏమైనా షాక్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ. -
ప్రియాంక అవుట్.. వెరీ స్పెషల్
నటి ప్రియాంక చోప్రా(36) గత కొంత కాలంగా బాలీవుడ్ చిత్రాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె సల్మాన్ ఖాన్ భరత్ చిత్రంలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు. కొన్ని రోజులపాటు షూటింగ్లో పాల్గొన్న ఆమె.. ఇప్పుడు ఆ ప్రాజెక్టు నుంచి అర్థాంతరంగా తప్పుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ వార్త నిజమేనన్న విషయాన్ని ధృవీకరిస్తూ భరత్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జఫర్ ఓ ట్వీట్ చేశారు. ‘అవును.. ప్రియాంక చోప్రా ఇక భరత్ చిత్రంలో భాగస్వామి కాదు. అందుకు వెరీ స్పెషల్ కారణం ఉంది అంటూ నిక్, ప్రియాంకల పేరును ప్రస్తావిస్తూ పరోక్షంగా ఓ ట్వీట్ చేశారు. అంతేకాదు ఆమె ఎల్లప్పుడూ ప్రేమతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొంటూ భరత్ టీం తరపున జఫర్ ఆ ట్వీట్లో పేర్కొన్నాడు. దీంతో ఈ డైరెక్టర్ పెద్ద హింటే ఇచ్చాడని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. త్వరలో వీరిద్దరూ ఒకటి కాబోతున్నారన్న కథనాలు బాలీవుడ్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు అమెరికా మీడియా సైతం వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యిందంటూ వార్తలు ప్రచారం చేస్తున్నాయి. తనకన్నా వయసులో చిన్నవాడైన అమెరికన్ నటుడు నిక్ జోనాస్(25)తో ప్రియాంక చోప్రా గత కొంతకాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ఇండియాకు తిరిగొచ్చిన ఆమె.. కూడా జోన్స్‌ను తీసుకురావటం, వారిద్దరు ఎక్కడపడితే కెమెరా కళ్లకు చిక్కటంతో రకరకాల కథనాలు వినిపించాయి. ఇరు కుటుంబాలు ఒప్పుకోవటంతో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ జరిగిందని, త్వరలో వీరిద్దరూ వివాహానికి సిద్ధమయ్యారన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. Yes Priyanka Chopra is no more part of @Bharat_TheFilm & and the reason is very very special , she told us in the Nick of time about her decision and we are very happy for her ... Team Bharat wishes @priyankachopra loads of love & happiness for life 😊😉😍 — ali abbas zafar (@aliabbaszafar) 27 July 2018 -
వన్ మూవీ.. ఫైవ్ గెటప్స్
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఏజ్ ప్రజెంట్ మూడు పదులకు మించి ఉంటుంది. ఆమె అరవై ఏళ్ల వయసులో ఎలా ఉంటారో చూడాలంటే మరో పాతికేళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చే ఏడాది వరకు వేచి చూస్తే చాలు. ఎందుకంటే.. ‘భారత్’ అనే సినిమాలో అరవై ఏళ్లున్న పాత్రలో నటించబోతున్నారు ప్రియాంక. అలీఅబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘భారత్’. కొరియన్ మూవీ ‘ఓడ్ టు మై ఫాదర్’ చిత్రానికి ఇది రీమేక్. 1947 నుంచి 2010 మధ్య కాలం బ్యాక్‌డ్రాప్‌లో సినిమా కథనం సాగుతుంది. సల్లూ భాయ్ ఫైవ్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారన్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రియాంకా చోప్రా కూడా ఐదు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపించనున్నారు. ‘‘సల్మాన్‌ఖాన్‌లా ప్రియాంకా చోప్రా కూడా ఈ చిత్రంలో ఫైవ్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు. 28–60 ఇయర్స్ మధ్యలో సల్మాన్ కనిపిస్తే, 25–65 ఏజ్ గ్రూప్‌లో ప్రియాంకా ఫైవ్ డిఫరెంట్ గెటప్స్‌లో దర్శనమిస్తారు. ఇందుకు ప్రోస్థటిక్ మేకప్ వాడతాం. గ్రాఫిక్స్ కూడా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. వచ్చే ఏడాది రంజాన్‌కు ‘భారత్’ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
పదేళ్ల తరువాత సల్మాన్‌తో..!
ముంబై : బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమా షూటింగ్‌లతో బిజీగా బిజీగా గడుపుతున్నారు. రెండేళ్లుగా బాలీవుడ్ తెరకు దూరమైన పిగ్గీ చాప్స్.. సల్మాన్ ఖాన్ ‘భారత్’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. టైగర్ జిందా హై ఫేమ్ అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా తెలిపారు. దక్షిణ కొరియా సినిమా ‘ఓదే టూ మై ఫాదర్’ స్ఫూర్తితో తెరకెక్కుతోంది ఈ చిత్రం. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారత్’ టీమ్‌తో పనిచేయడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. సల్మాన్, అలీలతో మరోసారి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. గతంలో వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మళ్లీ ఈ సినిమాతో ఆ అవకాశం లభించింది’ అంటూ ప్రియాంక ఆనందం వ్యక్తం చేశారు. గతంలో అలీ అబ్బాస్ జాఫర్ ‘గూండే’, సల్మాన్ ఖాన్ ‘ముజ్ సే షాదీ కరోగీ’ సినిమాలలో ప్రియాంక నటించారు. 2016లో విడుదలైన ‘జై గంగా జల్’ సినిమా తర్వాత హాలీవుడ్ సినిమాలు, అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోతో ప్రియాంక బాలీవుడ్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం సల్మాన్ సినిమాకు సైన్ చేయడంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. ‘సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఒక వ్యక్తి, జాతి కలిసి చేసే ప్రయాణం ‘భారత్’. ఈద్ 2019’ అంటూ దర్శకుడు అలీ అబ్బాస్ చేసిన ట్వీట్‌ను బట్టి చూస్తే.. సినిమా కోసం మరో ఏడాదిపాటు వేచి చూడక తప్పదు. And it begins “Bharat” @BeingSalmanKhan . A journey of a man and a nation together . Eid 2019 pic.twitter.com/nD05ca2FDE — ali abbas zafar (@aliabbaszafar) 16 April 2018 -
ప్రియాంకకు బదులు కత్రినా?
కృష్ణ జింకలను వేటాడిన కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన సల్మాన్ తన తదుపరి సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు. చక చకా తన ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం రేస్ 3 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత సల్మాన్.. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్లో ‘భరత్’ సినిమాను ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక చోప్రాను హీరోయిన్గా తీసుకోనున్నట్లు గతంలో ఊహాగానాలు వినిపించాయి. ఈ సినిమా విషయం మాట్లాడేందుకే ప్రియాంక అమెరికా నుంచి ముంబైకి వచ్చిందని అందరూ అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా కత్రినా కైఫ్‌ను తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. టైగర్ జిందా హై సూపర్ హిట్ కావడంతో మళ్లీ అదే జోడిని తీసుకోవాలనే ఆలోచనలో దర్శకుడు అలీ అబ్బాస్ ఉన్నాడని.. కత్రినాను దాదాపుగా ఓకే చేశారని తెలుస్తోంది. సల్మాన్, కత్రినాలది హిట్ పెయిర్ కూడా కావటంతో బిజినెస్ పరంగా కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారట చిత్రయూనిట్. -
స్టార్ డైరెక్టర్ అకౌంట్ హ్యాక్..
సాక్షి, ముంబై : సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు తరచుగా హ్యాకింగ్‌కు గురవుతుంటాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్వీటర్ ద్వారా తెలుపుతూ.. 'ఎవరో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు. ప్రస్తుతం అంతా ఒకే. మరో విషయం ఏంటంటే.. నాకు స్నాప్‌చాట్ అకౌంట్ లేదు. నాపేరుతో స్నాప్‌చాట్ ఖాతా ఎవరైనా నిర్వహిస్తున్నారంటే హ్యాకర్ అని గుర్తించాలంటూ' డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ ట్వీట్లో రాసుకొచ్చారు. సల్మాన్ ఖాన్ హీరోగా సినిమాలు తీసి రికార్డు వసూళ్లు రాబట్టిన దర్శకుడే ఈ అలీ అబ్బాస్ జాఫర్. 2017లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రంగా టైగర్ జిందా హై’ రికార్డులకెక్కింది. సల్మాన్, అలీ అబ్బాస్ కాంబినేషన్లో వచ్చిన ‘టైగర్ జిందా హై’ , ‘సుల్తాన్’, మూవీలు ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి ‘భరత్’ అనే సినిమా కోసం కలిసి పనిచేస్తున్నారు. Hack alert , someone hacked my Instagram account , sorting it out also I am not on Snapchat , so if someone uses Snapchat under my name is the hacker. Have a good day . — ali abbas zafar (@aliabbaszafar) 29 March 2018 -
ఇమేజ్ను పక్కనబెట్టి సల్మాన్ కొత్త ప్రయోగం?
సాక్షి, ముంబై : తాజా సినిమా ‘టైగర్ జిందా హై’ సూపర్‌హిట్‌తో సల్మాన్ ఖాన్ మంచి జోష్‌లో ఉన్నాడు. 2017లో బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'టైగర్' రికార్డులకెక్కింది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో జాఫర్‌తో మరో సినిమాకు సల్మాన్ రంగం సిద్ధం చేశాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ సినిమాలు సూపర్‌హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి ఈ ఇద్దరు కలిసి ‘భరత్’ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది రంజాన్ పండుగకు ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. 2014లో కొరియాలో వచ్చిన ‘అడ్ టు మై ఫాదర్’ సినిమా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. సల్మాన్ తన ఇమేజ్ను పూర్తిగా పక్కనపెట్టి ఈ సినిమాలో డిఫరెంట్ రోల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది, సల్మాన్ తరహా యాక్షన్, కామెడీ కాకుండా కొత్త తరహాలో ఈ పాత్ర ఉండబోతందని సమాచారం. -
100 మంది డ్యాన్సర్లు... 4 దేశాలు!
ఒక సాంగ్‌ను సూపర్‌గా షూట్ చేయాలనుకుంటే రిచ్ లొకేషన్స్ కోసం విదేశాలను సెలెక్ట్ చేస్తారు దర్శక–నిర్మాతలు. అక్కడి లోకల్ జూనియర్ ఆర్టిస్టులనే తీసుకుంటారు. కానీ, అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా రూపొందిన ‘టైగర్ జిందా హై’ సినిమాలోని ‘స్వాగ్ ఇన్ స్వాగ్ సే స్వాగత్..’ సాంగ్ కోసం 4 దేశాల నుంచి 100 మంది డ్యాన్సర్లను రప్పించి, షూట్ చేశారు. సాంగ్ షూట్ లేట్ అవ్వకూడదని గ్రీస్, ఫ్రాన్స్, ఇటలీ, ట్రినిడాడ్ దేశాల నుంచి రప్పించిన జూనియర్ ఆర్టిస్టులకు ముందుగానే డ్యాన్స్ రిహార్సల్స్ నిర్వహించారు. వీళ్లతో పాటు సల్మాన్, కత్రినా వేసిన స్టెప్పులు అదిరిపోయేలా ఉంటాయట. ‘‘ఈ సినిమాకి ఈ పాట కీలకంగా ఉంటుంది. ‘సెలబ్రేటింగ్ పీస్’ అన్న కాన్సెప్ట్‌తో సాంగ్‌ను రూపొందించాం. అందుకే ఇలా నాలుగు దేశాలకు చెందిన ఆర్టిస్టులతో ప్లాన్ చేసి షూట్ చేశాం’’ అని పేర్కొన్నారు దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్. 2012లో వచ్చిన ‘ఏక్తా టైగర్’ సినిమాకు ‘టైగర్ జిందా హై’ చిత్రం సీక్వెల్ అన్న సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో కత్రినా యాక్షన్ సీక్వెన్స్‌లో నటించారు. డిసెంబర్ 22న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
దీపావళికి సల్మాన్ గిఫ్ట్..!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టైగర్ జిందాహై. ఇటీవల విడుదలైన ట్యూబ్ లైట్ ఆశించిన స్ధాయి విజయం సాధించకపోవటంతో ఈ సినిమాతో మరోసారి సత్తా చాటాలని భావిస్తున్నాడు సల్మాన్. ఈ సినిమా గతంలో ఘనవిజయం సాధించిన ఏక్తా టైగర్ సినిమాకు సీక్వల్ కావటంతో టైగర్ జిందాహై పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో సల్మాన్, కత్రినాలు మరోసారి టైగర్ జోయా పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. సల్మాన్ కు సూపర్బ్ రికార్డ్ ఉన్న క్రిస్టమస్ సీజన్ లోనే ఈ సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈలోగా అభిమానుల్లో అంచనాలు పెంచేందుకు ఈ దీపావళి ఓ గిప్ట్ ఉందంటూ ఊరిస్తున్నాడు దర్శకుడు జాఫర్. అయితే ఆ గిఫ్ట్ టీజరే అయి ఉంటుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. Arre bhai Sabko pata hai 22 Dec ko @TigerZindaHai as rahi hai.Bahut kaam chal raha hai,abhi Diwali aa rahi hai... kuch gift toh milega 😉 — ali abbas zafar (@aliabbaszafar) 11 October 2017 -
మళ్లీ జంటగా మాజీ ప్రేమికులు!
సుల్తాన్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న సల్మాన్ ఖాన్.. మరోసారి తన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్‌తో కలిసి సినిమా చేస్తున్నాడు. వీళ్లిద్దరూ జంటగా 2012లో వచ్చిన యాక్షన్ రొమాంటిక్ సినిమా 'ఏక్ థా టైగర్'. ఆ సినిమాకు సీక్వెల్ గానే ఇప్పుడు 'టైగర్ జిందా హై' అనే సినిమా తీస్తున్నారు. పాత సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా.. ఈసారి మాత్రం సుల్తాన్ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ మెగాఫోన్ పడుతున్నారు. యశ్‌రాజ్ ఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. బక్రీద్ సందర్భంగా దర్శకుడు జాఫర్ ట్విట్టర్లో ఈ కొత్త సినిమా పోస్టర్ విడుదల చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ సినిమా అంటే కాస్త భయంగాను, మరోవైపు ఉత్సాహంగాను కూడా ఉందని తెలిపాడు. ఒక ఇండియన్ ఏజెంటు, పాకిస్థానీ గూఢచారి.. ఇద్దరూ ఒకే శత్రువుపై పోరాటం చేస్తారన్న విషయం పోస్టర్లో టైటిల్ కింద ఉంది. ఏక్‌థా టైగర్ సినిమాలో కూడా భారతీయ గూఢచారి టైగర్.. పాకిస్థానీ గూఢచారి కత్రినాతో ప్రేమలో పడతాడు. ఈ సినిమా వచ్చే ఏడాది క్రిస్మస్ నాటికి విడుదల అవుతుందట. సల్మాన్, కత్రినా కలిసి ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేశారు. 'మైనే ప్యార్ క్యోం కియా', 'పార్ట్నర్', 'యువరాజ్', 'ఏక్ థా టైగర్'. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇది ఐదో సినిమా కానుంది. Tiger Zinda Hai @BeingSalmanKhan #katrina kaif. Nervousness and excitement. pic.twitter.com/c8tHrBenIe — ali abbas zafar (@aliabbaszafar) 13 September 2016 -
అనుష్క నన్ను క్లీన్ బౌల్డ్ చేసింది
సుల్తాన్ సినిమాలో మహిళా రెజ్లర్‌గా అనుష్కాశర్మ నటనకు ఆ సినిమా దర్శకుడు అలీ అబ్బాస్ జఫర్ ఫిదా అయిపోయాడు. తన రూపంతోను, కచ్చితమైన యాసతోను ఆమె తనను క్లీన్‌బౌల్డ్ చేసిందని అన్నాడు. నిజానికి ఈ సినిమాలో నటించేందుకు అనుష్క ఆరు వారాల పాటు రోజూ గంటల కొద్దీ కఠిన వ్యాయామం చేసింది, రెజ్లింగ్‌లో కూడా శిక్షణ పొందింది. రెజ్లింగ్ కోసం ఒకరు, మంచి శక్తి కోసం మరొకరు, కండరాలను రిలాక్స్ చేయడానికి ఒక ఫిజియోథెరపిస్ట్.. ఇలా ముగ్గురి వద్ద ఆమె శిక్షణ తీసుకుంది. దీనికితోడు అనుష్క కచ్చితమైన శాకాహారి. దాంతో కండలు పెంచుకోడానికి బాగా ప్రోటీన్లున్న ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. ఆరు వారాల్లో ఆమె ఏం చేయగలదన్న అనుమానం తనకు ఉండేదని.. కానీ ఒక్క రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా కఠోర శిక్షణ పొంది అద్భుతంగా చేసిందని దర్శకుడు అలా అబ్బాస్ జఫర్ చెప్పాడు. ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించిన సుల్తాన్ సినిమా ఈ సంవత్సరం ఈద్ సందర్భంగా విడుదల కానుంది. -
యూట్యూబ్‌లో సుల్తాన్ సెన్సేషన్
సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా సుల్తాన్. హరియాణాకు చెందిన ప్రముఖ రెజ్లర్ సుల్తాన్ అలీఖాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అనుష్క శర్మ సుల్తాన్ ప్రేయసి ఆర్ఫా పాత్రలో నటిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో ఆమె కూడా రెజ్లర్‌గా కనిపించేందుకు ఎంతో కష్టపడి మల్లయుద్ధం నేర్చుకుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సుల్తాన్ అఫీషియల్ టీజర్ మంగళవారం రిలీజ్ అయ్యింది. యష్ రాజ్ ఫిలింస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయిన ఈ ట్రైలర్, రిలీజ్ అయిన గంటల వ్యవథిలో 14 లక్షలకు పైగా వ్యూస్‌తో రికార్డ్ సృష్టించింది. ప్రేమ్ రతన్ ధన్ పాయో తరువాత సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
యూపీలో సుల్తాన్ హవా
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న సుల్తాన్ సినిమా షూటింగ్ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో శరవేగంగా సాగుతోంది. దీనికి సంబంధించిన విషయాలను సినిమా దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అటూ ఇటూ దట్టమైన చెట్ల మధ్య ఉన్న రోడ్డుమీద హీరో సల్మాన్ ఖాన్ ఓ పాతకాలం నాటి నీలి రంగు స్కూటర్ వేసుకుని వెళ్తున్న ఫొటోను జాఫర్ ట్వీట్ చేశాడు. దానికి ''మోర్నా, ముజఫర్‌నగర్, ఉత్తరప్రదేశ్ సుల్తాన్. సింప్లీ బ్యూటిఫుల్'' అని కేప్షన్ పెట్టాడు. యూపీలో షూటింగుకు ముందు ఈ సినిమాలో మొత్తం తారాగణం అంతా కలిసి ఢిల్లీలో ఓ షెడ్యూలు పూర్తిచేశారు. ఈ సినిమాలో ఢిల్లీలో ఉన్న 360 ఏళ్ల నాటి జమా మసీదు కూడా కనిపిస్తుంది. యష్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇంఉదలో అనుష్కా శర్మ, రణదీప్ హూడా కూడా నటిస్తున్నారు. ఈ సంవత్సరం ఈద్ సందర్భంగా సినిమాను విడుదల చేయాలని తలపెడుతున్నారు. సల్మాన్‌ఖాన్‌కు ఉన్న ఈద్ సెంటిమెంటు ప్రకారం ఇది కూడా బంపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాడు. Morna, Muzzafarnagar , Uttar Pradesh @SultanTheMovie . Simply Beautiful. pic.twitter.com/HETenNNzOJ — ali abbas zafar (@aliabbaszafar) 28 April 2016