Azhar Ali
-
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పాకిస్తాన్ స్టార్ ఆటగాడు
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ అజహర్ అలీ అంతర్జాతీయ క్రికెట్లో అన్నిరకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే వన్డేలు, టీ20ల నుంచి తప్పుకున్న అజర్ ఆలీ తాజాగా టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చేప్పేశాడు. శుక్రవారం విలేకురుల సమావేశంలో అజర్ ఆలీ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. కరాచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే మూడో టెస్టు అనంతరం టెస్టుల నుంచి ఆలీ తప్పుకోనున్నాడు. 2010లో టెస్టుల్లో అంతర్జాతీయ ఆలీ ఆరంగ్రేటం చేశాడు. 12 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు పాకిస్తాన్ క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆలీ.. 95 టెస్టుల్లో 42.60 సగటుతో 7030 పరుగులు చేశాడు. 2016లో వెస్టిండీస్‌పై పింక్ బాల్ టెస్టులో ఆలీ అద్భుతమైన ట్రిపుల్ సెంచరీ సాదించాడు. అదే విధంగా పాకిస్తాన్ టెస్టు క్రికెట్ చరిత్రలో టాప్ రన్ స్కోరర్ జాబితాలో అజహర్ ఆలీ ఐదో స్థానంలో ఉన్నాడు. "నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. పాకిస్తాన్ క్రికెట్‌తో నా 12 ఏళ్ల బంధానికి ముగింపు పలకాల్సి రావడం చాలా బాధగా ఉంది. నేను బాగా ఆలోచించిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాడు. నీను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. నా ఈ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అభిమానులకు, నా కుటంబ సభ్యలకు, పాకిస్తాన్ క్రికెట్‌కు అభినందనలు తెలియజేయాలి అనుకుంటున్నాను" ఆలీ పేర్కొన్నాడు. చదవండి: IND vs BAN: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. కెప్టెన్ వచ్చేస్తున్నాడు! -
Pak Vs Aus 3rd Test: ఆస్ట్రేలియా 391 ఆలౌట్
Pak Vs Aus 3rd Test Day 2- లాహోర్: పాకిస్తాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 133.3 ఓవర్లలో 391 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 232/5తో ఆట రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 159 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. గ్రీన్ (79; 9 ఫోర్లు), క్యారీ (67; 7 ఫోర్లు) ఆరో వికెట్‌కు 135 పరుగులు జత చేశారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది (4/79), నసీమ్ షా (4/58) రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 90 పరుగులు చేసింది. షఫీఖ్ (45 బ్యాటింగ్), అజహర్ అలీ (30 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు.. After a spectacular bowling stint by the Shahs, we close Day 2 trailing by 301 runs.#BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/NEVQKidyZM — Pakistan Cricket (@TheRealPCB) March 22, 2022 -
23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్.. ఇప్పుడు పాకిస్తాన్ బ్యాటర్
కరాచీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో టెస్టులో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సరిగ్గా 23 ఏళ్ల క్రితం 1999లో అడిలైడ్ టెస్టులో మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డకౌట్ అయ్యాడు. మెక్‌గ్రాత్ వేసిన షార్ట్‌పిచ్ బంతి వేయడంతో సచిన్ కాస్త కిందకు వంగి షాట్ ఆడుదామని భావించాడు. అయితే బంతి అనూహ్యంగా బౌన్స్ కాకుండా అదే లెంగ్త్‌లో వెళ్లి సచిన్ తొడలను తాకుతూ భుజాల పైనుంచి బంతి వెళ్లింది. దీంతో మెక్‌గ్రాత్ అప్పీల్ చేయగా.. అప్పటి అంపైర్ డారెల్ హార్పర్ సందేహం లేకుండా ఔట్ ఇచ్చాడు. అంపైర్ నిర్ణయంతో షాక్ అయినప్పటికి సచిన్ ఏం చేయలేకపోయాడు. ఎందుకంటే ఆ తర్వాత సచిన్ ఎల్బీ అయినట్లు బిగ్‌స్ర్కీన్‌పై క్లియర్‌గా కనిపించింది. కాగా సచిన్ ఎల్బీ క్రికెట్ చరిత్రలో ఫేమస్ ఎల్బీగా మిగిలిపోయింది. తాజాగా పాక్-ఆసీస్ రెండో టెస్టులో మరోసారి సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈసారి బౌలర్ కామెరాన్ గ్రీన్ కాగా.. బ్యాట్స్‌మన్ అజహర్ అలీ. అప్పటికే 54 బంతులు ఎదుర్కొన్న అజర్ అలీ ఆరు పరుగులు మాత్రమే చేసి క్రీజులో ఇబ్బంది పడుతున్నాడు. ఇది బలంగా భావించిన కామెరాన్ గ్రీన్ తాను వేసిన 23వ ఓవర్లో మెక్‌గ్రాత్‌ను గుర్తుచేస్తూ.. షార్ట్‌లెంగ్త్ డెలివరీ వేశాడు. అయితే అజహర్ అలీ బంతిని సరిగా అంచనా వేయలేక కిందకు వంగాడు. బంతి నేరుగా తొడపై బాగం తాకుతూ వెళ్లింది. గ్రీన్ అప్పీల్ చేయగానే అంపైర్ ఔట్ ఇచ్చాడు. ఇది చూసి షాక్ అయిన అజహర్ అలీ.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న అబ్దుల్లా షఫీక్ చెబ్తున్నా వినకుండా రివ్యూకు వెళ్లాడు. అజహర్‌ను దురదృష్టం వెంటాడింది. బంతి తొడ బాగాన్ని తాకడానికి ముందు చేతి గ్లోవ్స్‌ను తాకినట్లు రిప్లేలో తేలింది. దీంతో అతను ఎల్బీగా ఔటైనట్లు థర్డ్ అంపైర్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ''23 ఏళ్ల క్రితం సచిన్.. ఇప్పుడు అజహర్ అలీ''.. ''అప్పుడు మెక్‌గ్రాత్.. ఇప్పుడు కామెరాన్ గ్రీన్ బౌలర్స్.. మిగతాదంతా సేమ్ టూ సేమ్''..''ఎక్కడ చూసిన ఈ ఆస్ట్రేలియన్ బౌలర్స్ కామన్‌గా ఉంటారు.'' అంటూ కామెంట్స్ చేశారు.ఇక 506 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి పాక్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 171.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 443 పరుగులు సాధించింది. బాబర్, రిజ్వాన్‌ల 115 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యం తర్వాత ఈ జోడీని విడదీయడంలో ఆసీస్ సఫలమైంది. తర్వాతి బంతికే ఫహీమ్ (0)ను, కొద్ది సేపటికే సాజిద్ (9)ను అవుట్ చేసి ఆసీస్ పట్టు బిగించింది. అయితే మిగిలిన 8 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టడంలో విఫలమైన కంగారూలు తీవ్రంగా నిరాశ చెందారు. ఇరు జట్ల మధ్య సోమవారం నుంచి లాహోర్‌లో మూడో టెస్టు జరుగుతుంది. చదవండి: AUS vs PAK: 'మా గుండె ఆగినంత పనైంది'.. అప్పుడు తిట్టినోళ్లే ఇవాళ పొగుడుతున్నారు MS Dhoni: నెంబర్-7 మిస్టరీ వెనుక మనం ఊహించని ట్విస్ట్ Green gets Azhar after lunch. #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/M161IxLr6s — Pakistan Cricket (@TheRealPCB) March 15, 2022 -
PAK Vs AUS: డబుల్ చేజార్చుకున్న అజహర్ అలీ.. పాక్ భారీ స్కోర్
రావల్పిండి: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఆతిధ్య పాకిస్థాన్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి (షఫీఖ్ (44)) 245 పరుగులు చేసిన బాబర్ సేన.. రెండో రోజు కూడా దూకుడు కొనసాగించి 476/4 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి రోజు సెంచరీ హీరో ఇమామ్ ఉల్ హక్ (157; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఓవర్‌నైట్ స్కోర్‌కు 25 పరుగులు జోడించి ఔట్ కాగా, వన్‌డౌన్ ఆటగాడు అజహర్ అలీ (185) రెండో రోజు భారీ శతకాన్ని బాదాడు. కెప్టెన్ బాబార్ ఆజమ్ (36) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ కాగా, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే సమయానికి మహ్మద్ రిజ్వాన్ (29), ఇఫ్తికార్ అహ్మద్ (13) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియాన్, కమిన్స్, లబూషేన్ తలో వికెట్ పడగొట్టగా, బాబర్ రనౌటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన ఆసీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే, 24 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై ఆడుగుపెట్టిన ఆస్ట్రేలియాకు బాంబు పేలుళ్లు స్వాగతం పలికాయి. నిన్న పెషావర్‌లోని మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. పెషావర్‌కు మ్యాచ్ వేదిక అయిన రావల్పిండికి 187 కిమీ దూరం మాత్రమే ఉండటంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉలిక్కిపడ్డారు. చదవండి: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. షెడ్యూల్ విడుదల ఎప్పుడంటే..? -
బాయ్.. బయోబబూల్‌లో ఉన్నాం మర్చిపోయావా
రావల్పిండి: పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆదివారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పాక్ వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ తన సహచర ఆటగాడు అజర్ అలీని ట్రోల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాలు.. ఆటలో నాలుగోరోజైన ఆదివారం దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 21వ ఓవర్లో ఒక పిల్లి మైదానంలోకి పరిగెత్తుకు వచ్చింది. పిల్లిని చూసిన అజర్ అలీ దానిని గ్రౌండ్ నుంచి బయటికి పంపడానికి ప్రయత్నించాడు. ఇది చూసిన రిజ్వాన్.. అజ్జూ బాయ్.. మనం బయోబబూల్‌లో ఉన్నాం.. అది(పిల్లి) లేదు.. ముందు దానికి కరోనా టెస్టు నిర్వహించి ఆ తర్వాత బయటికి పంపు అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. రిజ్వాన్ వ్యాఖ్యలు విన్న పాక్ ఆటగాళ్లు నవ్వును ఆపుకోలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియోనూ ఇస్మాయిల్ ఫారుక్ అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే దక్షిణాఫ్రికా రెండో టెస్టులో విజయం సాధించాలంటే ఇంకా 243 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఒక వికెట్ నష్టపోయి 127 పరుగులు చేసింది. మక్రమ్ 59, వాన్‌డర్ డస్సెన్ 48 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 298 పరుగులకు ఆలౌటైంది. 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు క్రితం రోజు స్కోరుతో నాలుగోరోజు ఆటను ఆరంభించిన పాక్ మహ్మద్ రజ్వాన్ సెంచరీతో( 115, 204 బంతులు; 15 ఫోర్లు) మెరవడంతో 298 పరుగులకు ఆలౌటై దక్షిణాఫ్రికా ముందు 370 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. సోమవారం ఆటకు ఆఖరిరోజు కావడం.. తొలి ఇన్నింగ్స్ హీరో హసన్ అలీ మరోసారి బౌలింగ్‌తో రెచ్చిపోతే ప్రొటీస్ జట్టుకు కష్టాలు తప్పేలా లేవు. కాగా ఇప్పటికే తొలి టెస్టులో విజయం సాధించిన పాకిస్తాన్ రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. Cat enters ground. Azhar Ali chases it. Ajju bhai test nahi kiya ye bubble me nahi hai-Rizwan 😂#PAKvSA #Rizwan pic.twitter.com/qlphrGxjDE — Ismaeel Farrukh (@IsmaeelFarrukh) February 7, 2021 -
ఒక బ్యాడ్ గేమ్‌తో కెప్టెన్సీ తీసేస్తారా?
కరాచీ: పాకిస్తాన్ టెస్టు జట్టుకు కొత్త కెప్టెన్‌గా బాబర్ అజామ్‌ను నియమించేందుకు రంగం సిద్ధమైంది. గతేడాది మే నెలలో పాకిస్తాన్ టెస్టు కెప్టెన్‌గా నియమించబడ్డ అజహర్ అలీ స్థానంలో అజామ్‌ను కెప్టెన్‌గా చేయాలని పీసీబీ భావిస్తోంది. ఇప్పటికే పరిమిత ఓవర్ల జట్లకు కెప్టెన్‌గా ఉన్న అజామ్‌నే టెస్టులకు కూడా సారథిగా నియమించడమే సరైనదిగా పాక్ బోర్డు యోచిస్తోంది.ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను పాకిస్తాన్ కోల్పోవడంతో అజహర్ అలీకి ఉద్వాసన పలికారు. తొలి టెస్టులో అజహర్ అలీ ఫీల్డింగ్ తప్పిదం కారణంగానే ఆ మ్యాచ్ పోయిందని పీసీబీకి అందిన రిపోర్ట్. దాంతో టెస్టు కెప్టెన్ పదవిని అజహర్ అలీ కోల్పోయాడు. దీనిపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. ఇది చాలా అన్యాయమని అక్తర్ విమర్శించాడు. ఒక బ్యాడ్ గేమ్‌తో కెప్టెన్సీని మార్చేస్తారా అంటూ పీసీబీ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ‘ ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అజహర్ అలీ తప్పుచేశాడు.. దాన్ని అంగీకరిస్తాను. ఆ ఫీల్డింగ్ చర్యతో అతను తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఆ తప్పు కారణంగా అతన్ని కెప్టెన్‌గా తీసేయడం అన్యాయం. కేవలం ఒక మ్యాచ్ కారణంగా అజహర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారా?, నేనే కచ్చితంగా చెప్పగలను.. రాబోవు మ్యాచ్‌ల్లో అజహర్ వంద శాతం ప్రదర్శన ఇవ్వగలడు. ఈ తరహా చర్యలు ఆటగాళ్ల ఆటపై ప్రభావం చూపుతాయి’ అని తన యూట్యూబ్ చానల్ అక్తర్ పేర్కొన్నాడు. ఇప్పటివరకూ తొమ్మిది టెస్టులకు కెప్టెన్‌గా చేసిన అజహర్ అలీ.. రెండు మ్యాచ్‌లను గెలిచి, నాలుగు మ్యాచ్‌లను కోల్పోయాడు. -
అలాంటి వారికి ప్రదర్శనతోనే సమాధానమివ్వాలి
కరాచీ : పాకిస్తాన్ టెస్టు జట్టు కెప్టెన్ అజహర్ అలీ తన సహచర ఆటగాడైన సర్ఫరాజ్ అహ్మద్‌కు మద్దతునిస్తున్నట్లు పేర్కొన్నాడు. సర్ఫరాజ్‌ను విమర్శించేవారిని ఏదో ఒకరోజు తన ప్రదర్శనతోనే సమాధానమిస్తాడని తెలిపాడు. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఇంగ్లండ్, పాక్‌ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ అహ్మద్ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీని తేలిగ్గా స్టంపింగ్ చేసే అవకాశాన్ని జారవిడిచాడు. దీంతో మొయిన్ అలీ 61 పరుగులతో జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచి విజయానికి దగ్గరగా తీసుకువచ్చాడు. కానీ చివరికి 191 పరుగులే చేసిన ఇంగ్లండ్ జట్టు కేవలం 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సర్ఫరాజ్‌ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ కామెంట్ చేశారు. అలీని ఔట్ చేసే సువర్ణవకాశాన్ని చేజేతులా మిస్ చేసిన సర్ఫరాజ్‌ను అందరూ విమర్శించారు. అంతేగాక అతనిపై జోకులు కూడా పేల్చారు. దీనిపై సర్ఫరాజ్ తన ట్విటర్లో తనను విమర్శించిన వారినుద్దేశించి ఉర్ధూ భాషలో ఘాటుగాఏనే స్పందించాడు. సర్ఫరాజ్ చేసిన ట్వీట్‌కు తాను మద్దతిస్తున్నట్లు టెస్టు జట్టు కెప్టెన్ అజహర్ అలీ పేర్కొన్నాడు. (చదవండి : వైజ్ కెప్టెన్ ఉన్నాడు.. వైస్ కెప్టెన్ ఎందుకు?) 'భయ్యా.. మీకు చాలా మంది అభిమానులున్నారు.. అందులో నేను కూడా ఒకడిని. నిన్ను విమర్శించేవారికి నీ ప్రదర్శనతోనే సమాధానం చెప్తావు. అల్లా కూడా ఎప్పుడు నీవెంటే ఉంటాడు. పాకిస్తాన్ జట్టుకు ఎన్నోసార్లు ఉపయోగపడ్డావు.. ఈ సిరీస్‌లో కూడా మంచి పాజిటివ్ ఎనర్జీతో ఉన్నావు.. దానిని అలాగే కొనసాగించు.'అంటూ చెప్పుకొచ్చాడు. కాగా గతంలో సర్ఫరాజ్ పాక్ జట్టుకు టీ20, టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిచిన సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో కెప్టెన్ పదవి పోయాకా తన నిరాశజనకమైన ప్రదర్శనతో జట్టులో సుస్థిర స్థానం కోల్పోయాడు. -
అజహర్ అలీ సెంచరీ: పాక్ 273
సౌతాంప్టన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో క్రికెట్ టెస్టులో పాకిస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 93 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 310 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. పాక్ కెప్టెన్ అజహర్ అలీ (141 నాటౌట్; 21 ఫోర్లు) కెరీర్లో 17వ టెస్టు సెంచరీ చేయడంతోపాటు 6 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఓవర్‌నైట్ స్కోరు 24/3తో మూడో రోజు ఆదివారం ఆట కొనసాగించిన పాక్‌ను ఇంగ్లండ్ బౌలర్లు అండర్సన్ (5/56), బ్రాడ్ (2/40) దెబ్బ తీశారు. అంతకుముందు రెండో రోజు శనివారం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 583 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. జాక్ క్రాలీ (267; 34 ఫోర్లు, సిక్స్) డబుల్ సెంచరీ... జోస్ బట్లర్ (152; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించారు. -
ఇదేనా కెప్టెన్సీ.. ట్రిక్స్ ఎక్కడ?
కరాచీ: ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ గెలుపు అంచుల వరకూ వచ్చి ఓటమి చెందడం పట్ల మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ విమర్శలు గుప్పించాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కంటే పాకిస్తాన్ అన్ని విధాలా బాగా ఆడినా అవసరమైన సందర్భంలో రాణించలేకపోవడం వల్లే విజయం సాధింలేకపోయిందన్నాడు. ప్రధానంగా అజహర్ అలీ కెప్టెన్సీని ఇంజీ వేలెత్తిచూపాడు. అజహర్ కొన్ని ప్రయోగాలు చేయకపోవడం వల్లే గెలవాల్సిన మ్యాచ్‌ను పరాజయంతో ముగించాల్సి వచ్చిందన్నాడు. ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో రెండొందల పరుగులలోపే ఆలౌట్ చేస్తుందనుకుంటే చివరకు గెలుపును వారికి అందించడం నిరాశను మిగిల్చిందన్నాడు. తన యూట్యూబ్ చానల్లో ఇంగ్లండ్‌పై పాకిస్తాన్ ఓటమిని ఇంజీ విశ్లేషించాడు. ‘ నా ప్రకారం చూస్తే ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకే ఆలౌట్ అవుతుందని అనుకున్నా. కానీ మా కెప్టెన్ అజహర్ అలీ చేసిన తప్పిదాల వల్ల ఇంగ్లండ్‌కు గెలిచే అవకాశం ఇచ్చాం. కనీసం షార్ట్ బాల్స్‌ను కూడా ఎక్కడా ప్రయోగించలేదు. ఇంగ్లండ్ విజయానికి కారకులైన బట్లర్, వోక్స్‌లు షార్ట్ పిచ్ బంతుల్ని ఆడలేరు. ఈ ప్రయోగం చేయలేదు. అజహర్ అలీ కెప్టెన్‌గా ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఇంగ్లండ్ కంటే పాకిస్తాన్ బలంగా ఉంది’ అని ఇంజీ పేర్కొన్నాడు. పాకిస్తాన్ నిర్దేశించిన 277 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్ ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంలో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్(75) , వోక్స్ (84)లు కీలక పాత్ర పోషించారు.(బట్లర్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటో?) -
పాక్ కెప్టెన్ జెర్సీ... పుణే మ్యూజియానికి
కరాచీ: కరోనా బాధితులను ఆదుకునేందుకు మరో క్రికెటర్ ముందుకొచ్చాడు. ఈసారి పాకిస్తాన్ టెస్టు జట్టు కెప్టెన్ అజహర్ అలీ తనకు చిరస్మరణీయమైన బ్యాట్, జెర్సీలను వేలానికి ఉంచాడు. 2016లో వెస్టిండీస్‌పై ట్రిపుల్ సెంచరీ (302) చేసిన బ్యాట్‌తో పాటు, భారత్‌తో జరిగిన 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ధరించిన జెర్సీని అజహర్ పాకిస్తాన్ కరెన్సీలో పది లక్షల రూపాయల (భారత కరెన్సీలో రూ. 4 లక్షల 73 వేలు) చొప్పున కనీస ధరకు అమ్మకానికి పెట్టాడు. దీంతో భారత్‌కు చెందిన ‘బ్లేడ్స్ ఆఫ్ గ్లోరీ’ క్రికెట్ మ్యూజియం (పుణే) బ్యాట్‌ను కనీస ధరకే దక్కించుకోగా... కాలిఫోర్నియాలో స్థిరపడ్డ పాకిస్తానీ కాశ్ విలానీ జెర్సీని పాకిస్తాన్ కరెన్సీలో 11 లక్షల రూపాయలకు (భారత కరెన్సీలో రూ. 5 లక్షల 20 వేలు) చేజిక్కించుకున్నాడు. న్యూజెర్సీలో స్థిరపడిన జమాల్ ఖాన్ లక్ష రూపాయల (భారత కరెన్సీలో రూ. 43 వేలు) విరాళం ఇచ్చాడు. దీంతో వేలం ద్వారా లభించిన మొత్తాన్ని కరోనా బాధితుల కోసం ఇవ్వనున్నట్లు అజహర్ తెలిపాడు. -
‘ఇదేం పద్ధతి.. నాకైతే అర్థం కావట్లేదు’
ఇస్లామాబాద్: కోచింగ్‌లో కనీసం క్లబ్ లెవల్లో కూడా అనుభవం లేని మిస్బావుల్ హక్‌ను పాకిస్తాన్ ప్రధాన కోచ్‌గా కొనసాగించడం పట్ల ఆ జట్టు మాజీ ఆటగాడు మహ్మద్ యూసఫ్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చర్యలను తప్పుపడుతూ ఎగతాళిగా మాట్లాడాడు. ఆటలో నైపుణ్యం, కెప్టెన్సీలో నిజాయితీ, కోచ్‌గా అనుభవం లేనటువంటి మిస్బావుల్‌ను పాక్ హెడ్ కోచ్‌గా నియమించడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ ప్రామాణికంగా అతడిని కోచ్‌గా కొనసాగిస్తున్నారో చెప్పాలని పీసీబీని యూసఫ్ ప్రశ్నించారు. ‘కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునే వారికి కనీస అనుభవం ఉండాలనే షరతును పీసీబీ పెట్టింది. కానీ కనీసం క్లబ్ లెవల్లో కూడా కోచింగ్ అనుభవం లేని మిస్బావుల్‌ను ఎంపిక చేసింది. కోచ్ ఎంపిక విషయంలో పీసీబీ అవలంభించిన ద్వంద్వ వైఖరేంటో అర్థం కావడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆటగాళ్లు, సారథి నిజాయితీగా, నిస్వార్థంగా ఉండాలని మిస్బా పేర్కొన్నాడు. కానీ అతడు సారథిగా ఉన్నప్పుడు అజహర్ అలీని జట్టులోకి ఎందుకు తీసుకోలేదో చెప్పగలడా? అజహర్ అలీ మంచి బ్యాట్స్‌మన్. అయితే అతడు క్రీజులో సెటిల్ అవ్వడానికి కాస్త సమయం తీసుకుంటాడు. మిస్బా కూడా అంతే. అతడి ఆటలో ఎలాంటి ప్రత్యేక నైపుణ్యం లేదు. ఒకే రీతిలో రక్షణాత్మకంగా ఆడతాడు. స్పిన్నర్లు బౌలింగ్‌కు దిగేవరకు వేచి చూసి ఆ తర్వాత పరుగులు రాబట్టేవాడు’అని యూసఫ్ వ్యాఖ్యానించాడు. మిస్బావుల్ పాక్ తరుపున 90 టెస్టులు, 288 వన్డేలు ఆడాడు. బ్యాట్స్‌మన్‌గా మంచి రికార్డు ఉండటంతో పాటు వివాదరహితుడుగా పేరుగాంచిన మిస్బాను పాక్ జట్టు ప్రధానకోచ్, చీఫ్ సెలక్టర్‌గా పీసీబీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. చదవండి: ఐసోలేషన్ క్రికెట్ కప్.. ఐసీసీ ట్వీట్ ఇలాంటి దిగ్గజం.. తరానికి ఒక్కరు -
‘ఆ చాంపియన్‌షిప్ గడువు పెంచండి’
లాహోర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్యూటీసీ) నిర్ణీత షెడ్యూల్లో జరపడం సాధ్యం కాకపోతే దాన్ని పొడిగించి పూర్తి స్థాయిలో మ్యాచ్‌లు జరిగేలా చూడాలని పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ అజహర్ అలీ పేర్కొన్నాడు. పాకిస్తాన్ క్రికెట్ చీఫ్ సెలక్టర్ మిస్బావుల్ హక్ ఇప్పటికే ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకురాగా, దానికి అజహర్ అలీ కూడా మద్దతు తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్ గురించి ఆలోచించడం సరైనది కాదని, అయితే ఒక్కసారి సాధారణ స్ధితికి వస్తే క్రికెట్‌పై ఆసక్తి పెరుగుతుందన్నాడు. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించినా తమకు సమ్మతమేని అజహర్ స్పష్టం చేశాడు. (మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండేది కాదు..!) ‘ప్రస్తుతం ఎటువంటి స్పోర్ట్స్ ఈవెంట్ టీవీలు రావడం లేదు. మళ్లీ టీవీల్లో క్రీడా ఈవెంట్లుప్రసారమైతే ప్రజలు కచ్చితంగా సంతోషంగా ఉంటారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కాదు. ఐసీసీ నిర్వహించే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ చాలా సుదీర్ఘమైనది. దీనిపై ఐసీసీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందస్తు షెడ్యూల్‌ను పొడిగిస్తేనే మంచిది. ఒక సుదీర్ఘ షెడ్యూల్‌ను పొడిగించడం కష్టమే. కానీ తప్పదు.టెస్టు చాంపియన్‌షిప్‌ను పొడిగించడానికే నా ఓటు’ అని అజహర్ అలీ తెలిపాడు. గతేడాది ఆగస్టులో వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్ మొదలవుతుంది. ప్రస్తుత్తం టెస్ట్ క్రికెట్లో టాప్–9లో ఉన్న జట్ల మధ్య స్వదేశీ, విదేశీ సిరీస్ లతో సాగే ఈ మెగా టోర్నమెంట్ 2021 లో ముగుస్తుంది. రెండేళ్లలో 71 మ్యాచు లు, 27 సిరీస్‌లు జరుగుతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ ఆడతాయి. ఇంగ్లండ్‌లో 2021, జూన్‌లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించడానికి ఐసీసీ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. అయితే కరోనా వైరస్ ప్రభావంతో అనుకున్న సమయానికి ఈ చాంపియన్‌షిప్ పూర్తి కావడం అసాధ్యం. దాంతోనే ఆ షెడ్యూల్ గడువును పెంచాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.(బాంబులతో కాదు.. సాఫ్ట్బాల్స్ ప్రాక్టీస్ చేయండి!) -
పాకిస్తాన్‌కు ఝలక్ ఇచ్చిన బంగ్లా
ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు బంగ్లాదేశ్ చిన్న ఝలక్ ఇచ్చింది. జనవరిలో రెండు టెస్టులు, మూడు టీ20ల కోసం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాక్‌లో పర్యాటించాల్సివుంది. దీనికోసం పీసీబీ అన్ని ఏర్పాట్లను చేసింది. అయితే పాక్‌లో కేవలం టీ20లు మాత్రమే ఆడతామని, టెస్టులు తటస్థ వేదికపై ఆడతామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) తేల్చిచెప్పింది. పాక్‌లో ఎక్కువ రోజులు ఉండటానికి బంగ్లా క్రికెటర్లు విముఖత వ్యక్తం చేయడంతోనే బీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ నిర్ణయంతో కంగుతిన్న పాక్ క్రికెట్ బోర్డు బీసీబీపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదే క్రమంలో పాక్ కెప్టెన్ అజహర్ అలీ, హెడ్‌కోచ్ మిస్బావుల్ హక్‌లు కూడా బీసీబీ తీరును తప్పుపడుతున్నారు. ‘కేవలం టీ20లే ఆడతాం, టెస్టులు ఆడం అనడం అనైతికం. ప్రస్తుతం పాక్‌లో క్రికెట్ పునరజ్జీవం పోసుకోవాలంటే అది టెస్టులతోనే సాధ్యం. వీలైనన్ని ఎక్కువ టెస్టు సిరీస్‌లు నిర్వహించడంతో పాక్‌లో క్రికెట్ బతుకుతుంది. దీని కోసమే పీసీబీ అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఈ క్రమంలో టెస్టులు ఆడమని, కేవలం టీ20లో అడతామనడం సరైనదికాదు. ఈ విషయంలో బీసీబీని ఉపేక్షించేదిలేదు. టెస్టులు ఆడకపోతే బంగ్లాపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారు కోరినట్లు కేవలం టీ20లు మాత్రమే ఆడే అవకాశం ఇస్తే మిగతా దేశాలు కూడా అదే దారిలో వెళతాయి. దీంతో పాక్‌లో టెస్టు క్రికెట్ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికే శ్రీలంక టెస్టు సిరీస్ దిగ్విజయంగా ముగిసింది. లంక దారిలోనే మరిన్ని జట్లు పాక్‌లో అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తున్నాం’అంటూ మిస్బావుల్, అజహర్లు పేర్కొన్నారు. ఇక బీసీబీ నిర్ణయంతో పాకిస్తాన్‌కు మింగుడుపడటంలేదు. ఈ విషయంపై పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి కూడా స్పందించారు. బీసీబీతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పాక్‌లో బంగ్లాదేశ్ పర్యటన ఉంటుందని, టీ20లతో పాటు టెస్టులు కూడా ఆడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించబోమని మరోసారి స్పష్టం చేశారు. భద్రతాపరమైన ఎలాంటి చిక్కులు లేవని శ్రీలంక సిరీస్‌తో ప్రపంచానికి తెలిసిపోయిందని.. ఈ క్రమంలో పాక్‌లో పర్యటిచడానికి వారి సమస్యేంటో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
పీసీబీ.. పంజాబ్ క్రికెట్ బోర్డు అయ్యింది!
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు టెస్టు, టీ20 కెప్టెన్‌గా సర్ఫరాజ్ అహ్మద్‌ను తప్పించడంపై ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో ఓవరాల్‌గా జట్టు మొత్తం విఫలమైతే సర్ఫరాజ్‌ను బలి పశువును చేశారంటూ మండిపడుతున్నారు. అసలు సర్ఫరాజ్ నుంచి అజహర్ అలీకి టెస్టు పగ్గాలు అప్పచెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని మ్యాచ్‌లను చూస్తే అజహర్ అలీ పూర్తిగా విఫలమయ్యాడనే విషయాన్ని పీసీబీ పెద్దలు మరిచిపోయారా అంటూ విమర్శిస్తున్నారు. గత ఐదు మ్యాచ్‌ల్లో అజహర్ అలీ పేలవ ప్రదర్శన కనిపించలేదా అంటూ పీసీబీని ఎండగడుతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కాస్తా పంజాబ్ క్రికెట్ బోర్డు అయిపోయిందంటూ ఎద్దేవా చేస్తున్నారు. పాకిస్తాన్‌లోని పంజాబ్‌కు చెందిన మిస్బావుల్ హక్, వకార్ యూనిస్‌లు ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన అజహర్ అలీని కెప్టెన్‌గా నియమించారంటూ మండిపడుతున్నారు. (ఇక్కడ చదవండి: మిస్బా మార్క్.. సర్ఫరాజ్ కెప్టెన్సీ ఫట్!) ‘ఇదొక అవినీతి నిర్ణయం.. ఇది పంజాబ్ క్రికెట్ బోర్డు’ అని ఒకరు విమర్శించగా, ‘ అలీని ఎందుకు కెప్టెన్‌గా చేశారు.. బాబర్ అజామ్‌నే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా చేయాల్సింది’ అని మరొకరు విమర్శించారు. ఈ విషయంలో సర్ఫరాజ్ అహ్మద్‌ను బలి పశువునే చేశారు.. శ్రీలంకతో సిరీస్‌లో జట్టు ఓవరాల్‌గా విఫలమైతే సర్ఫరాజ్‌ను తీసేస్తారా’ అని మరొక అభిమాని ప్రశ్నించాడు. ‘ శ్రీలంకతో సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసినందుకు సర్ఫరాజ్‌కు ఇది కానుక’ అని మరొకరు చమత్కరించారు. ‘అజహర్ అలీ డబ్బులిచ్చి తిరిగి జట్టులోకి వచ్చాడు’ అని మరొక అభిమాని ఫైర్ అయ్యాడు. -
అజహర్, అసద్ సెంచరీలు
అబుదాబి: మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అజహర్ అలీ (134; 12 ఫోర్లు), అసద్ షఫీఖ్ (104; 14 ఫోర్లు) అద్భుత సెంచరీలతో కదం తొక్కారు. ఫలితంగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న చివరిదైన మూడో టెస్టులో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 348 పరుగులు చేసి 74 పరుగుల కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 139/3తో బుధవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాక్‌ను అజహర్, అసద్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 201 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో ఓ దశలో పాకిస్తాన్ 286/3తో పటిష్ట స్థితిలో నిలిచింది. కివీస్ బౌలర్లలో విలియమ్ సోమెర్‌విల్లె (4/75), ఎజాజ్ పటేల్ (2/100) చెలరేగడంతో పాక్ 62 పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. విలియమ్సన్ (14 బ్యాటింగ్) సోమెర్‌విల్లె (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
పరుగు తీయబోయి ఇద్దరూ పడిపోయారు!
వెల్లింగ్టన్: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ ఆటగాడు అజహర్ అలీ విచిత్రంగా రనౌటైన సంగతి తెలిసిందే. ఆసీస్ పేసర్ సిడెల్ వేసిన ఓవర్లో ఒక బంతిని అజహర్ అలీ థర్డ్ మ్యాన్ దిశగా షాట్ కొట్టాడు. అది కాస్తా బౌండరీ లైన్‌కు కాస్త దగ్గరగా వెళ్లి ఆగిపోయింది. ఇది ఫోర్‌గా భావించిన అజహర్ అలీ-అసద్ షఫిక్‌లు పిచ్ మధ్యలో ఆగిపోయి కబుర్లు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఆ బంతిని అందుకున్న స్టార్క్.. కీపర్ పైనీకి విసిరాడు. ఫలితంగా అజహర్ అలీ రనౌటై భారంగా పెవిలియన్ చేరాడు. (ఇలాంటి రనౌట్ ఎప్పుడైనా చూశారా?) ఇదిలా ఉంచితే, మరో ఫన్నీ రనౌట్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. న్యూజిలాండ్ వేదికగా జరిగే ప్లంకెట్ షీల్డ్ ట్రోఫీలో భాగంగా వెల్లింగ్టన్లో ఒటాగో-వెల్లింగ్టన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పరుగు తీసే క్రమంలో ఇద్దరు ఆటగాళ్లు జారిపడటంతో ఒకరు రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. వివరాల్లోకి వెళితే.. ఒటాగో తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 48 ఓవర్ ఐదో బంతిని రిప్పన్ ఫైన్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. అయితే తొలి పరుగును పూర్తి చేసుకున్న రిప్పన్.. రెండో పరుగు కోసం నాన్ స్ట్రైకింగ్ ఎండ్ నుంచి వచ్చే క్రమంలో జారి పడ్డాడు. ఇది గమనించని నాథన్ స్మిత్ బంతి వైపు చూస్తూ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లోకి దాదాపుగా వచ్చేశాడు. అయితే రిప్పన్ జారిపడ్డ విషయాన్ని ఒక్కసారిగా చూసిన నాథన్ స్మిత్ కూడా జారిపడిపోయాడు. ఇద్దరూ ఆటగాళ్లు ఒకే ఎండ్‌లో జారిపడి పైకి లేవడానికి ఆపసోపాలు పడుతుంటే పీకెల్ నుంచి బంతి అందుకున్న వికెట్ కీపర్ లాచీ జాన్స్ వికెట్లు గిరటేశాడు. ఫలితంగా నాథన్ రనౌట్ కావాల్సి వచ్చింది. ప్రస్తుతం హల్చల్ చేస్తున్న ఈ వీడియో క్రికెట్ ప్రేమికుల్లో నవ్వులు తెప్పిస్తోంది. ఈ మ్యాచ్‌లో వెల్లింగ్టన్ ఇన్నింగ్స్ 101 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
మరో ఫన్నీ రనౌట్
-
ఇలాంటి రనౌట్ ఎప్పుడైనా చూశారా?
అబుదాబి: క్రికెట్లో రనౌట్లు అనేవి సహజం. పరుగు తీసే క్రమంలో బ్యాట్స్‌మన్ క్రీజ్‌లోకి చేరుకోలేకపోతే రనౌట్‌గా నిష్క్రమిస్తూ ఉంటారు. అయితే స్టైకర్-నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఇద్దరు ఆటగాళ్లు పూర్తిగా రిలాక్స్ అయిపోయి పిచ్ మధ్యలో ముచ్చట్లు పెట్టే క్రమంలో రనౌట్ కావడం ఎప్పుడైనా చూశారా.. అయితే ఈ తరహా రనౌట్ తాజాగా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియా-పాకిస్తాన్ జట్ల మధ్య రెండో టెస్టు అబుదాబిలో జరుగుతోంది. గురువారం మూడో రోజు ఆటలో అజహర్ అలీ(64) విచిత్రంగా రనౌట్ అయ్యాడు. ఆసీస్ పేసర్ సిడెల్ వేసిన 53 ఓవర్ మూడో బంతిని అజహర్ అలీ థర్డ్ మ్యాన్ దిశగా షాట్ కొట్టాడు. అది కాస్తా బౌండరీ లైన్‌కు కాస్త దగ్గరగా వెళ్లి ఆగిపోయింది. ఇది ఫోర్‌గా భావించిన అజహర్ అలీ-అసద్ షఫిక్‌లు పిచ్ మధ్యలో ఆగిపోయి కబుర్లు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో ఆ బంతిని అందుకున్న స్టార్క్.. కీపర్ పైనీకి విసిరాడు. బంతిని అందుకున్న మరుక్షణమే పైనీ వికెట్లను గిరటేశాడు. దాంతో ఒక్కసారిగా షాక్ గురైన అజహర్ అలీ-అసద్ షఫిక్‌లు అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు. ఇది నిబంధనల ప్రకారం ఔట్ కావడంతో అజహర్ అలీ భారంగా పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. మరొకవైపు చిన్నపిల్లాడిలా రనౌట్‌గా పెవిలియన్ చేరడం స్టేడియంలోని అభిమానులకు నవ్వులు తెప్పించింది. -
పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ ఘనత
అబుదాబి: పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అజహర్ అలీ మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో 5 వేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు. తమ దేశం తరపున ఈ రికార్డు సాధించిన 8వ క్రికెటర్‌గా నిలిచాడు. 32 ఏళ్ల అజహర్ 61వ టెస్టులో 5 వేల పరుగులు పూర్తి చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి డే నైట్ టెస్టులో అతడు అర్థసెంచరీ చేశాడు. 200 బంతుల్లో 3 ఫోర్లతో 74 పరుగులు సాధించాడు. పాక్ తరపున వేగంగా 5 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా అతడు ఘనతకెక్కాడు. 2010లో లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్లోకి అడుగుపెట్టిన అజహర్ పాక్ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. దుబాయ్‌లో గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించి.. డే నైట్ టెస్టులో శతకం బాదిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. యూనిస్ ఖాన్(10,099), జావెద్ మియందాద్(8,832), ఇంజమామ్-వుల్-హక్(8,829), మహ్మద్ యూసఫ్(7,530) పాకిస్తాన్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించారు. కాగా, శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో 64/0 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 419 పరుగులకు ఆలౌటైంది. -
లెజెండ్స్‌కు పాక్ క్రికెటర్ ధన్యవాదాలు
పాకిస్తాన్ ఓపెనర్ అజార్ అలీ ఇండియా క్రికెటర్లపై ఒక అద్భుతమైన ట్వీట్ చేశాడు. అలీ క్రికెట్ లెజెండ్స్ అయినా ధోని, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్‌లకు తన ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలిపాడు. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ పైనల్ తర్వాత ఈ ముగ్గురితో తన కుమారులు ఫోటోలు దిగారు. తమ సమయాన్ని ఫోటోలు దిగేందుకు కేటాయించినందుకు అలీ చాలా సంతోషంగా ఉన్నాడు. తన కుమారులు సంతోషంగా ఉన్నారని అన్నారు. కొద్దిసేపటి క్రితం పోస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికే దాదాపుగా 4700 లైక్స్ కొట్టారు. ఈ ట్వీట్‌కు 2300 రిట్వీట్స్ వచ్చాయి. అలీ తన కుమారులు లెజెండ్స్‌తో దిగిన ఫోటోలను ట్వీటర్లో పెట్టాడు. -
అజహర్ అలీపై ఒక మ్యాచ్ సస్పెన్షన్
అడిలైడ్:ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణమైన పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ అజహర్ అలీపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధించారు. దాంతో పాటు అతని మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. గత 12 నెలల కాలంలో అజహర్ అలీ రెండు సార్లు స్లో ఓవర్ రేట్ కు కారణం కావడంతో అతనిపై మ్యాచ్ మ్యాచ్ సస్పెన్షన్‌తో పాటు భారీ జరిమానా పడింది. గతేడాది జనవరి 31వ తేదీన న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో అజహర్ నేతృత్వంలోని పాకిస్తాన్ ఇదే తరహాలో స్లో ఓవర్ రేట్‌ను నమోదు చేసింది. అప్పుడు అజహర్ పై 20 శాతం జరిమానాతో సరిపెట్టారు. అయితే ఏడాదిలోపు రెండు సార్లు స్లో ఓవర్ రేట్ ను నమోదు చేయడంతో ఈసారి అజహర్ ను ఒక మ్యాచ్ నుంచి సస్సెండ్ చేశారు. దాంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో వెస్టిండీస్ తో జరిగే మ్యాచ్‌లో పాల్గొనే అవకాశాన్ని అజహర్ కోల్పోనున్నాడు. -
కెప్టెన్సీ నుంచి ఉద్వాసన తప్పదా?
కరాచీ:ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఘోర ఓటమిని ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు సమాయత్తమవుతోంది. ఆసీస్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో పాకిస్తాన్ కేవలం ఒక విజయాన్ని మాత్రమే సొంతం చేసుకోవడంతో పీసీబీ దిద్దుబాటు చర్యలను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పాకిస్తాన్ వన్డే క్రికెట్ కెప్టెన్ అజహర్ అలీని ఆ పదవి నుంచి తప్పించే యోచనలో పీసీబీ పెద్దలు ఉన్నారు. దీనిలో భాగంగా లాహోర్‌లో పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్, చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ వుల్ హక్, ప్రధాన కోచ్ ముస్తాక్ అహ్మద్‌ల భేటీ అయ్యారు. ఈ భేటీలో అజహర్ అలీని తప్పించడంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మరొ క్రికెటర్ సర్పరాజ్ అహ్మద్‌కు వన్డే పగ్గాలు అప్పజెప్పేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ట్వంటీ 20 కెప్టెన్‌గా ఉన్న సర్పరాజ్‌ను వన్డే కెప్టెన్‌గా చేయాలనేది పీసీబీ పెద్దల భావనగా ఉంది. మూడు ఫార్మాట్ల క్రికెట్‌కు ఒక కెప్టెన్‌నే నియమిస్తే ఆశించిన ఫలితాలు సాధించడానికి దోహదం చేస్తుందని వారు యోచిస్తుననారు. అయితే ఇంకా టెస్టు కెప్టెన్ గా మిస్బావుల్ హక్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వన్డే కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అజహర్ అలీ నేతృత్వంలోని పాకిస్తాన్ ఆశించిన ఫలితాలు సాధించకపో్వడంతో ఆ జట్టు వన్డే ర్యాంకింగ్స్ లో పెద్దగా మార్పు రాలేదు. గతంలో అతని సారథ్యంలో తొమ్మిది ర్యాంకుకు పడిపోయిన పాకిస్తాన్.. ఆ తరువాత ఒక ర్యాంకును మాత్రమే మెరుగుపరుచుకుని ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. 2019వరల్డ్ కప్ కు పాక్ నేరుగా అర్హత సాధించాలంటే వారు ఇదే ర్యాంకును కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే అజహర్ అలీ కెప్టెన్సీలో పెద్దగా ఫలితాలు రాకపోవడంతో పీసీబీలో ఆందోళన కనిపిస్తోంది. అతని వ్యక్తిగత ప్రదర్శన బాగానే ఉన్నా, నాయకుడిగా అలీ విఫలమయ్యాడు. దీనిలో భాగంగానే వన్డే కెప్టెన్సీ మార్పుపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. 2015 వరల్డ్ ట్వంటీ 20 అనంతరం ఆ ఫార్మాట్ కెప్టెన్సీ కి షాహిద్ ఆఫ్రిది బలవంతంగా వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అజహర్ అలీని కెప్టెన్నీ తప్పిస్తే మాత్రం అది కచ్చితంగా పాక్ క్రికెట్ జట్టులో మరొక భారీ మార్పుగానే చెప్పొచ్చు. -
వార్నర్ మెరుపు సెంచరీ
ఆస్ట్రేలియా 278/2 అజహర్ అలీ డబుల్ సెంచరీ మెల్బోర్న్: డేవిడ్ వార్నర్ (143 బంతుల్లో 144; 17 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత సెంచరీతో పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా దీటైన జవాబిచ్చింది. మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 278 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాజా (95 బ్యాటింగ్; 13 ఫోర్లు) శతకానికి చేరువలో నిలిచాడు. వహాబ్ రియాజ్ బౌలింగ్‌లో 81 పరుగుల వద్ద బౌల్డ్ అయినా అది నోబాల్ కావడంతో బతికిపోయిన వార్నర్, కెరీర్లో 17వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియా మరో 165 పరుగులు వెనుకబడి ఉండగా, క్రీజ్‌లో ఖాజాతో పాటు స్మిత్ (10 బ్యాటింగ్) ఉన్నాడు. అజహర్ అలీ రికార్డుల జోరు... అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 310/6తో ఆట ప్రారంభించిన పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 443 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. చివరి వరకు అజేయంగా నిలిచిన ఓపెనర్ అజహర్ అలీ (205 నాటౌట్; 20 ఫోర్లు) డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతనికి సొహైల్ ఖాన్ (65; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు వేగంగా 19.5 ఓవర్లలోనే 118 పరుగులు జత చేయడం విశేషం. లయోన్ బౌలింగ్‌లోనే సొహైల్ నాలుగు సిక్సర్లు బాదాడు. ఇటీవలే వెస్టిండీస్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించిన అజహర్... ఒకే ఏడాది రెండుసార్లు 200కుపైగా స్కోరు చేసిన, ఆసీస్ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన తొలి పాక్ ఆటగాడిగా నిలిచాడు. మెల్బోర్న్లో ఒక విదేశీ ఓపెనర్ డబుల్ సెంచరీ చేయడం కూడా ఇదే మొదటిసారి. -
వార్నర్ మెరుపు ఇన్నింగ్స్
మెల్బోర్న్: పాకిస్తాన్‌తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ వార్నర్ వీరవిహారం చేశాడు. వార్నర్ మెరుపు శతకం (144పరుగులు: 143బంతుల్లో 17ఫోర్లు, ఒక సిక్సర్) చేయడంతో ఆసీస్ స్కోరు పరుగులు పెట్టింది. వార్నర్ టెస్ట్ కెరీర్లో ఇది 17వ సెంచరీ. ఈ క్రమంలో టెస్టుల్లో ఐదువేల పరుగులు పూర్తిచేసుకున్న 19వ ఆసీస్ ప్లేయర్ గా నిలిచాడు. మరో ఓపెనర్ రెన్షా(10) క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బందులు పడి చివరికి తక్కువ స్కోరుకే ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వన్ డౌన్ బ్యాట్స్ మన్ ఉస్మాన్ ఖవాజా హాఫ్ సెంచరీ(73నాటౌట్: 122 బంతుల్లో 10 ఫోర్లు)తో కలిసి వార్నర్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు స్కోరును మరింత పెంచే క్రమంలో ఇన్నింగ్స్ స్కోరు 244 వద్ద వహాబ్ రియాజ్ బౌలింగ్ లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. 50 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. కాగా, పాక్ తమ తొలి ఇన్నింగ్స్ ను 443/9 వద్ద డిక్లేర్ చేసింది. అంతకుముందు పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ అజహర్ అలీ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. అజహర్ అలీ అద్భుత ఇన్నింగ్స్ (205 నాటౌట్: 364 బంతుల్లో 20 ఫోర్లు ) తో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఒకే ఏడాది రెండు డబుల్ సెంచరీలు చేసిన తొలి పాక్ క్రికెటర్ గానూ రికార్డు నెలకొల్పాడు. మెల్బోర్న్ స్డేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో ప్లేయర్ గా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 1984లో వెస్డిండీస్ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ చేసిన 208 పరుగులే ఇక్కడ అత్యధికం. సోహైల్ ఖాన్(65 బంతుల్లో 65: 6 ఫోర్లు, 4 సిక్సర్లు)తో కలిసి ఎనిమిదో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్‌ను 443/9 వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో బర్డ్, హాజెల్‌వుడ్‌కు చెరో మూడు వికెట్లు దక్కాయి. -
అజహర్ అలీ రికార్డు డబుల్ సెంచరీ
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ అజహర్ అలీ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. అజహర్ అలీ అద్భుత ఇన్నింగ్స్ (205 నాటౌట్: 364 బంతుల్లో 20 ఫోర్లు ) తో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఒకే ఏడాది రెండు డబుల్ సెంచరీలు చేసిన తొలి పాక్ క్రికెటర్ గానూ రికార్డు నెలకొల్పాడు. మెల్బోర్న్ స్డేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో ప్లేయర్ గా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 1984లో వెస్డిండీస్ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ చేసిన 208 పరుగులే ఇక్కడ అత్యధికం. కాగా, పాక్ జట్టు నుంచి ఈ స్డేడియంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు అజహర్ దే. గతంలో పాక్ ఆటగాడు మాజిద్ ఖాన్ 158 పరుగులను ఈ ఇన్నింగ్స్ లో అజహర్ అలీ అధిగమించాడు. 139 ఓవర్ నైట్ స్కోరుతో ఉన్న అజహర్ అలీ వేగంగా ఆడి పరుగులు సాధించాడు. సోహైల్ ఖాన్(65 బంతుల్లో 65: 6 ఫోర్లు, 4 సిక్సర్లు)తో కలిసి ఎనిమిదో వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే సోహైల్ రనౌట్ కావడం, ఆ వెంటనే రియాజ్‌ను హాజెల్‌వుడ్ ను ఔట్ చేశాడు. దీంతో పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్‌ను 443/9 వద్ద డిక్లేర్ చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో అజహర్ అలీ డబుల్ సెంచరీ చేయగా, సోహైల్ ఖాన్, అసద్ షఫీఖ్ హాఫ్ సెంచరీ (50) చేశారు. బర్డ్, హాజెల్‌వుడ్‌కు చెరో మూడు వికెట్లు దక్కాయి. స్టార్క్, స్పిన్నర్ లియాన్ లకు ఒక వికెట్ పడగొట్టారు.