Deloitte
-
స్పోర్ట్స్ టెక్నాలజీ మార్కెట్ @ రూ. 49,500 కోట్లు
న్యూఢిల్లీ: దేశీయంగా స్పోర్ట్స్ టెక్నాలజీ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. వచ్చే నాలుగేళ్లలో 85 శాతం వృద్ధి చెందనుంది. 2029 నాటికి రూ. 49,500 కోట్లకు చేరనుంది. ఫ్యాంటసీ గేమ్స్ సంస్థ ఎఫ్ఐఎఫ్ఎస్, డెలాయిట్ విడుదల చేసిన సంయుక్త నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ స్పోర్ట్స్–టెక్ మార్కెట్ రూ. 26,700 కోట్ల స్థాయిలో ఉంది. యాప్‌లు, డివైజ్‌లు, సెన్సార్లు మొదలైనవి స్పోర్ట్స్ టెక్ కేటగిరీలోకి వస్తాయి. డిజిటల్ టెక్నాలజీల రాకతో క్రీడాకారులు పనితీరును మెరుగుపర్చుకునేందుకు అవసరమైన డేటాను అందించడంతో పాటు అభిమానులు కూడా క్రీడలను ఆస్వాదించేందుకు మరింత మెరుగైన అనుభూతిని అందించేందుకు వీలవుతోందని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ప్రశాంత్ రావు తెలిపారు. దీంతో కొత్త వ్యాపార అవకాశాలు తెరపైకి వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిణామక్రమానికి ఫ్యాంటసీ స్పోర్ట్స్ సారథ్యం వహించగలదని ఆయన చెప్పారు. గణనీయంగా ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఆర్థికంగా సానుకూల ప్రభావాలు కూడా చూపిస్తోందని వివరించారు. 2029 ఆర్థిక సంవత్సరం వరకు పరిశ్రమ ఏటా 7 శాతం మేర వృద్ధి చెందుతుందని, 2027 ఆర్థిక సంవత్సరం నాటికి 17,500 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను కల్పిస్తుందని ప్రశాంత్ రావు తెలిపారు. ఇటు క్రీడాకారులు, అటు అభిమానులకు మరో స్థాయిలో స్పోర్ట్స్ అనుభూతిని టెక్నాలజీ అందించగలదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్ఐఎఫ్ఎస్) డైరెక్టర్ జనరల్ జాయ్ భట్టాచార్య తెలిపారు. ఫ్యాంటసీ స్పోర్ట్స్‌పై జీఎస్టీ ఎఫెక్ట్..ఫ్యాంటసీ స్పోర్ట్స్ విభాగంపై గ్యాంబ్లింగ్ ట్యాక్స్ రేట్ల స్థాయిలో 28 శాతం జీఎస్టీ విధించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం 10 శాతం మేర క్షీణించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. జీఎస్టీ దెబ్బతో ఫ్యాంటసీ స్పోర్ట్స్ కంపెనీల మార్జిన్లపై 50 శాతం మేర ప్రతికూల ప్రభావం పడుతోందని వివరించింది. జీఎస్టీ నిబంధనతో 2023లో ఈ విభాగంపై పెట్టుబడులు 90 శాతం పడిపోయాయని, 2024లో కొత్తగా పెట్టుబడులు రాలేదని నివేదిక పేర్కొంది. -
6.8 శాతం వరకూ భారత్ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024 ఏప్రిల్– 2025 మార్చి) 6.5 నుంచి 6.8 శాతం శ్రేణిలో వృద్ధి చెందుతుందని ఆర్థిక సేవల దిగ్గజం– డెలాయిట్ అంచనావేసింది. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.7–7.3 శాతం శ్రేణిలో నమోదవుతుందని అంచనావేసింది. దేశీయ వినియోగం, డిమాండ్ ఎకానమీ పురోగతికి దోహదపడే ప్రధాన అంశాలని వివరించింది. ఈ నెల ప్రారంభంలో భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) 2024– 2025 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాను 7.2 శాతం నుండి 6.6 శాతానికి తగ్గించిన నేపథ్యంలో తాజా డెలాయిట్ నివేదిక వెలువడింది. ఎకానమీ పటిష్టమే.. 2024–25 ఆర్థిక సంవత్సరపు మొదటి అర్ధభాగంలో వృద్ధి రేట్లు అంచనాలకు తగ్గట్టుగా లేవని డెలాయిట్ ఇండియా ఆర్థిక శాస్త్రవేత్త రుమ్కీ మజుందార్ పేర్కొన్నారు. (క్యూ1, క్యూ2ల్లో వరుసగా 6.7 శాతం, 5.4 శాతం వృద్ధి) ఎన్నికల అనిశ్చితి, భారీ వర్షపాతం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు డిమాండ్– ఎగుమతులపై ప్రభావం చూపినట్లు ఆయన విశ్లేషించారు. అయితే, వినియోగ ధోరణులు, సేవల వృద్ధి, ఎగుమతుల్లో తయారీ రంగం వాటా పెరగడం, పెట్టుబడులకు సంబంధించి మూలధన మార్కెట్ల స్థిరత్వం వంటి కొన్ని ముఖ్య అంశాల్లో భారత్ ఇప్పటికీ పటిష్టంగా ఉందని అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటైజేషన్, విదేశీ సంస్థాగత పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణపై నిరంతరం దృష్టి సారించడం వంటి ప్రభుత్వ చొరవలు వృద్ధిని మరింత పెంచే అంశాలుగా ఉంటాయని మజుందార్ చెప్పారు. తాయా ఆయా అంశాలపై పూర్తి ఆశావాదంతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → తయారీకి సంబంధించి ఎల్రక్టానిక్స్, సెమీ కండక్టర్లు, రసాయనాల వంటి రంగాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రపంచ సరఫరాల చైన్‌లో భారత్ స్థానాన్ని పటిష్టపరిచే పరిణామిది. → గత రెండున్నర నెలలుగా విదేశీ పెట్టుబడిదారులు వెనక్కివెళ్లినప్పటికీ, రిటైల్ దేశీయ సంస్థల పెట్టుబడుల వల్ల మూలధన మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. → 2025 అంతటా డిమాండ్ బాగుంటుందని అంచనా. గ్రామీణ, పట్టణ డిమాండ్ రెండూ కీలక పాత్ర పోషించనున్నాయి. వ్యవసాయ ఆదాయాలు, సబ్సిడీల వినియోగం, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ఉపాధి ప్రోత్సాహాలు, డిజిటైజేషన్ అభివృద్ధి, సేవల రంగం వృద్ధి వంటి అంశాలు వినియోగాన్ని విస్తరించడంలో సహాయపడతాయి. → భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ సవాళ్లను అధిగమించి వృద్ధిని కొనసాగించాల్సి ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు, వాణిజ్య వివాదాలు, సరఫరా వయవస్థల్లో అంతరాయం, వాతావరణ మార్పుల ప్రభావం దీర్ఘకాల ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చసే అవకాశం ఉంది. → భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ అనిశ్చితుల నుండి దూరంగా ఎలా ఉంచాలన్న అంశంపై దృష్టి సారించాలి. అధిక సంఖ్యలో ఉన్న యువ శక్తి వినియోగం, నైపుణ్యల మెరుగు, మౌలిక సదుపాయాలను బలపరచడం వంటి అంశాలు వృద్ధికి దోహదపడతాయి. → సవాళ్లను అధిగమిస్తూ, స్వయం సమృద్ధి కలిగిన తయారీ రంగం పటిష్టతపై దృష్టి సారించాలి. గ్లోబల్ వ్యాల్యూ చైన్ సెగ్మెంట్లను లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా భారత్ కొత్త అవకాశాలను సృష్టించుకునే అవకాశాలు ఉన్నాయి. → భవిష్యత్ పురోగతికి సంబంధించి వ్యూహాత్మక పెట్టుబడులు, విధాన చర్యలు ప్రకటించే అవకాశాలు ఉన్న రాబోయే బడ్జెట్‌పై (2025–26) ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. -
ఆడిట్లో లోపాలు.. రూ.2 కోట్ల జరిమానా
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) ఆడిట్లో లోపాలు జరిగినట్లు నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (NFRA) గుర్తించింది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆడిట్లో లోపాలకు కారణమైన డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్పీకి రూ.2 కోట్ల జరిమానా విధించింది. ఈ ఆడిట్లో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్లపై చర్యలు తీసుకుంది.2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ఆడిట్ పనులను డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్పీకి అప్పగించింది. సుమారు రూ.200 కోట్ల ఆడిట్(audit)లో అవకతవకలు జరిగినట్లు ఎన్ఎఫ్ఆర్ఏ గుర్తించింది. దాంతో డెలాయిట్ హాస్కిన్స్కు రూ.2 కోట్ల జరిమానా విధించింది. కంపెనీ అనధికార లావాదేవీలను గుర్తించడం, వాటిని నివేదించడంలో ఆడిట్ సంస్థ విఫలమైందని ఎన్ఎఫ్ఆర్ఏ తెలిపింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన సీఏలు ఏబీ జానీను రూ.10 లక్షలు జరిమానా(fine)తోసహా ఐదేళ్ల పాటు ఆడిట్ పనుల నుంచి నిషేధించగా, రాకేశ్ శర్మకు రూ.5 లక్షల జరిమానాతోపాటు మూడేళ్లు నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.ఇదీ చదవండి: కిరాణా దుకాణాలకు టెక్నాలజీ ప్లాట్ఫామ్డెలాయిట్ హాస్కిన్స్ & సెల్స్ ఎల్ఎల్పీ అనేది ఎకనామిక్ వ్యవహారాలు నిర్వహిస్తున్న ప్రొఫెషనల్ సేవల సంస్థ. ఇది ఆడిట్, కన్సల్టింగ్, ఫైనాన్షియల్ అడ్వైజరీ, రిస్క్ అడ్వైజరీ, టాక్స్ సేవలతో సహా విస్తృత శ్రేణి సేవలను అందిస్తోంది. ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ సర్వీసులు అందిస్తోంది. -
ఏఐకి సవాళ్లు.. హ్యాకింగ్ రిస్కులు!
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ(ఏఐ) గణనీయంగా ప్రాచుర్యంలోకి వస్తున్నప్పటికీ దీన్ని వినియోగించుకోవడంలో కంపెనీలు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. హ్యాకింగ్, సైబర్ దాడులు వంటి రిస్కులే ఏఐ వినియోగానికి అతి పెద్ద సవాళ్లుగా ఉంటున్నాయని ఒక సర్వేలో 92% మంది భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రైవసీ రిస్కులు కారణమని 91% మంది, నియంత్రణపరమైన అనిశ్చితి కారణమని 89% మంది తెలిపారు. డెలాయిట్ ఏషియా పసిఫిక్ రూపొందించిన ‘ఏఐ ఎట్ క్రాస్‌రోడ్స్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడి అయ్యాయి.ఇదీ చదవండి: ఆన్లైన్లో బుక్ చేస్తే ఇంటికి ఆటో స్పేర్పార్ట్స్ఏఐ సంబంధ రిస్కులను ఎదుర్కొనడంలో తమ సంస్థలకు తగినంత స్థాయిలో వనరులు లేవని 50 శాతం మంది పైగా టెక్ వర్కర్లు తెలిపారు.గవర్నెన్స్‌పరంగా పటిష్టమైన విధానాలను పాటించడం, నిరంతరం కొత్త సాంకేతికతల్లో శిక్షణ పొందాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోందని డెలాయిట్ వివరించింది.ఏఐ వినియోగంపై కంపెనీలకు ఆశావహ భావం కూడా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.నైతిక విలువలతో ఏఐను వినియోగించేందుకు 60% మంది ఉద్యోగులకు నైపుణ్యాలు ఉన్నాయని తెలిపింది.ఉద్యోగాల్లో నైపుణ్యాలపరంగా ఉన్న అంతరాలను తొలగించేందుకు 72% సంస్థలు క్రియాశీలకంగా పని చేస్తున్నాయని నివేదిక వివరించింది.విభిన్న రంగాల్లో సేవలందిస్తున్న టెక్ కంపెనీలకు సంబంధించిన 900 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఈ సర్వేలో పాల్గొన్నారు. -
భారత్ 7 శాతం వృద్ధి సాధిస్తుంది: డెలాయిట్ సీఈఓ
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. భారత్ మాత్రం వృద్ధి సాధిస్తుందని డెలాయిట్ దక్షిణాసియా సీఈఓ 'రోమల్ శెట్టి' (Romal Shetty) అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం సహేతుకంగా నియంత్రణలో ఉంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్దితో ఇది మరింత ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వాహన విక్రయాలు మెరుగుపడుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్ధిక వృద్ధి 7 నుంచి 7.1 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ రాజకీయ పరిణామాలు, ఉక్రెయిన్‌లో ఏర్పడ్డ సంక్షోభం వంటివి చాలా దేశాల జీడీపీ వృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి. కానీ వాస్తవం ఏమిటంటే, ఇప్పటికే భారతదేశం మెరుగైన స్థితిలో ఉందని శెట్టి పేర్కొన్నారు.డెలాయిట్ అంచనాల ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత్ వృద్ధి 6.7 శాతంగా ఉండవచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందింది. మోదీ 3.0 ప్రభుత్వం ఇదే వేగంతో కొనసాగాలని తాను ఆశిస్తున్నానని, ప్రభుత్వ శాఖలలో పనులు కూడా ఎప్పటికప్పుడు పూర్తవ్వాలని రోమల్ అన్నారు.ఇదీ చదవండి: పెట్టుబడులకు కేంద్రంగా భారత్: పీయూష్ గోయల్భారతదేశం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. చమురు ధరల క్షీణత భారతదేశానికి ఒక కోణంలో మంచిది. యూఎస్ ఫెడ్ రేటు తగ్గింపు కూడా భారతదేశానికి సానుకూలంగా ఉంటుంది. తలసరి ఆదాయం ఒక నిర్దిష్ట స్థాయి కంటే పెరిగితే, ఆర్థిక వ్యవస్థ కూడా అక్కడ నుండి వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. -
Deloitte: గృహ వినియోగ మార్కెట్ 19.67 లక్షల కోట్లు
ముంబై: భారత్‌లో ఇళ్లు, గృహ వినియోగ మార్కెట్ (హోమ్, హౌస్‌హోల్డ్) 2030 నాటికి 237 బిలియన్ డాలర్లకు (రూ.19.67 లక్షల కోట్లు) చేరుకుంటుందని డెలాయిట్ అంచనా వేసింది. ఏటా 10 శాతం కాంపౌండెడ్ వృద్ధి రేటు కొనసాగుతుందంటూ.. ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, వినియోగదారుల ప్రాధాన్యతల్లో మార్పులు, వివిధ ఉత్పత్తుల పరంగా సౌకర్యం, సౌలభ్యానికి ప్రాధాన్యం ఇస్తుండడాన్ని సానుకూలతలుగా తన నివేదికలో ప్రస్తావించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు వృద్ధి కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు తెలిపింది. ఓమ్నిచానల్ రిటైల్, ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులతో అనుసంధానానికి సాయపడుతున్నాయని, పట్టణాలకు వెలుపలి ప్రాంతాలకు ఇవి చేరుకుంటున్నాయని పేర్కొంది. గృహస్థుల ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, అదే సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వస్తుండడం, సులభంగా రుణాలు లభిస్తుండడం, యువ కస్టమర్లు ఆధునిక డిజైన్లు, గృహ నవీకరణ, వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తుండడం ఈ మార్కెట్ వృద్ధికి చోదకాలుగా తెలిపింది. హౌస్‌హోల్డ్ (ఇంట్లో వినియోగించే ఉపకరణాలు) మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోందని డెలాయిట్ నివేదిక తెలిపింది. విక్రయానంతర సేవలు, వారంటీపై వ్యాపార సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ వినియోగదారులు ప్రీమియం, బ్రాండెడ్ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు, కంపెనీలు ఈ–చానళ్ల రూపంలో కస్టమర్లకు ముందుగా చేరువ అవుతున్నట్టు డెలాయిట్ నివేదిక తెలిపింది. వినియోగదారులకు మెరుగైన అనుభవం, డిజైన్ ఆధారిత ఉత్పత్తుల ఆవిష్కరణపై కంపెనీలు ఎక్కువగా దృష్టి సారించినట్టు డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఆనంద్ రామనాథన్ చెప్పారు. సోషల్ మీడియా, అత్యాధునిక సాంకేతికతల సాయంతో కంపెనీలు తమ కస్టమర్లను లక్ష్యంగా చేసుకోగలుగుతున్నట్టు డెలాయిట్ నివేదిక వివరించింది. ఇంధన ఆదా గృహోపకరణాలకు, పర్యావరణ అనుకూల కిచెన్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండడంతో కంపెనీలు నీటిని ఆదా చేసే బాత్రూమ్ ఫిట్టింగ్‌లు, ఇంధన ఆధా టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచుతున్నాయని వెల్లడించింది. పీఎల్ఐ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉజాల, ఎస్ఎంసీ, పీఎం మిత్ర పథకాల మద్దతుతో డిమాండ్ పెరుగుతుండడం, హౌస్‌హోల్డ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు వివరించింది. -
జాబ్ అంటే చావేనా? ఊపిరి తీస్తున్న ఉద్యోగాలు!
కార్పొరేట్ రంగంలో పని సంస్కృతి రానురాను విషపూరితంగా మారుతోంది. తీవ్రమైన పని ఒత్తిడితో ఉద్యోగులు సతమతవుతున్నారు. రోజూ నిద్రాహారాలు లేకుండా 15 గంటలకు పైగా సుదీర్ఘంగా పని చేయాల్సి ఉండటంతో శారీరక, మానసిక అనారోగ్యాలకు గురవుతున్నారు. ఒత్తిడి తాళలేక కొంత మంది తనువులు చాలిస్తున్నారు."పని ఒత్తిడి" కారణంగా ఎర్నెస్ట్ & యంగ్ (EY) కన్సల్టెంట్ 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డెలాయిట్ మాజీ ఉద్యోగి దేశంలోని కార్పొరేట్ రంగంలో విషపూరితమైన పని సంస్కృతికి సంబంధించిన తన సొంత అనుభవాన్ని పంచుకోవడానికి ముందుకు వచ్చారు. ఇండోర్‌కు చెందిన జయేష్ జైన్ తన స్వానుభవాన్ని ‘ఎక్స్’(ట్విటర్)లో వివరించారు."అన్నా ఎంత ఒత్తిడి అనుభవించిందో పూర్తిగా అర్థం చేసుకోగలను" అంటూ తాను డెలాయిట్‌లో అనుభవించిన తీవ్రమైన ఒత్తిడిని వివరించారు. వేకువజామున 5 గంటల సమయంలో వర్క్ గురించి, తద్వారా తలెత్తిన ఆరోగ్య సమస్యల గురించి సహచరులతో చర్చించిన చాట్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేశారు.రోజులో దాదాపు 20 గంటలు పని చేసేవాళ్లమని, అయితే అన్నేసి గంటలు పనిచేసినా కూడా 15 గంటలకు మించి పని చేసినట్టుగా లాగిన్‌లో చూపేందుకు వీలుండేది కాదని రాసుకొచ్చారు. "ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు వారికి (కంపెనీలకు) ఒక ఉద్యోగి మాత్రమే. కానీ మీ కుటుంబానికి మీరే సర్వస్వం" అంటూ ఒత్తిడి గురయ్యే ఉద్యోగులను ఉద్దేశించి హితవు పలికారు. "కార్పొరేట్ జీవితమంటేనే కఠినం. తొందరగానే అక్కడి నుండి బయటపడగలిగినందుకు సంతోషిస్తున్నాను" పోస్ట్‌ను ముగించారు.With EY case getting some lights. I would like to share my personal experience at Deloitte. Attaching some screenshots of chats with my team mate - friend where we were discussing the work and our health at 5AM in the morning. We use to work for around 20 hours and they won’t… pic.twitter.com/EjtqWjhwSm— Jayesh Jain (@arey_jainsaab) September 18, 2024 -
కాలేజ్‌కి కూడా వెళ్లలేదు..కానీ ఏడాదికి ఏకంగా రూ. 10 కోట్లు..!
ఓ వ్యక్తి కాలేజ్ చదువు కూడా చదవకుండా కోట్లు గడిస్తున్నాడంటే నమ్ముతారా..!. ఏ వ్యాపారం చేసో అనుకుంటే పొరబడ్డట్లే. ఎందుకంటే..అతడు చక్కగా పెద్ద కార్పోరేట్ కంపెనీలో అప్రెంటీస్‌గా మొదలు పెట్టి..ఏకంగా కంపెనీ పార్ట్నర్గా పనిచేసే స్థాయికి చేరకున్నాడు. ఎలాంటి గ్రాడ్యుయేషన్ చదువులు చదవకుండా.. ఎలా అతడికి సాధ్యం అయ్యింది? అతడి సక్సెస్ సీక్రెట్ ఏంటంటే.. యూకేకి చెందిన న్యూటన్(30) యూవివర్సిటి విద్య కూడా చదవలేదు. కానీ డెలాయిట్ కంపెనీలో పార్టనర్‌గా పనిచేస్తున్నాడు. అతడి వార్షిక వేతనం సుమారుగా రూ. 10 కోట్లు పైనే ఉంటుందట. ఇదంతా ఎలా సాధ్యం అనే కదా..!. అతడి కెరీర్ జర్నీ 12 ఏళ్ల క్రితం డెలాయిట్ కంపెనీలో బ్రైట్‌స్టార్ట్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌లో చేరడంతో మొదలయ్యింది. అలా కంపెనీ పార్ట్నర్గా పనిచేసే స్తాయికి ఎదిగిపోయాడు. అది కాలేజ్డ్రాపౌట్స్ కోసం ఏర్పాటు చేసిన డెలాయిట్ బ్రైట్ స్టార్ అప్రెంటీస్ ప్రోగ్రామ్ అతడి తలరాతనే మార్చిందని చెప్పొచ్చు. నూటన్ పెరిగిందంతా డోరెట్స్లోనే. తన తండ్రి 16 ఏళ్ల వయసులో పాఠశాల చదువును విడిచిపెట్టి ఆర్మీలో చేరిపోయాడు. తన అమ్మ పబ్‌లోనూ, ట్రావెలింగ్ ఏజెన్సీలోనూ పనిచేసేది. దీంతో తల్లిదండ్రుల ప్రంపంచానికి దూరంగా పెరిగాడు న్యూటన్. ఆర్థిక పరిస్థితి వల్లే కదా తాను ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది అని భావించి సంపాదన మార్గాల గురించి తీవ్రంగా అన్వేషించడం ప్రారంభించేవాడు. తీరిక దొరికితే అందుకోసమే వెతికేవాడు. ఐతే అనుకోకుండా విశ్వవిధ్యాలయంలో గణితం అధ్యయనం చేసేందుకు సీటు లభించింది. ఇలా అతడి కుటుంబంలో విశ్వవిద్యాలయంలో సీటు పొందిన ఏకైక వ్యక్తి కూడా న్యూటనే. కానీ అందులో చేరలేదు. సంపాదన మార్గాల మీదే అతడి ధ్యాసంతా. అందుకోసం రెండు మూడు చిన్నా చితకా ఉద్యోగాలు కూడా చేసేవాడు. అంతేగాదు స్కూల్ చదువుతో డబ్బులు వచ్చే స్కీములు ఏం ఉన్నాయా అని చూసేవాడు. ఆ కారణాల రీత్యా అతడు చదువాలనే దానిపై దృష్టి కేంద్రీకరించ లేదు. ఆ అన్వేషణలో భాగంగానే న్యూటన్ డెలాయిట్ బ్రైట్‌స్టార్ట్ అప్రెంటిస్ ప్రోగ్రామ్‌లో చేరాడు. ఐతే ఇది విద్యార్థులు కళాశాలలో చేరి చదువుకునేలా చేసేందుకు ఏర్పాటు చేసిన ఉపాది మార్గం ఇది. దీన్ని కాలేజ్ యూనివర్సిటీలే ఏర్పాటు చేశాయి. అయితే ఇదంతా న్యూటన్‌కి నచ్చక ఒకింత అసహనం అనిపించినా, డబ్బు సంపాదించే మార్గం దొరికిందన్న ఉద్దేశ్యంతో అందులో జాయిన్ అయ్యాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ కంపెనీ పార్ట్నర్గా క్వాలిఫైడ్ అకౌంటెంట్ అండ్ ఆడిటర్‌గా విధులు నిర్వర్తించే రేంజ్‌కి చేరాడు. నిజానికి డెలాయిట్ కంపెనీ రిక్రూట్మెంట్ కోసం ఈ బ్రైట్‌స్టార్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా విద్యార్థుల ఉపాది పొందుతూ కాలేజ్ చదువును చదువుకునేలా ప్రోత్సహిస్తుంది. అంతేగాక ఈ ప్రోగ్రాం ద్వారా వారిలో దాగున్న టాంటెంట్ బయటకి వెలికితీస్తుంది. పైగా సామాజికంగా ఆర్థిక నేపథ్యం సరిగా లేని వ్యక్తులకు ఈ ప్రోగ్రాం ఒక గొప్ప వరం. అంతేగాదు కెరీర్లో మంచిగా సెటిల్ అవడానికి ఉపకరించే గొప్ప ఉపాధి మార్గం ఇది. ఇక్కడ న్యూటన్ సంపాదన ధ్యాస కళాశాలకు వెళ్లనీయకుండా చేసినా..ఉద్యోగంలో ఉన్నతంగా ఎదిగేలా చేసి ఈ స్థాయికి తీసుకురావడం విశేషం. ఇక్కడ డిగ్రీలు, పీహెచ్‌డీలు కాదు ముఖ్యం. సంపాదించాలనే కసి పట్టుదల అన్ని నేర్చుకునేలా, ఎదిగిలే చేస్తుందనడానికి న్యూటనే స్ఫూర్తి కదూ..!. (చదవండి: ఆర్బీఐ మాజీ గవర్నర్‌కే పాఠాలు బోధించిన వ్యక్తి..కోట్ల ఆస్తులను..!) -
5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భావం ఖాయం
న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు, అదనపు సంస్కరణలు, మెరుగైన సాంకేతికతను అవలంభించడం వంటి చర్యలకు కేంద్రం సంపూర్ణ మద్దతును అందిస్తుందని భారత్ కార్పొరేట్ విశ్వసిస్తోంది. ఈ దన్నుతో భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించగలమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. డెలాయిట్ టచ్ తోహ్మత్సు ఇండియా ఎల్ఎల్పీ నిర్వహించిన సీఎక్స్‌వో సర్వేలో వెల్లడైన కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►వచ్చే ఆర్థిక సంవత్సరంలో బలమైన ఆర్థిక వృద్ధిని భారత్ నమోదు చేస్తుందని వ్యాపార ప్రముఖులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతంకన్నా ఎక్కువగా వృద్ధి రేటు నమోదవుతుందని 50 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. తద్వారా ఎకానమీపై పూర్తి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ►అధిక రేటును అంచనా వేస్తున్న పారిశ్రామిక రంగాలలో ఆటోమోటివ్ (50 శాతం), వినియోగం, రిటైల్ (66 శాతం), సాంకేతికత, మీడియా, టెలికమ్యూనికేషన్ (47 శాతం) శక్తి, సంబంధిత వనరులు (44 శాతం) ఉన్నాయి. ►ప్రభుత్వ కార్యక్రమాలు, పెరిగిన వాణిజ్య భాగస్వామ్యాలు, లాజిస్టిక్స్ వ్యయాల తగ్గింపు, పారిశ్రామిక ఉత్పత్తిని పెంచే విధానాలు (తయారీలో తెలివైన ఆటోమేషన్, స్థిరమైన సాంకేతిక పరిజ్ఞానాల వైపు పెట్టుబడిని పెంచడం వంటివి) వృద్ధి ఊపును మరింత పెంచుతాయి. వినియోగదారుల ప్రాధాన్యతలను మారడం, బలమైన డిమాండ్, పట్టణీకరణ వృద్ధికి దోహదపడే ఇతర అంశాలు. ►ఆవిష్కరణలు, పరిశోధనలకు గ్లోబల్ హబ్‌గా భారతదేశం తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఉత్పాదక రంగం, సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధి, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతు అవసరం. సెమీకండక్టర్ పరిశ్రమలో గణనీయమైన వృద్ధిని అంచనా వేస్తున్నందున పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం నుండి సమగ్రమైన, దీర్ఘకాలిక పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను పారిశ్రామిక వర్గాలు ఆశిస్తున్నాయి. ►స్థానిక కంపెనీలకు పరిశోధనా, అభివృద్ధి రంగాల్లో మద్దతు అవసరమని సర్వేలో పాల్గొన్న 64 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. 57 శాతం మంది పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించడానికి సమర్థవంతమైన మేధో సంపత్తి హక్కుల ఫ్రేమ్‌వర్క్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఇటువంటి వ్యూహాత్మక చర్యలు భారతదేశానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తాయని పేర్కొన్నారు. హై–టెక్నాలజీ తయారీ రంగాలలో పోటీతత్వాన్ని పెంచుతాయని అభిప్రాయపడ్డారు. ►ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధునిక వ్యాపారానికి ఆధారం అయ్యిందని, వృద్ధికి అసాధారణ అవకాశాలను అందిస్తోందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. దాదాపు 99 శాతం మంది ఏఐ మరింత పురోగతిని ఆకాంక్షిస్తున్నారు. కాగా, 70 శాతం వినియోగ, రిటైల్ వ్యాపారాలు ఏఐ వినియోగాన్ని నియంత్రించడానికి ప్రభుత్వ మద్దతును కోరుతున్నారు. డేటా అంశాల్లో నైతిక విధానాలను ఖచ్చితంగా పాటించాలని నొక్కి చెబుతున్నారు. ►4.0 సాంకేతికతలను (ఏఐ, ఎంఎల్, ఎన్ఎల్పీ, కంప్యూటర్ విజన్) అమలు చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని పరిశ్రమ పెద్దలు అంచనా వేస్తున్నారు, దానితో పాటు మరిన్ని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో నిరంతర ప్రయత్నాలతో పాటు, ముఖ్యంగా టైర్–2, 3 నగరాల్లో మానవ, సాంకేతిక నైపుణ్యాన్ని పెంచడం అవసరమని అభిప్రాయపడుతున్నారు. ►భారతదేశ వృద్ధిని ప్రోత్సహించడానికి, స్థిరమైన వ్యాపార విస్తరణకు, దేశంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి పన్ను ఖచ్చితత్వం అవసరమని 80 శాతం మంది పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. ►భౌగోళిక ఉద్రిక్తతల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో భాగంగా, జీ 20 దేశాలు సమన్వయంతో పనిచేయాలని, సరఫరాల చైన్‌ను క్రమబద్దీకరించాలని పారిశ్రామికవేత్తలు ఉద్ఘాటించారు. ►పునరుత్పాదక శక్తి ప్రాముఖ్యతను 100 శాతం మంది ఉద్ఘాటించారు. సాంకేతిక ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యం పెంపుదల, పర్యావరణ– సామాజిక–కార్పొరేట్ గవర్నెన్స్ (ఈఎస్జీ)వ్యూహాలు, కార్యక్రమాలలో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కార్పొరేట్ భావిస్తోంది. డిజిటలైజేషన్ సాధికారతకు ప్రాధాన్యత సవాళ్లు, అవకాశాలకు సంబంధించి సర్వేలో వ్యక్తమైన అభిప్రాయాలను మేము పరిశీలించినప్పుడు, దేశం డిజిటలైజన్ సాధికారతను సాధించాల్సిన అవశ్యత ఎంతో ఉందన్న విషయం స్పష్టమైంది. ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించే బాటలో ఆవిష్కరణలు, భాగస్వామ్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి, తద్వారా ప్రపంచ వేదికపై భారత్ చెరగని ముద్ర వేయడానికి సంయుక్తగా, వ్యూహాత్మకంగా, సాంకేతికంగా తగిన చర్యలకు మేము సిద్ధంగా ఉన్నాము. – సంజయ్ కుమార్, డెలాయిట్ ఇండియా ప్రస్తుతం ఐదవ స్థానంలో.. 1980–81లో భారత్ ఎకానమీ పరిమాణం 189 బిలియన్ డాలర్లు. దశాబ్దకాలం గడిచే సరికి ఈ విలువ 326 బిలియన్ డాలర్లకు చేరింది. 2000–01 నాటికి 476 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2010–11 నాటికి ఈ విలువ 1.71 ట్రిలియన్ డాలర్లకు చేరగా, 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2.67 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారింది. 2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఈ విలువ 3.75 ట్రిలియన్ డాలర్లు. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98, 374) అంచనా. 2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. భారత్ 2047 నాటికి (స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు) 30 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తోంది. ఈ విజన్ డాక్యుమెంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. విజన్ డాక్యుమెంట్– 2047 భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవసరమైన సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులను సంస్కరణలను నిర్దేశించనుంది. దిగువ మధ్య ఆదాయ స్థితి నుంచి దేశ పురో గతి విజన్ 2047 ప్రధానంగా నిర్దేశించుకుంది. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాజీ సీఈవోకు డెలాయిట్‌లో కీలక పదవి
ప్రముఖ బ్యాంకర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదిత్య పూరి (Aditya Puri)కి ప్రముఖ ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్వర్క్ డెలాయిట్ (Deloitte) కీలక పదవి ఇచ్చింది. కంపెనీ సీనియర్ సలహాదారుగా నియమించినట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి బిజినెస్ లీడర్లలో ఒకరిగా పేరుపొందిన ఆదిత్య పూరి 1994లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈవోగా నియమితులయ్యారు. సంస్థలో 26 సంవత్సరాలపాలు సేవలందించారు. 2020లో పదవీ విరమణ చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయిన డెలాయిట్‌లో చేరినందుకు సంతోషిస్తున్నానని ఆదిత్య పూరి పేర్కొన్నారు. విశేష అనుభవం, దూరదృష్టి గల ఆదిత్యపూరి నియామకంపై డెలాయిట్ సౌత్ ఏషియా సీఈఓ రోమల్ శెట్టి సంతోషం వ్యక్తం చేశారు. అంతకు ముందు జూన్‌లో భారతి ఎయిర్టెల్, సాఫ్ట్‌బ్యాంక్ ఇండియా మాజీ సీఈవో మనోజ్ కోహ్లీని సీనియర్ సలహాదారుగా డెలాయిట్ నియమించుకుంది. -
దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం.. వందలాది ఉద్యోగులపై ఎఫెక్ట్!
ఉద్యోగులు కరోనా మహమ్మారి భారీ నుంచి తప్పించుకున్నా.. లేఆఫ్స్ భారీ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఇప్పటికే లెక్కకుమించిన ఉద్యోగులను తొలగించిన దిగ్గజ కంపెనీలు ఇప్పటికి కూడా అదేపనిలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో డెలాయిట్ (Deloitte) 3శాతం ఉద్యోగులను తొలగిస్తూ నివేదికలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, మల్టి నేషనల్ ప్రొఫెషనల్ సర్వీస్ నెట్వర్క్ డెలాయిట్ 'యూకే' (UK)లో 800 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఈ సంస్థలో అక్కడ మొత్తం 27,000మంది పనిచేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కంపెనీ కొంత మందగమనంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఖర్చులను తగ్గించుకోవడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీకి పెద్దగా ప్రాజెక్టులు రావడం లేదని, రానున్న రోజుల్లో మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రభావం టెక్ కంపెనీల మీద ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: ఒక్క ఐడియా విలువ రూ.10 లక్షలు.. ట్రై చేసుకోండి! ఇదిలా ఉండగా.. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ గణనీయమైన తొలగింపులను ప్రకటించి ఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చింది. 2023 జనవరిలో సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు గతంలో నివేదికలు వెల్లడించాయి. అమెజాన్ కంపెనీ కూడా ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దాదాపు 18,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ జాబితాలో మెటా, ట్విటర్ వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. -
స్పేస్ కంపెనీలకు పన్ను మినహాయింపులు
న్యూఢిల్లీ: అంతరిక్ష పరిశోధన రంగంలో (స్పేస్) పనిచేసే కంపెనీలకు పన్ను మినహాయింపులు కలి్పంచడం వల్ల గణనీయమైన వృద్ధికి ఊతమిచి్చనట్టు అవుతుందని డెలాయిడ్–సీఐఐ నివేదిక సూచించింది. పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించేందుకు, తుది ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోడీపడేందుకు వీలుగా.. చేపట్టాల్సిన పన్ను సంస్కరణలపై వివరణాత్మకమైన అధ్యయనం చేపట్టాలని పేర్కొంది. ‘‘భారత సర్కారు స్పేస్ రంగానికి పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వడాన్ని ప్రారంభించింది. పన్ను మినహాయింపులు, పన్నురహితం దిశగా మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీంతో మొత్తం వ్యాల్యూ చైన్ ప్రయోజనం పొందుతుంది’’అని తెలిపింది. అంతర్జాతీయంగా ఈ రంగానికి సంబంధించి వివిధ దేశాలు అమలు చేస్తున్న చర్యలు, వాటి ప్రభావంపై విస్తృత అధ్యయనం అవసరమని సూచించింది. దీన్ని బెంచ్‌మార్క్‌గా తీసుకుని, భారత్ అదనంగా తన వంతు చర్యలను అమలు చేయాలని, ఇండియన్ స్పేస్ పాలసీ 2023ను ఎప్పటికప్పుడు నవీకరించాలని కోరింది. అంతర్జాతీయ, భారత అంతరిక్ష రంగం మార్కెట్ పరిమాణం.. ఈ రంగానికి సంబంధించిన విధానాలు, బడ్జెట్ కేటాయింపులు, పెట్టుబడుల వ్యూహాలు, ఇన్వెస్టర్ల నిర్ణయాలను ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడింది. భారత అంతరిక్ష పరిశోధాన సంస్థ ఇస్రో విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలతో చురుకైన భాగస్వామ్యాల దిశగా పనిచేస్తోందని.. తద్వారా అంతరిక్ష పరిశోధనా అభివృద్ధికి, స్పేస్ టెక్నాలజీల వృద్ధికి దోహదపడుతున్నట్టు తెలిపింది. ఈ భాగస్వామ్యాలు మారుమూల ప్రాంతాల్లోని విద్యా సంస్థలు, పరిశోధనా ల్యాబ్‌లకు చేరుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. -
భారత్ అగ్రరాజ్యం అవ్వాలంటే... 20 ఏళ్లలో 8 నుంచి 9 శాతం వృద్ధి అవశ్యం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నట్లు భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే వచ్చే 20 ఏళ్లలో 8–9 శాతం వృద్ధిని సాధించాల్సి ఉంటుందని డెలాయిట్ దక్షిణాసియా సీఈవో రోమల్ శెట్టి అన్నారు. పెట్టుబడులకు సంబంధించి ‘చైనా ప్లస్ వన్’ వ్యూహం (చైనాతో పాటు మరో దేశంలో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ఆలోచనలు) నుండి భారతదేశం ప్రయోజనం పొందగలదని ఆయన అన్నారు. భారత్ పెద్ద మార్కెట్ అని, ఇక్కడ అందుబాటులో ఉన్నంత స్థాయి, కార్యకలాపాల పరిమాణాన్ని మరే ఇతర దేశం అందించలేదని అన్నారు. ఒక వార్తా సంస్థకు ఆయన ఇచి్చన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. ► అంతరిక్ష రంగం విషయానికి వస్తే, భారతదేశంలో ఇప్పటికే 200 స్టార్టప్‌లు ఉన్నాయి. 2040 నాటికి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఈ రంగం ఆకర్షించే అవకాశం ఉంది. ► అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా భారత్ మారాలంటే కనీసం 2047 వరకు 8–9 శాతం వృద్ధిని సాధించాలి. మధ్య ఆదాయ స్థాయి పెరగడం, వేగంతో ఎదగడం అంత సులభం కాదు. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు ఏడాది ప్రాతిపదికన 8–9 శాతం వేగం వృద్ధిని నమోదుచేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ► వ్యవసాయం, అంతరిక్ష పరిశోధనలు, సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్ వెహికిల్సహా ఇతర పురోగతి చెందుతున్న భారత్ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను అన్వేíÙంచవచ్చు. దేశం సంవత్సరానికి 16,000–18,000 కిలోమీటర్ల (వేగంతో)మేర రోడ్లను నిర్మిస్తోంది. ఇది మౌలిక రంగం పురోగతికి, ఆర్థికాభివృద్ధికి, వాణిజ్యాన్ని పెంపొందించడానికి దోహదపడే అంశం. ► బహుళజాతి కంపెనీలు ’చైనా ప్లస్ వన్’ విధానం వైపు చూస్తున్నాయి. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కంపెనీలు తమ తయారీని చైనా కాకుండా వేరే చోటికి తరలించాలని నిర్ణయించినప్పుడు ప్రయోజనం పొందే ఇతర దేశాలు ఉన్నప్పటికీ భారత్ మినహా మరే ఇతర దేశానికి అంత స్థాయి, పరిమాణం లేదు. ► ముడిచమురు దిగుమతుల బిల్లే భారత్ అతిపెద్ద సవాలు. సాంకేతికంగా దేశం పురోగమన పథంలో ఉన్నప్పటకీ.. కృత్రిమ మేధస్సు (ఏఐ)లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. ► ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఎస్అండ్పీ గ్లోబల్ గత నెలలో ఒక నివేదిక విడుదల చేస్తూ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత 3.4 ట్రిలియన్ డాలర్ల నుండి 2031 నాటికి 6.7 ట్రిలియన్ డాలర్లకు రెట్టింపు అవుతుందని అంచనా వేసింది. -
టెక్ హబ్‌ల జాబితాలో ఏపీ నుంచి మూడు - అవేవో తెలుసా?
Nasscom-Deloitte Report: ఆధునిక ప్రపంచంలో భారతదేశం అభివృద్ధివైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రాలు కూడా ఇదే దిశలో పయనిస్తున్నాయి. దేశంలో 26 డెవెలప్ అవుతున్న టైర్-2 నగరాలు టెక్నాలజీ హబ్‌లుగా అభివృద్ధి చెందుతున్నాయని డెలాయిట్ ఇండియా వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలు ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలు.. అభివృద్ధి చెందిన నగరాలతో పోలిస్తే.. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖర్చులు 25 నుంచి 30 శాతం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రెంటల్స్‌లో 50 శాతం ఖర్చు ఆదా అవుతుంది. మన రాష్ట్రంలో టెక్ హబ్‌లుగా అవతరిస్తున్న నగరాల్లో తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలోని టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నిపుణుల్లో 11 నుంచి 15 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్నారు. అలాగే ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన వారు 60 శాతం మంది చిన్న పట్టణాల్లో ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? దేశంలోని మొత్తం స్టార్టప్‌లలో 39 శాతం (7,000 కంటే ఎక్కువ) డీప్ టెక్ నుంచి బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (BPM) వరకు పరిశ్రమలు విస్తరించి ఉన్న ఈ అభివృద్ధి చెందుతున్న టైర్-2 నగరాల్లో పనిచేస్తున్నాయి. టెక్నాలజీకి సంబంధించి పెద్ద నగరాలు గతంలో ఫోకస్లో ఉన్నప్పటికీ.. కరోనా మహమ్మారి తరువాత దేశవ్యాప్తంగా చెప్పుకో తగ్గ స్థాయిలో వికేంద్రీకరణ జరిగింది. 2014 - 2018 మధ్య కాలంలో కంపెనీలు గణనీయంగా ఎదిగాయి. 2025 నాటికి ఇవి 2.2 రెట్లు వృద్ధి చెందనున్నట్లు తెలుస్తోంది. ఇన్వెస్టర్లు కూడా ప్రస్తుతం పెద్ద నగరాల్లో మాత్రమే కాకుండా చిన్న పట్టణాల్లోని సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. రానున్న రోజుల్లో మనదేశంలో మరిన్ని కొత్త నగరాలు టెక్ హబ్‌లుగా మారతాయని చెప్పడానికి ఇదే నిదర్శనం. -
డెలాయిట్ రాజీనామాకు సరైన కారణాలు లేవు
న్యూఢిల్లీ: ఆడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సంబంధించి డెలాయిట్ చెబుతున్న కారణాలు సహేతుకంగా, నమ్మశక్యంగా లేవని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్) వ్యాఖ్యానించింది. ఈ అంశంపై స్టాక్ ఎక్సే్చంజీలకు 163 పేజీల వివరణ సమరి్పంచింది. డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్‌తో తమ నాయకత్వం నిర్వహించిన సమావేశాల్లో గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ కంపెనీల ఆడిటింగ్ వ్యవహారాలపై డెలాయిట్ ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొంది. అయితే, ఇతర సంస్థలన్నీ స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నవైనందున.. వాటిల్లో నియామకాల విషయంలో సిఫార్సులు చేయడమనేది ఆడిటర్ పరిధిలో ఉండదని డెలాయిట్‌కు తాము స్పష్టం చేసినట్లు వివరించింది. ఆడిటర్‌గా కొనసాగేందుకు డెలాయిట్ ఇష్టపడకపోవడం వల్ల సామరస్యంగా క్లయిట్–ఆడిటర్ కాంట్రాక్టును రద్దు చేసుకున్నట్లు తెలిపింది. డెలాయిట్ రాజీనామా వల్ల ఆరి్థక ఫలితాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని పేర్కొంది. వివాదాస్పద హిండెన్‌బర్గ్ నివేదిక పరిణామాల నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించి కొన్ని లావాదేవీలపై డెలాయిట్ కూడా సందేహాలు వ్యక్తం చేసింది. అదానీ గ్రూప్‌లోని ఇతరత్రా సంస్థలకు తాము అధికారిక ఆడిటర్లుగా లేనందున తక్షణం ఏపీసెజ్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ఆగస్టు 12న ప్రకటించింది. దీంతో ఏపీసెజ్ ఎంఎస్కేఏ అండ్ అసోసియేట్స్‌ను ఆడిటర్‌గా నియమించుకుంది. -
అదానీ పోర్ట్స్ నుంచి నిష్క్రమణ యోచనలో డెలాయిట్
న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ ఆడిటర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ యోచిస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డెలాయిట్ తప్పుకోవడానికి కారణమేంటనేది నిర్దిష్టంగా వెల్లడి కాలేదు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలో ప్రస్తావించిన నిర్దిష్ట లావాదేవీలపై డెలాయిట్ కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. 2022–23 ఆర్థిక ఫలితాల నివేదికలో మూడు సంస్థలతో లావాదేవీల గురించి డెలాయిట్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అంతర్గతంగా ఖాతాల మదింపు చేయడం, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణ చేస్తుండటం వంటి అంశాల కారణంగా హిండెన్‌బర్గ్ ఆరోపణల విషయంలో బైటి ఆడిటర్‌తో పరీక్ష చేయించడం అవసరమని అదానీ గ్రూప్ భావించలేదని పేర్కొంది. బైటి ఏజెన్సీ ద్వారా మదింపు జరగకపోవడం, సెబీ విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉండటం వల్ల కంపెనీ అన్ని నిబంధనలనూ పాటిస్తోందా లేదా అనేది తాము ధృవీకరించే పరిస్థితి లేదని తెలిపింది. -
అందరూ ఐటీ ఉద్యోగులే, లక్షల్లో ప్యాకేజీలు..ఎవర్ని పెళ్లి చేసుకోవాలో చెప్పరా! ప్లీజ్!
సాఫ్ట్వేర్! ఇదేదో డిగ్రీ పేరో, కోర్స్ పేరో కాదు. ఇండియాలో ఇదో లైఫ్‌స్టైల్. కొత్తగా రెక్కలొచ్చిన పక్షి ఎంత స్వేచ్ఛగా ఎగిరిపోతుందో.. అంతకన్నా స్వేచ్ఛగా యువతరం ఎగిరేలా చేసినా ఓ కొత్త లైఫ్ ట్రెండ్. బీటెక్ పూర్తి చేయకముందే క్యాంపస్ ఇంటర్వ్యూల్లో స్టూడెంట్స్‌ను కంపెనీలు ఎత్తుకెళ్లిపోయేవే. కెరియర్లో అడుగు పెట్టగానే నెలనెల అకౌంట్లో శాలరీ వచ్చి పడేది. రెండ్రోజులు సెలవు. ఈలోగా కంపెనీలు ఇచ్చే పార్టీలు, ఇన్సెంటీవ్స్‌తో ఒక్కసారిగా లగ్జరీ లైఫ్ ఆవరించేసింది. రెండుమూడేళ్లు తిరిగే సరికి ఒక్కొక్కరికి ప్రమోషన్లు. జీతం వేలు దాటి లక్షల్లోకి ఎగబాకింది. అప్పటి వరకు ఎప్పుడూ చూడనంత డబ్బు చేతికొచ్చింది. చదువుకునే రోజుల్లో వందకి, వెయ్యికి నాన్నని అడిగే రోజుల నుంచి లక్షల్లో బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటెన్ చేసే రేంజ్‌కి ఎదిగిపోయారు. దీంతో ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా అంతా తమ హైక్లాస్ రేంజ్ చూపించుకునే వారు. ఇలా జాబ్, శాలరీలోనే కాదు చేసుకునే అర్ధాంగి విషయంలోనూ పోటీ పడుతున్నారు టెక్కీలు. ‘దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నాం. లక్షలు సంపాదిస్తున్నాం అంటూ బీకాం చదివి ఇంటి దగ్గరే ఉంటున్న 29 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకునేందుకు యువకులు పోటీ పడుతున్నారు. మాట్రిమోని వెబ్సైట్లో ఆమె గురించి ఆరా తీస్తున్నారు. ఏ సంస్థలో పనిచేస్తున్నారు? ఎంత సంపాదిస్తున్నారనే విషయాల గురించి కులంకషంగా చర్చిస్తూ పెళ్లి ప్రపోజల్స్ సైతం పంపారు. దీంతో వాళ్లు జాబ్ చేస్తున్న కంపెనీలు, తీసుకుంటున్న శాలరీలను చూసి పాపం ఆ యువతికి ఎలాంటి వరుణ్ని భాగస్వామిగా ఎంచుకుంటే బాగుంటుందనే నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇదే విషయాన్ని నెటిజన్లతో పంచుకుంది. అందులో ‘నా పెళ్లి గురించి మాట్రిమోనీలో 14 మంది యువకులతో విడివిడిగా మాట్లాడుతున్నాను. ఎవరిని పెళ్లి చేసుకోవాలో అర్ధం కావడం లేదు’. శాలరీలు ఏడాదికి రూ.14 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఉన్నాయి. బైజూస్, ఫ్లిప్‌కార్ట్, డెలాయిట్, టీసీఎస్‌లో పనిచేస్తున్నారు. మీరే చెప్పండి ఎవర్ని పెళ్లి చేసుకోవాలో అర్ధం కావడం లేదు. సాయం చేయండని అభ్యర్ధించినట్లుగా ఉన్న ఓ ట్వీట్ వెలుగులోకి వచ్చింది. Here's how I approach this Girl is 29 yr old jobless BCOM. For such a girl most of the below options are too good to be safe For instance, Why is 45 LPA guy or a doc vying for her? Unless guys have some major shortcomings Under 30 & under 20 LPA seems a realistic bet (no 14) pic.twitter.com/UXa6KZd2rK — Dr Blackpill (@darkandcrude) July 18, 2023 ఆ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వయస్సులో ఎందుకు జాబ్ చేయడం లేదని ప్రశ్నిస్తుంటే..మరికొందరు ఈ పోస్ట్ ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు. ఏది ఏమైనా యువతి పెళ్లి చూపుల వ్యవహారం ఎలా ఉన్నా.. ఆర్ధిక మాంద్యంలోనూ ఐటీ ఉద్యోగుల జీతాలు భారీ స్థాయిలో ఉండడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 150 ఏళ్ల చరిత్రలో.. తొలి ఐఫోన్ తయారీ సంస్థగా టాటా గ్రూప్! -
బైజూస్‌లో ఏం జరుగుతోంది? ఆడిటర్‌గా తప్పుకున్న డెలాయిట్.. డైరెక్టర్ల రాజీనామా
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్‌లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు కంపెనీ ఆడిటింగ్ బాధ్యతల నుంచి డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ తప్పుకోగా మరోవైపు ముగ్గురు డైరెక్టర్లు రాజీనామా చేశారు. వివరాల్లోకి వెడితే .. 2021–22 ఆర్థిక సంవత్స ఆర్థిక ఫలితాల రూపకల్పనలో తీవ్ర జాప్యం నేపథ్యంలో తమ కాంట్రాక్టు ముగియడానికి మూడేళ్ల ముందే రాజీనామా చేసినట్లు డెలాయిట్ తెలిపింది. ఆడిటింగ్ కోసం తాము తరచుగా బైజూస్ ఎండీ బైజూ రవీంద్రన్‌కి లేఖలు రాస్తూనే ఉన్నప్పటికీ తమకు ఎటువంటి సమాచారం లభించలేదని పేర్కొంది. ఫలితంగా ఇప్పటివరకూ ఆడిట్ ప్రారంభించలేకపోయామని డెలాయిట్ వివరించింది. దీంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు బైజూస్ బోర్డుకు రాసిన లేఖలో తెలిపింది. డెలాయిట్ 2016 నుంచి బైజూస్‌కి ఆడిటర్‌గా వ్యవహరిస్తోంది. మరోవైపు, 2022 ఆర్థిక సంవత్సరం నుంచి వర్తించేలా అయిదేళ్ల పాటు బీడీవో (ఎంఎస్కేఏ అండ్ అసోసియేట్స్)ను చట్టబద్ధ ఆడిటర్లుగా నియమించుకున్నట్లు బైజూస్ మరో ప్రకటనలో తెలిపింది. బీడీవో ప్రస్తుతం ఐసీఐసీఐ, సిస్కో వంటి దిగ్గజాలకు ఆడిటింగ్ సేవలు అందిస్తోంది. టర్నోవరుపరంగా టాప్ అయిదు గ్లోబల్ ఆడిట్ సంస్థల్లో ఒకటిగా ఉంది. ఇక బైజూ రవీంద్రన్తో అభిప్రాయభేదాల కారణంగా డైరెక్టర్ల బోర్డులో ముగ్గురు రాజీనామా చేశారు. పీక్ 15 పార్ట్నర్స్ (గతంలో సెక్వోయా క్యాపిటల్)కి చెందిన జీవీ రవిశంకర్, చాన్ జకర్బర్గ్ ఇనీíÙయేటివ్ ప్రతినిధి వివియన్ వూ, ప్రోసస్కి చెందిన రసెల్ డ్రీసెన్స్టాక్ వీరిలో ఉన్నారు. బోర్డులోని మొత్తం ఆరుగురు సభ్యుల్లో మిగతా ముగ్గురు బైజూ రవీంద్రన్, దివ్యా గోకుల్‌నాథ్, రిజూ రవీంద్రన్ ఉన్నారు. అటు కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాధ్యతలు చేపట్టే వరకూ ఆగాలని బైజూస్ భావించడమే ఆడిటింగ్ జాప్యానికి కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. బైజూస్ కొత్త గ్రూప్ సీఎఫ్‌వోగా అజయ్ గోయల్ నెల రోజుల క్రితమే చేరారని, వచ్చే వారం తర్వాత నుంచి ఆడిటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వివరించాయి. -
హిట్లర్‌ను పొగిడాడు.. దిగ్గజ టెక్ కంపెనీలో మంచి ఉద్యోగం పోగొట్టుకున్నాడు!
అడాల్ఫ్ హిట్లర్.. ప్రపంచాన్ని వణికించిన నియంత. కొన్ని లక్షల మంది ప్రజలను పొట్టన బెట్టుకున్న క్రూరుడు. అతడి చెరలో పడితే చావే తప్పితే పునర్జన్మ ఉండదు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, మిత్ర రాజ్యాల దళాలు నాజీలను ఓడించడానికి ఆరేళ్లు ప్రయత్నించాయంటే..హిట్లర్ ఎంతటి గట్టివాడో అర్థం చేసుకోవచ్చు. అలాంటి నియంతను పొగిడాడంటూ ప్రముఖ టెక్ దిగ్గజం డెలాయిట్ ఓ ఉద్యోగుని విధుల నుంచి తొలగించింది. నీరభ్ మెహ్రోత్రా డెలాయిట్‌లో అసోసియేట్ డైరెక్టర్, రిస్క్ అడ్వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, తాజాగా నీరభ్ ‘ఫ్రైడే ఇన్స్పిరేషన్’ అనే కొటేషన్‌తో అడాల్ఫ్ హిట్లర్ ఆకర్షణీయమైన వ్యక్తి అంటూ నియంతపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘ఇటీవల నేను ది డార్క్ చార్మ్ ఆఫ్ అడాల్ఫ్ హిట్లర్ బుక్ కొనుగోలు చేశా. ఆ బుక్ చదివే కొద్దీ ఇంకా ఇంకా చదవాలని అనిపిస్తుంది. ముఖ్యంగా అందులో హిట్లర్ గురించి, వరల్డ్ వార్ 2 పై ఈ బుక్ నాకు సరైన అవగాహన ఇచ్చింది’’ అని మెహ్రోత్రా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. దీంతో పాటు ఆకర్షణీయమైన అడాల్ఫ్ హిట్లర్‌లోని కొన్ని లక్షణాల్ని మనం ఆకళింపు చేసుకోవాలి. తన మాటలతో ప్రజల్ని ఆకర్షించే మాగ్నెటిక్ స్పీకర్, కాన్ఫిడెంట్ ఎక్కువ’అని పేర్కొన్నాడు. అంతే అడాల్ఫ్ హిట్లర్‌ను పొగుడుతావా? అంటూ నెటిజన్లు మెహ్రోత్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. నెటిజన్ల కామెంట్లపై మెహ్రోత్రా స్పందిస్తూ బహిరంగ లేఖలో ఇలా రాశారు. ‘‘నేను ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. క్షమించండి అంటూ అభ్యర్థించాడు. ‘నేను తప్పు చేస్తే దానిని అంగీకరించే ధైర్యం ఉండాలని నా గురువులు, బాస్‌లు, కోచ్‌లు నాకు సలహా ఇచ్చారు. వారి మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాను. నేను చేసిన పోస్ట్‌పై క్షమాణలు కోరుతున్నాను అని అందులో రాశాడు. మరోవైపు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన కొద్ది సేపటికే డెలాయిట్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. మెహ్రూత్రా ఇకపై తమ కంపెనీలో పనిచేయడం లేదని పేర్కొంది. గత నెలలో మా సంస్థలో చేరిన ఉద్యోగి సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు మా భాగస్వామ్య విలువలకు అనుగుణంగా లేవు.మా అంతర్గత విధానాలను ఉల్లంఘించారు. ఈ ఉద్యోగి ఇకపై డెలాయిట్ ఇండియాలో పని చేయడు’ అని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు ఆ ప్రటకనలో తెలిపారు. -
డెలాయిట్‌కు చైనా మొట్టికాయ
బీజింగ్: ప్రముఖ అంతర్జాతీయ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ టచే తోమట్సుపై చైనా చర్యలు తీసుకుంది. చైనా ప్రభుత్వరంగ ‘చైనా హురాంగ్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ’కి సంబంధించి ఆడిట్ సరిగ్గా చేయనందుకు డెలాయిట్ బీజింగ్ కార్యాలయంపై 30.8 మిలియన్ డాల ర్లు (రూ.252 కోట్లు) జరిమానా విధించింది. అవినీతి ఆరోపణలపై చైనా హురాంగ్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ మాజీ హెడ్ లాయ్ షియోమీని చైనా 2021లో ఉరితీయడం ఈ సందర్భంగా గమనార్హం. పెట్టుబడులు పెట్టేందు కు, నిర్మాణ కాంట్రాక్టులు, ఉద్యోగాలకు సంబంధించి లంచాలు తీసుకున్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 2014–19 మధ్య ఆడిట్, ఇతర పనుల్లో తప్పులకు గాను డెలాయిట్ బీజింగ్ కార్యాలయంపై మూడు నెలల పాటు సస్పెన్షన్‌ను కూడా గతంలో విధించింది. హురాంగ్ సంస్థపై 1.16 లక్షల డాలర్లు, ఆడిట్లో లోపాలకు గాను 13 మంది ఉద్యో గులపై 36,000 డాలర్ల జరిమానా విధించింది. హురాంగ్ ఆస్తులు, నిబంధనల అమలు, నిర్వహణ కార్యకలాపాలపై ఆడిటర్‌గా డెలాయిట్ తగినంత దృష్టి సారించడంలో విఫలమైనట్టు చైనా నియంత్రణ సంస్థలు తేల్చాయి. -
మూడేళ్లలో 50 వేల నియామకాలు, భారీ ప్రణాళికల్లో డెలాయిట్
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ సర్వీసుల్లో ఉన్న డెలాయిట్ గడిచిన మూడేళ్లలో భారత్‌లో 50వేల మందిని నియమించుకుంది. ఈ కాలంలో సిబ్బంది సంఖ్య రెండింతలైందని కంపెనీ తెలిపింది. విద్య, డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ అవకాశాలకు మద్దతుగా వినూత్న విధానాలపై దృష్టి సారించి, భారత్‌లోని వ్యక్తులు, ఉత్పాదక సామర్థ్యాలలో పెట్టుబడిని కొనసాగించాలని సంస్థ యోచిస్తోంది. రాబోయే కొన్ని సంవత్సరాలలో, కంపెనీ STEM, ఆవిష్కరణ, లీడర్ షిప్, డిజిటల్‌పై దృష్టి సారించి విస్తృత అవకాశాలను కొనసాగించాలని యోచిస్తోంది. డెలాయిట్ వరల్డ్‌క్లాస్, విద్య , నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా 2030 నాటికి 100 మిలియన్ల మందిని ముఖ్యంగా భారతదేశంలో 50 మిలియన్ల మందిని (కోటి) చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని పీటీఐ నివేదించిం -
రిటైల్‌లో కొనసాగనున్న కన్సాలిడేషన్
న్యూఢిల్లీ: దేశీ రిటైల్ రంగంలో బడా కంపెనీలు కొత్త ఏడాది తమ స్థానాలను పటిష్టం చేసుకోవడంపై మరింతగా కసరత్తు చేయనున్నాయి. దీంతో 2023లోనూ కన్సాలిడేషన్ కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వృద్ధి అవకాశాలు ఆశావహంగానే కనిపిస్తున్నా, ద్రవ్యోల్బణంపరమైన ప్రతికూలతలు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలతో ఆందోళనల కారణంగా పరిశ్రమ కొంత ఆచితూచి వ్యవహరించవచ్చని విశ్లేషకులు తెలిపారు. సమర్ధమంతమైన పెద్ద సంస్థలకు చాలా మటుకు చిన్న రిటైలర్లు తమ వ్యాపారాలను విక్రయించి తప్పుకునే అవకాశాలు ఉండటంతో 2023లో కన్సాలిడేషన్ కొనసాగవచ్చని భావిస్తున్నట్లు డెలాయిట్ ఇండియా కన్సల్టింగ్ పార్ట్నర్ రజత్ వాహి చెప్పారు. కస్టమరుకు అత్యుత్తమ అనుభూతిని ఇచ్చేందుకు స్టోర్స్‌లో టెక్నాలజీ వినియోగం మరింత పెరగవచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా మిగతా కీలక మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో రిటైల్ విభాగం మెరుగైన వృద్ధి సాధించగలదని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) సీఈవో కుమార్ రాజగోపాలన్ చెప్పారు. ఓఎన్డీసీ (డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్వర్క్) వంటి కాన్సెప్టులతో రాబోయే రోజుల్లో అసంఖ్యాకంగా చిన్న రిటైలర్లు డిజిటల్ కామర్స్‌లో పాలుపంచుకుంటారని వివరించారు. ఆదాయాల్లో 20 శాతం వరకూ వృద్ధి .. 2023 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా సంఘటిత రంగ ఆహార, నిత్యావసరాల రిటైలర్ల ఆదాయాలు 15–20 శాతం శ్రేణిలో పెరగవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన ఒక నివేదిక వెల్లడించింది. అయితే, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్ల కారణంగా నిర్వహణ లాభాల మార్జిన్లు 5–6 శాతం శ్రేణికి పరిమితం కావచ్చని వివరించింది. సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు టెక్నాలజీని వినియోగించుకోవడం, మెట్రో నగరాలను దాటి కార్యకలాపాలను విస్తరించడం తదితర అంశాలపై కంపెనీలు దృష్టి పెట్టనున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై భారత విభాగం లీడర్ (కన్జూమర్ ప్రోడక్ట్స్, రిటైల్) అంశుమన్ భట్టాచార్య తెలిపారు. ఇక, కొత్త ఏడాదిలోకి ప్రవేశించే తరుణంలో ఒకసారి 2022లో రిటైల్‌లో చోటు చేసుకున్న కీలక పరిణామాలు కొన్ని చూస్తే .. ► ఏకంగా 16,600 పైచిలుకు స్టోర్స్‌తో రిలయన్స్ రిటైల్ దేశీయంగా అతి పెద్ద ఆఫ్‌లైన్ రిటైలరుగా ఎదిగింది. 18 బిలియన్ డాలర్ల ఆదాయంతో అంతర్జాతీయంగా టాప్ రిటైలర్లలో 56వ స్థానంలోనూ, అత్యంత వేగంగా ఎదుగుతున్న రిటైలర్లలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. జర్మన్ రిటైల్ సంస్థ మెట్రో ఏజీకి చెందిన భారత కార్యకలాపాలను రూ. 2,850 కోట్లకు కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకుంది. అలాగే, అబు జానీ సందీప్ ఖోస్లా (ఏజేఎస్కే), పర్పుల్ పాండా ఫ్యాషన్స్ మొదలైన పలు ఫ్యాషన్స్ బ్రాండ్స్‌లో, రోబోటిక్స్ కంపెనీ యాడ్వర్బ్లోనూ మెజారిటీ వాటాలు దక్కించుకుంది. ► ఆదిత్య బిర్లా గ్రూప్‌లో బాగమైన టీఎంఆర్‌డబ్ల్యూ సంస్థ ఫ్యాషన్ కేటగిరీలో ఎనిమిది డిజిటల్ ఫస్ట్ లైఫ్‌స్టయిల్ బ్రాండ్స్‌లో మెజారిటీ వాటాలు తీసుకుంది. ► ఆన్లైన్లో కార్యకలాపాలు విస్తరించే దిశగా వీ–మార్ట్ సంస్థ లైమ్‌రోడ్‌ను కొనుగోలు చేసింది. ► దేశీ రిటైల్ పరిశ్రమలో దిగ్గజంగా వెలుగొందిన ఫ్యూచర్ రిటైల్ కుప్పకూలింది. దివాలా పరిష్కార చర్యలు ఎదుర్కొంటోంది. -
ఐటీలో అలజడి : మరో ఊహించని షాక్..తలలు పట్టుకుంటున్న ఫ్రెషర్లు!
ఐటీ సంస్థల్లో మూన్‌లైటింగ్ వివాదం ఇప్పట్లో సమిసిపోయేలా లేదు. ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు ఫ్రెషర్లకు భారీ షాకిచ్చాయి. ఇంటర్వ్యూల్లో సెలక్ట్ అయిన ఫ్రెషర్లకు అపాయిట్మెంట్ లెటర్లు ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ తిరిగి వెనక్కి తీసుకున్నాయి. తాజాగా డెలాయిట్ సంస్థ ఆఫర్లను లెటర్లను ఇప్పట్లో ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న ఆర్ధిక సంక్షోభం కలవరానికి గురి చేస్తున్న వేళ.. ఐటీ సంస్థలు ఆఫర్ లెటర్లను వెనక్కి తీసుకోవడం చర్చాంశనీయమైంది. అయితే ఆర్ధిక సంక్షోభం కాదని, మూన్‌లైటింగ్ కారణమంటూ ఐటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే? ఇటీవల రెండేసి జాబులు చేస్తున్న 300మంది ఉద్యోగుల్ని విప్రో తొలగించింది. ఆ తర్వాత దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులపై ఓ కన్నేశాయి. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన ఉద్యోగుల్ని గుర్తించడం, బ్యాంక్ స్టేట్మెంట్లు పరిశీలించి ఇటీవల ఉద్యోగం పొందిన వారికి తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ కొలిక్కి వచ్చేంత వరకు ఫ్రెషర్ల నియామకాలు చేపట్టవద్దని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఆఫర్ లెటర్లను రద్దు చేస్తే ఇండస్ట్రీ నుంచి తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశంతో..వాటిని తిరిగి తీసుకుంటున్నాయి. చదవండి👉 ‘అలా చేస్తే మీకే కాదు..నా ఉద్యోగానికే దిక్కుండదు’, రషీద్ ప్రేమ్‌జీ సంచలన వ్యాఖ్యలు తాజాగా డెలాయిట్.. గతేడాది క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపిక చేసిన ఫ్రెషర్లకు ఇవ్వాల్సిన ఆఫర్ లెటర్లను ఇచ్చేందుకు మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో డెలాయిట్ నిర్ణయంపై ఫ్రెషర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘క్యాంపస్ ఇంటర్వ్యూల్లో డెలాయిట్‌కు సెలక్ట్ అయ్యాయి. నేను సెలక్ట్ అయ్యానంటూ 2021అక్టోబర్‌లో డెలాయిట్ కన్ఫామ్ చేసింది. అప్పటి నుంచి ఆఫర్ లెటర్ కోసం, జాయిన్ డేట్ కోసం ఎదురు చూస్తున్నాన్నా’ ఓ ఫ్రెషర్ ఆవేదన ‘క్యాంపస్ ప్లేస్మెంట్లో డెలాయిట్ అసోసియేట్ ఎనలిస్ట్, కన్సల్టింగ్ డిపార్ట్ మెంట్ పొజిషన్లో జాబ్ వచ్చింది. ఇప్పటి వరకు ఆఫల్ లెటర్ రాలేదు. సంస్థ ఈ ప్రక్రియను ఎందుకు అంత ఆలస్యం చేస్తోంది?’ - ప్రశ్నిస్తున్న ఓ అభ్యర్ధి ‘డెలాయిట్ ఆఫ్లెటర్లు ఇవ్వడం ఆలస్యం కావడంతో ఫ్రెషర్లు అవమానంగా ఫీలవుతున్నారు. ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ ఆలస్యం చేసిన తరువాత, నా కుటుంబ సభ్యులు,బంధువులు ఉద్యోగం ఉందా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు. నేను వారిని మోసం చేశానని అందరూ అనుకుంటున్నారు’ - ఇటీవల గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఓ అభ్యర్ధి ఆఫర్ లెటర్ల ఆలస్యం సుమారు 500మందిపై ప్రభావం చూపింది. మాకు టెలిగ్రామ్ గ్రూపు ఉంది. సుమారు 500 మంది ఇందులో భాగం. ఈ ఆలస్యంపై డెలాయిట్ నుండి రిప్లయి కోసం ఎదురు చూస్తున్నాను. - టెలిగ్రామ్ గ్రూప్ సభ్యుడు, డెలాయిట్ ఇచ్చే ఆఫర్ లెటర్ కోసం ఎదురు చూస్తున్న ఓ అభ్యర్ధి ఆఫర్ లెటర్లు ఆలస్యం చేయడంపై అంతర్జాతీయ మీడియా సంస్థలు డెలాయిట్ ప్రతినిధుల్ని సంప్రదించారు. ఆఫర్లెటర్ల గురించి అడగ్గా..‘మేం నియామకాలు,కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆఫర్లెటర్లను ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. అందుకు కొంత సమయం పడుతుంది’ అని రిప్లయి ఇచ్చారు. కాగా ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్‌జెమిని, యాక్సెంచర్, మైండ్ ట్రీతోఎ పాటు అనేక ఐటీ కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇవ్వకపోవడం, వెనక్కి తీసుకున్న ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. చదవండి👉 దిగ్గజ కంపెనీల్లో సాఫ్ట్వేర్ జాబ్ చేయడమే మీ లక్ష్యమా! గూగుల్ అదిరిపోయే ఆఫర్! -
ఉద్యోగుల్ని ఊరిస్తున్న ఇంక్రిమెంట్లు..ఎంతపెరగనున్నాయంటే!!
ఈ ఏడాది దేశంలో పెరగనున్న ఉద్యోగుల జీతాలపై డెలాయిట్ టచ్ తోమట్సు ఇండియా Deloitte Touche Tohmatsu ఎల్ఎల్పీ (డీటీటీఐఎల్‌ఎల్‌పీ) స్పందించింది. 2021తో పోలిస్తే ఈ ఏడాది 92శాతంతో వేతనాలు పెరుగుతున్నట్లు తెలిపింది. ఇక గతేడాది పెరిగిన జీతాలు 8శాతం నుంచి 9.1శాతానికి పెరగనున్నట్లు అంచనా వేసింది. సర్వే ఫలితాల ప్రకారం, దాదాపు అన్ని సంస్థలు 2022లో ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాయి. 2020, 2021పెరిగిన జీతాలు 60శాతంతో పోలిస్తే 2022లో 92శాతం పెరగనున్నట్లు తెలిపింది. 2022లో పెరగనున్న 2021లో 8.0శాతం పోలిస్తే 9.1శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. 2022 అంచనా వేసిన ఇంక్రిమెంట్ 2019లో కోవిడ్-19కి ముందు పెరిగిన ఇంక్రిమెంట్ల కంటే 50 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) ఎక్కువగా ఉంది. స్టడీ వర్క్ ఫోర్స్ అండ్ ఇంక్రిమెంట్ ట్రెండ్స్ సర్వే -2022 మొదటి దశ అంచనా ప్రకారం 34శాతం సంస్థలు రెండంకెల సగటు ఇంక్రిమెంట్లను ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాయి. 2021లో 20శాతం ఉండగా..2020లో 12శాతం మాత్రమే ఉన్నాయి. లైఫ్ సైన్సెస్, ఐటీ రంగాలు 2022లో అత్యధిక ఇంక్రిమెంట్లను అందించే అవకాశం ఉంది. ఫిన్‌టెక్, ఐటీ-ఉత్పత్తి కంపెనీలు,డిజిటల్/ఇ-కామర్స్ సంస్థలు 2022లో రెండంకెల ఇంక్రిమెంట్లను ఇస్తాయని భావిస్తున్నారు. జూనియర్ మేనేజ్మెంట్లోని ఉద్యోగులు సగటున 2022లో రెండంకెల పెంపును అందుకోవచ్చని భావిస్తున్నారు. 92శాతం సంస్థలు వ్యక్తిగత పనితీరును బట్టి ఉద్యోగుల మధ్య ఇంక్రిమెంట్లను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. పనితీరు బాగున్న ఉద్యోగులకు నామమాత్రంగా పని చేసే ఉద్యోగుల కంటే 1.7రెట్లు ఇంక్రిమెంట్ పొందవచ్చని భావిస్తున్నారు. పదోన్నతి పొందే ఉద్యోగుల శాతం 2021లో 11.7శాతం నుండి 2022లో 12.4శాతానికి పెరుగుతుందని, 2022లో పదోన్నతి పొందిన వారికి సగటు అదనపు ఇంక్రిమెంట్ 7.5శాతం ఉండనుంది. చదవండి: ప్రైవేట్ ఉద్యోగుల పంట పండింది!! భారీగా పెరగనున్న జీతాలు! -
దూసుకెళ్తున్న మహిళా సారథులు
ముంబై: కార్పొరేట్ ప్రపంచంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా (సీఈవో) సారథ్య బాధ్యతలు చేపడుతున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అదే సమయంలో బోర్డ్ చైర్పర్సన్లుగా ఉంటున్న వారి సంఖ్య మాత్రం తగ్గుతోంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ గ్లోబల్ రూపొందించిన ’బోర్డ్‌రూమ్‌లో మహిళలు’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దేశీయంగా 2014లో కంపెనీల బోర్డుల్లో మహిళల సంఖ్య 9.4 శాతంగా ఉండగా, ప్రస్తుతం ఇది 17.1 శాతానికి పెరిగింది. అయితే, బోర్డ్ చైర్పర్సన్లుగా ఉన్న వారి సంఖ్య 2018తో పోలిస్తే 0.9% తగ్గి 3.6 శాతంగా మాత్రమే ఉంది. ప్రతీ బోర్డులో కనీసం ఒక్క మహిళైనా ఉండాలంటూ నిర్దేశించే కంపెనీల చట్టం 2014లో అమల్లోకి వచ్చింది. కొన్ని అంశాలకు సంబంధించి దాన్ని ప్రాతిపదికగా తీసుకుని డెలాయిట్ ఈ నివేదిక రూపొందించింది. దేశీయంగా సీఈవో బాధ్యతలు చేపడుతున్న మహిళల సంఖ్య 2018లో 3.4 శాతంగా ఉండగా ప్రస్తుతం 4.7 శాతానికి పెరిగింది. అంతర్జాతీయంగా స్వల్పంగా పెరుగుదల ... ప్రపంచవ్యాప్తంగా కంపెనీల బోర్డుల్లో మహిళల సంఖ్య 19.7 శాతంగా ఉంది. 2018తో పోలిస్తే 2.8 శాతం పెరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే పురుషులతో దాదాపు సమాన స్థాయిలో మహిళలకు కూడా బోర్డుల్లో చోటు దక్కాలంటే 2045 నాటికి గానీ సాధ్యపడకపోవచ్చని డెలాయిట్ వివరించింది. ఆస్ట్రియా, కెనడా, ఐర్లాండ్, ఇటలీ, పోలాండ్, పోర్చుగల్, స్పెయిన్, బ్రిటన్, అమెరికా దేశాల్లోని కంపెనీల్లో మహిళా చైర్పర్సన్ల సంఖ్య చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగింది. మరోవైపు, అంతర్జాతీయంగా కంపెనీల బోర్డుల్లో స్త్రీల సంఖ్య విషయానికొస్తే పురుషుల సారథ్యంలోని సంస్థలతో పోలిస్తే (19.4 శాతం), మహిళల నేతృత్వంలోని కంపెనీల్లో ఎక్కువ మంది మహిళలు (33.5 శాతం) ఉంటున్నారు. దేశీయంగా పెరిగిన పదవీ కాలం.. దేశీయంగా మహిళా డైరెక్టర్ల సగటు పదవీకాలం 2018లో 5 ఏళ్లుగా ఉండగా 2021లో 5.1 సంవత్సరాలకు పెరిగింది. అంతర్జాతీయంగా మాత్రం ఇది సగటున 5.5 ఏళ్ల నుంచి 5.1 ఏళ్లకు తగ్గింది. ముఖ్యంగా అమెరికా (2018లో 6.3 ఏళ్ల నుంచి 2021లో 5.3 ఏళ్లకు), బ్రిటన్‌లో (4.1 సంవత్సరాల నుంచి 3.6 ఏళ్లకు), కెనడా (5.7 ఏళ్ల నుంచి 5.2 సంవత్సరాలకు)లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగేలా ప్రోత్సహించేందుకు దేశీ నియంత్రణ సంస్థలు మార్గదర్శకాలు ప్రవేశపెట్టినప్పటికీ ఆశయాలకు, వాస్తవ పరిస్థితికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటోందని డెలాయిట్ ఇండియా చైర్పర్సన్ అతుల్ ధవన్ తెలిపారు. -
భారత్‌లో డెలాయిట్ ఏఐ ఇనిస్టిట్యూట్
అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు ఈ సాంకేతికత హవా నడుస్తోంది. అంతేకాదు రాబోయే రోజుల్లో శాసించే టెక్ ట్రెండ్ కూడా ఇదే. ఈ మేరకు ఏఐపై పట్టుకోసం యువత తీవ్రంగా యత్నిస్తోంది. ఇదిలా ఉంటే భారత్‌లో ఇదివరకే కొన్ని విద్యాలయాలు, ప్రైవేట్ ఇనిస్టిట్యూట్స్ ఏఐ టెక్నాలజీ కోర్సులను అందిస్తుండగా.. తాజాగా డెలాయిట్ కూడా ఇందులోకి దిగింది. ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ కంపెనీ డెలాయిట్.. పూర్తి స్థాయి ఏఐ ఆవిష్కరణల కోసం ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించుకుంది. ఏఐ సాంకేతికతపై ప్రాథమిక అవగాహన, ప్రతిభాపాటవాల ఆధారంగా ఎంపిక చేయబడ్డ వాళ్లకే ఈ ఇనిస్టిట్యూట్‌లో అడ్మిషన్లు దొరుకుతాయని డెలాయిట్ ఇండియా భాగస్వామి సౌరభ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే అమెరికాలో కిందటి ఏడాది డెలాయిట్ ఫస్ట్ ఏఐ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత కెనెడా, ఇంగ్లండ్, జర్మనీ, చైనా, ఆస్ట్రేలియాల్లో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనిస్టిట్యూట్లను నెలకొల్పింది. ఏఐ ఇంజినీర్లు కావలెను ఎంఎన్సీ మొదలు.. చిన్నస్థాయి కంపెనీల దాకా(అందుబాటులో బడ్జెట్‌తో) ఏఐ మీదే ఆధారపడుతున్నాయి ఇప్పుడు. ఈ తరుణంలో ప్రజెంట్-అడ్వాన్స్డ్ టెక్నాలజీగా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పేర్కొంటున్నారు టెక్ నిపుణులు. ఇదిలా ఉంటే మన దేశంలో ఈ కోర్స్ మీద ఉద్యోగావకాశాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. రానున్న రోజుల్లో కృత్రిమ మేధస్సు కోర్సుపై పట్టు సాధించిన ఇంజినీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు వెస్ట్రన్ దేశాల్లో మాత్రం చాలా ఏళ్లుగా అవకాశాలు అందిస్తోంది. తాజాగా టెస్లా సీఈవో ఎలన్ మస్క్.. ట్విటర్ ద్వారా జాబ్స్ ఆఫర్ చేశాడు. ఏఐ ఇంజినీర్లకు నియామకాలంటూ ట్వీట్లో ఆయన పేర్కొన్నాడు. టెస్లాలో సాంకేతికతను విస్తరించడంలో భాగంగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు ఓ ప్రకటనలోనూ ఆయన పేర్కొన్నాడు. అంతేకాదు ఏ దేశం వాళ్లకైనా ఈ నియామకాలు వర్తిస్తాయని స్పష్టత ఇచ్చాడు. As always, Tesla is looking for hardcore AI engineers who care about solving problems that directly affect people’s lives in a major way.https://t.co/0B5toOOHcj — Elon Musk (@elonmusk) December 6, 2021 -
వైజాగ్ స్టీల్ విక్రయానికి సలహా సంస్థల క్యూ
న్యూఢిల్లీ: పీఎస్‌యూ ఆర్ఐఎన్ఎల్(వైజాగ్ స్టీల్)లో కేంద్ర ప్రభుత్వానికి గల 100 శాతం వాటా విక్రయ లావాదేవీని చేపట్టేందుకు ఐదు కంపెనీలు బిడ్ చేసినట్లు దీపమ్ తాజాగా వెల్లడించింది. జాబితాలో యర్నెస్ట్ అండ్ యంగ్‌సహా ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, డెలాయిట్ టచ్ తోమత్సు, జేఎం ఫైనాన్షియల్, ఆర్బీఎస్ఏ క్యాపిటల్ అడ్వయిజర్స్ చేరినట్లు వెబ్సైట్లో పేర్కొంది. రేసులో నిలిచిన అడ్వయిజర్ కంపెనీలు ఈ నెలాఖరులోగా దీపమ్ వద్ద ప్రజెంటేషన్‌ను ఇవ్వవలసి ఉంటుంది. వైజాగ్ స్టీల్ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియను నిర్వహించేందుకు జులై 7న ఆసక్తి గల కంపెనీల నుంచి దీపమ్ బిడ్స్‌ను ఆహా్వనించింది. ఇందుకు తొలుత ప్రకటించిన గడువును జూలై 28 నుంచి ఆగస్ట్ 26 వరకూ పొడిగించింది. వాటా విక్రయ లావాదేవీ నిర్వహణకు దీపమ్ ఒకే అడ్వయిజర్ సంస్థను ఎంపిక చేయనుంది. సలహా సంస్థ వైజాగ్ స్టీల్‌తోపాటు.. అనుబంధ కంపెనీలలోనూ వాటా విక్రయ వ్యవహారాన్ని చేపట్టవలసి ఉంటుంది. కాగా.. మరోవైపు న్యాయ సలహాదారుగా వ్యవహరించేందుకు సైతం ఐదు కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ కంపెనీలు కూడా ఈ నెల 30న దీపమ్‌కు ప్రతిపాదనలు అందించవలసి ఉంటుంది. వీటిలో చాందియోక్ అండ్ మహాజన్, ఎకనమిక్ లాస్ ప్రాక్టీస్, జే సాగర్ అసోసియేట్స్, కొచ్చర్ అండ్ కంపెనీ, లింక్ లీగల్ ఉన్నాయి. జనవరిలోనే.. ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్(సీసీఈఏ) ఈ ఏడాది జనవరి 27న రా్రïÙ్టయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(వైజాగ్ స్టీల్)లో పూర్తి వాటా విక్రయానికి ముందస్తు అనుమతిని మంజూరు చేసింది. ప్రైవేటైజేషన్ ద్వారా అనుబంధ సంస్థలతోపాటు వైజాగ్ స్టీల్‌లో వ్యూహాత్మక వాటా విక్రయానికి గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. -
భారత్‌కు ఎఫ్‌డీఐలు కీలకం, వచ్చే మూడేళ్లలో 75 వేల మంది రిక్రూట్
వాషింగ్టన్: భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) కీలకమని డెలాయిట్ సీఈవో పునీత్ రంజన్ అభిప్రాయపడ్డారు. బ్రిటన్, అమెరికా, జపాన్, సింగపూర్ తదితర దేశాల్లో పలువురు ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తిగా ఉన్నారని వెల్లడించారు. తాము నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 1,200 మంది వ్యాపార దిగ్గజాల్లో అయిదింట రెండొంతుల మంది.. ఇండియాలో అదనంగా పెట్టుబడులు పెట్టడం లేదా తొలిసారిగా ఇన్వెస్ట్ చేయడంపై ఆసక్తి కనపర్చినట్లు ఒక ఇంటర్వ్యూలో రంజన్ చెప్పారు. విదేశీ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయ దేశాల్లో ఒకటిగా భారత్ కొనసాగుతోందని ఆయన వివరించారు. ‘కోవిడ్–19పరమైన ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్‌లోకి రికార్డు స్థాయిలో ఎఫ్‌డీఐలు వచ్చాయి. 5 లక్షల కోట్ల ఎకానమీగా ఎదగాలన్న భారత్ లక్ష్యం సాకారం కావడానికి విదేశీ పెట్టుబడులు కీలకం. అంతే కాదు ఇది సాధించతగిన లక్ష్యమే అన్నది నా అభిప్రాయం‘ అని రంజన్ వివరించారు. ఆకర్షణీయమైన అంశాలు.. సుశిక్షితులైన నిపుణులు, ఆర్థిక వృద్ధి (ముఖ్యంగా దేశీయంగా) వంటి అంశాలు ఎఫ్‌డీఐలను ఆకర్షించేందుకు అనువైన అంశాలుగా ఉంటున్నాయని తమ సర్వేలో తేలినట్లు రంజన్ వివరించారు. ఇన్వెస్టర్లకు భారత్ ఎగుమతి హబ్‌గా ఉపయోగపడటంతో పాటు దేశీ మార్కెట్ కూడా అందుబాటులో ఉండటం ముఖ్యమని ఆయన చెప్పారు. అయితే, భారత్‌లో వ్యాపారం చేయడమంటే సవాళ్లతో కూడుకున్న వ్యవహారమనే అభిప్రాయం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యలు సహా పలు ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలు, సంస్కరణలపై అంతగా అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని రంజన్ అభిప్రాయపడ్డారు. కస్టమర్ల డిజిటైజేషన్, అనుమతుల ప్రక్రియ, ఉత్పత్తికి ప్రోత్సాహకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి తమకు అంతగా తెలియదని జపాన్‌లో 16 శాతం మంది, సింగపూర్‌లో 9 శాతం మంది వ్యాపార దిగ్గజాలు చెప్పారని ఆయన వివరించారు. ‘ప్రభుత్వం చేస్తున్న అనేక మంచి పనుల గురించి ఇన్వెస్టర్లలో సరైన అవగాహన ఉండటం లేదు‘ అని రంజన్ చెప్పారు. భారత ప్రభుత్వ విధానాలు కచ్చితంగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సహాయపడే విధంగానే ఉన్నాయని చెప్పారు. ఇన్ఫ్రాపై ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం సానుకూలాంశమని పేర్కొన్నారు. భారత్‌లో 75వేల నియామకాలు.. వచ్చే మూడేళ్లలో భారత్‌లో 75 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు రంజన్ చెప్పారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తెలియజేసినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం డెలాయిట్‌కు అంతర్జాతీయంగా మొత్తం 3,45,000 మంది సిబ్బంది ఉండగా.. దేశీయంగా 65,000 మంది ఉద్యోగులు ఉన్నారు. -
Tarun Kappala: అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్‌గా..
సాక్షి, హైదరాబాద్: అవును అతడు రెక్కలు కట్టుకొని వచ్చాడు. తన వాళ్ల కోసమే కాదు. తన తల్లి లాంటి ఎంతో మంది తల్లుల కోసం. మరెందరో తన చెల్లెల్లాంటి తోబుట్టువుల కోసం అమెరికా నుంచి వచ్చేశాడు. డెల్లాయిట్కు చెందిన ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ నిపుణుడిగా, ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తున్న తరుణ్ కప్పల ఇప్పుడు ఒక అంబులెన్స్ డ్రైవర్ కూడా. కోవిడ్ మహమ్మారిపైన అలుపెరుగని యుద్ధం చేస్తున్న వందలాది మంది సైనికుల్లో అతడు సైతం ఒక సైనికుడిగా నిలిచాడు. కోవిడ్ బాధితులు ఎక్కడుంటే అక్కడ ఠకీమని వాలిపోతాడు. స్వయంగా అంబులెన్సులో తీసుకెళ్లి ఆస్పత్రుల్లో చేర్పిస్తాడు. కోవిడ్ పేషెంట్లు వార్డుల్లో ఉన్నా. ఐసీయూల్లో ఉన్నా వెళ్లి పలకరిస్తాడు. ‘నేనున్నానంటూ భరోసానిస్తాడు. మీకేం కాదంటూ ’మాటలతో ధైర్యాన్ని నూరిపోస్తాడు. తరుణ్ అంబులెన్స్ రాత్రింబవళ్లు తిరుగుతూనే ఉంటుంది. హైదరాబాద్‌లో ఏ మారుమూల ప్రాంతంలో కోవిడ్ బాధితులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిసినా వెంటనే వెళ్లిపోతాడు. ‘సకాలంలో ఆస్పత్రికి చేర్చినప్పుడు, పేషెంట్లు కోలుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నప్పడు గొప్ప సంతృప్తి కలుగుతుంది. ఈ జీవితానికి అది చాలు అనిపిస్తుంది.’ అంటూ వినయంగా చెబుతాడు తరుణ్. సేవే దైవంగా... శ్రీనగర్ కాలనీకి చెందిన తరుణ్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. టెక్సాస్ వర్సిటీలో చదువుకున్నాడు. డెల్లాయిట్‌లో ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో చేరాడు. గతేడాది కోవిడ్ మహమ్మారి బారిన పడిన ప్రపంచం చిగురుటాకులా వణుకుతున్న సమయంలో అక్కడే ఉన్నాడు. ఆ సమయంలో ఇండియాకు వచ్చే విద్యార్ధులకు అండగా నిలిచాడు. సొంత ఊళ్లకు వెళ్లేందుకు అన్ని విధాలుగా సహకరించాడు. ‘ఆ సమయంలోనే మా అమ్మ హైదరాబాద్‌లో ఇంట్లో జారిపడింది. వెన్నెముక దెబ్బతిన్నది. సర్జరీ చేయవలసి వచ్చింది. ఇక నేను హైదరాబాద్‌కు వచ్చాను. మధ్యలో అమ్మకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కొద్ది రోజుల్లో అమెరికాకు తిరిగి వెళ్లిపోవచ్చుననుకుంటున్న సమయంలో సెకెండ్ వేవ్ ఉధృతి మొదలైంది. చాలా భయానకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పరిస్థితులే నా బాధ్యతను కూడా గుర్తు చేశాయి’ అంటారు తరుణ్. ‘ఆస్పత్రులన్నీ కోవిడ్ పేషెంట్లతో నిండిపోతున్నాయి. అంబులెన్సులు నిలువుదోపిడీకి పాల్పడుతున్నాయి. అమెరికాలోనే ఉంటున్న తన స్నేహితుడి చెల్లెల్ని గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రూ.15 వేలు ఖర్చు చేయవలసి వచ్చింది. ఇలాంటి సంఘటనలు చాలా బాధ కలిగించాయి. ఆ సమయంలోనే అమెరికాలో ఉన్న నా స్నేహితుల సహాయంతో సేవా కార్యక్రమాలు ప్రారంభించాను. ఎథ్నె అనే ఓ స్వచ్చంద సహకారంతో మారుతీ ఓమ్ని వ్యాన్ కొనుగోలు చేసి ఆక్సిజన్ సదుపాయం ఉన్న అంబులెన్సుగా మార్చాను. ఇప్పటి వరకు 4 వేల కిలోమీటర్లకు పైగా తిరిగాను. వందలాది మందిని ఆస్పత్రుల్లో చేర్చాను. దురదృష్టవశాత్తు చనిపోయిన వారి మృతదేహాలను శ్మశానాలకు తీసుకెళ్లాను’ అని చెప్పారు. చదవండి: ‘డాడీ.. లేడాడీ.. నాతో మాట్లాడు... ఏమైంది అంకుల్ నాన్నకు..’ -
ఎల్ఐసీ ఐపీఓ దిశగా మరో అడుగు
న్యూఢిల్లీ: ఎల్ఐసీ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) విషయంలో మరో అడుగు ముందుకుపడింది. ఐపీఓ సంబంధిత విషయాల్లో సలహాలు ఇవ్వడానికి (ప్రి–ఐపీఓ ట్రాన్సాక్షన్ అడ్వైజర్) రెండు సంస్థలను కేంద్రం ఎంపిక చేసిందని సమాచారం. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, డెలాయిట్ టచ్ తోమత్సు ఇండియా సంస్థల నియామకం దాదాపు ఖరారైందని సంబంధిత వర్గాలు తెలిపా యి. ఇక ఎల్ఐసీ విలును మదింపు చేయడానికి ఆక్చూరియల్ సంస్థను ఎంపిక చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే కేంద్రం దరఖాస్తులను ఆహ్వానించనున్నది. ఐపీఓ ఇష్యూ సైజు రూ.80,000–90,000 కోట్లు! ఎల్ఐసీ విలువ రూ. 8–10 లక్షల కోట్ల మేర ఉంటుందని అంచనా. ఐపీఓలో భాగంగా 10 శాతం వాటాను విక్రయించే అవకాశాలున్నాయని, మొత్తం మీద ఎల్ఐసీ ఐపీఓ ఇష్యూ సైజు రూ.80,000–90,000 కోట్ల రేంజ్లో ఉండొచ్చని భావిస్తున్నారు. నిధుల కొరత సమస్యను అధిగమించడానికి ఎల్ఐసీ ఐపీఓ నిధులను ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఎల్ఐసీ హౌసింగ్ లాభంలో 34 శాతం వృద్ధి ముంబై: ఎల్ఐసీ అనుబంధ సంస్థ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. లాభం 34 శాతం పెరిగి రూ.817 కోట్లుగా నమోదైంది. కేటాయింపులు తగ్గడం కలిసొచ్చింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి సంస్థ లాభం రూ.610 కోట్లుగా ఉండడం గమనార్హం. మొండి బకాయిలకు కేటాయింపులు (ప్రొవిజనింగ్) రూ.56 కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ.253 కోట్లుగా ఉన్నాయి. ఇక సంస్థ ఆదాయం రూ.4,807 కోట్ల నుంచి రూ.4,977 కోట్లకు వద్ధి చెందింది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) రూ.1,186 కోట్ల నుంచి రూ.1,220 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ మార్జిన్ (నిధుల సమీకరణపై చేసిన ఖర్చును, ఆయా నిధులను రుణాలుగా ఇవ్వడం ద్వారా ఆర్జించిన రాబడి నుంచి మినహాయించగా) 2.41 శాతం నుంచి 2.31 శాతానికి పరిమితమైంది. జూన్ చివరికి మొత్తం రుణాల్లో 25 శాతం మేర మారటోరియం పరిధిలో ఉన్నట్టు సంస్థ తెలిపింది. దీన్ని మరింత లోతుగా చూస్తే రిటైల్ గహ రుణాల్లో 16శాతమే మారటోరియం పరిధిలో ఉండగా, ప్రాపర్టీ డెవలపర్లకు ఇచ్చిన రుణాల్లో 77 శాతం మారటోరియం పరిధిలో ఉండడం గమనార్హం. రుణాల పోర్ట్ ఫోలియో రూ.2,09,817 కోట్లకు పెరిగింది. -
ఎల్ఐసీ అమ్మకాలలో డెలాయిట్ కీలక పాత్ర
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఎల్ఐసీ విక్రయం(అమ్మకం)లో ఐటీ దిగ్గజం డెలాయిట్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ సేవలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్ఐసీ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు సంబంధించి ప్రభుత్వం వేగం పెంచింది. జూన్‌లో జారీ చేసిన టెండర్ల ప్రకారం ఎల్ఐసీ షేర్లను విక్రయించే సంస్థలను ప్రభుత్వం త్వరలోనే ఆహ్వానించనుంది. కాగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక సంస్థల అభివృద్ధి చెందేందుకు అనేక ప్రణాళికలు రచిస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ. 2.10 లక్షల కోట్లు సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చదవండి: సీనియర్ సిటిజన్లకు మరో చాన్స్ -
ఎన్సీఎల్ఏటీలో డెలాయిట్, కేపీఎంజీలకు చుక్కెదురు!
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కేసులో తమను పార్టీగా చేర్చడాన్ని సవాలుచేస్తూ ఆడిటర్లు డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్, కేపీఎంజీ అనుబంధ విభాగం బీఎస్ఆర్ అండ్ అసోసియేట్స్ దాఖలు చేసిన పిటిషన్లను ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్) బుధవారం కొట్టివేసింది. స్వతంత్ర డైరెక్టర్లు ఈ మేరకు దాఖలు చేసిన పిటీషన్‌నూ అప్పీలేట్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అనుబంధ విభాగం ఐఎఫ్‌ఐఎన్‌లో మోసానికి సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, ముంబై ద్విసభ్య ధర్మాసనం 2019 జూలై 23న ఇచ్చిన రూలింగ్‌ను సమర్థించింది. కేసుకు సంబంధించి తమనూ యాజమాన్యంలో భాగంగా పరిగణించడం తగదని ఆడిటర్లు డెలాయిట్ హాస్కి న్స్ అండ్ సెల్స్, కేపీఎంజీ బీఎస్ఆర్ అండ్ అసోసియేట్స్ చేసిన వాదనలను అప్పీలేట్ అథారిటీ తిరస్కరించింది. ఈ కేసులో మాజీ ఆడిటర్లనూ పార్టీలుగా చేర్చి ఆస్తులనూ జప్తు చేయాలని ఎన్సీఎల్టీని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ కోరింది. దీనిని గత ఏడాది జూలై 23న ముంబై ధ ర్మాసనం ఆమోదించింది. అయితే ఈ తీర్పును ఆడిటర్లు, స్వతంత్ర డైరెక్టర్లు ఎన్సీఎల్ఏటీలో సవాలు చేశారు. జూలై 29న అప్పీలేట్ ట్రిబ్యునల్ కేసులో స్టే ఇస్తూ, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ స్టేను మరో రెండు వారాలు పొడిగించాలన్న ఆడిటర్లు, స్వతంత్య్ర డైరెక్టర్ల తాజా విజ్ఞప్తిని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించడం తక్షణం ఆయా ఆడిటర్లు, స్వతంత్ర డైరెక్టర్లకు ఊరటనిచ్చే అంశం. -
ఎన్సీఎల్టీలో డెలాయిట్‌కు దక్కని ఊరట
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కేసుకు సంబంధించి ఆడిటింగ్ సంస్థలు డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్, బీఎస్ఆర్ అసోసియేట్స్‌కు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో చుక్కెదురైంది. వాటిపై విధించిన నిషేధానికి సంబంధించి తాత్కాలికంగానైనా ఊరటనిచ్చేందుకు ట్రిబ్యునల్ నిరాకరించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫ్రాడ్ కేసులో ముందస్తు షెడ్యూల్ ప్రకారం విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే, సెప్టెంబర్ 20న జరిగే తదుపరి విచారణ దాకా తుది ఉత్తర్వులేవీ జారీ చేయబోమని పేర్కొంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ ఆడిటింగ్ బాధ్యతలను సమర్ధంగా నిర్వర్తించడంలో విఫలమైనందుకు గాను రెండు సంస్థలపైనా అయిదేళ్ల పాటు నిషేధం విధిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే, దీన్ని సవాలు చేస్తూ డెలాయిట్, బీఎస్ఆర్ తాజాగా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు దాదాపు రూ. 95,000 కోట్ల మేర రుణాలు బాకీపడిన సంగతి తెలిసిందే. -
డెలాయిట్పై ఐదేళ్ల నిషేధం?
ముంబై: ప్రభుత్వ రంగ ఆర్థిక సేవల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో చోటుచేసుకున్న భారీ రుణ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు కొరడా ఝళిపిస్తున్నాయి. ఈ కేసులో అంతర్జాతీయ ఆడిటింగ్ దిగ్గజం డెలాయిట్ కూడా అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఖాతాల ఆడిటింగ్ ప్రక్రియ విషయంలో డెలాయిట్ అక్రమాలకు పాల్పడిందని కేసును దర్యాప్తు చేస్తున్న తీవ్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ(ఎస్ఎఫ్ఐఓ) నిగ్గు తేల్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో కంపెనీల చట్టంలోని 140(5) సెక్షన్ ప్రకారం డెలాయిట్పై నిషేధం విధించేందుకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాయత్తం అవుతోందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. దాదాపు రూ.91,000 కోట్ల రుణాల ఊబిలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలు.. బకాయిలు తీర్చలేక చేతులెత్తేసిన(డిఫాల్ట్) సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం కంపెనీని తన అధీనంలోకి తీసుకోవడంతోపాటు చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు ఏజెన్సీలతో విచారణను వేగవంతం చేసింది. కాగా, ఈ ఉదంతంపై డెలాయిట్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీస్(ఐఎఫ్ఐఎన్)పై దర్యాప్తునకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని.. ఆడిటింగ్ ప్రమాణాలు, ఇతరత్రా చట్టాలు, నిబంధనలకు లోబడే తాము ఆడిట్‌ను నిర్వహించామని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు మొత్తం 347 అనుబంధ సంస్థలు ఉండగా.. ఇందులో మెజారిటీ కంపెనీలకు చిన్నాచితకా ఆడిట్ సంస్థలే ఆడిటింగ్‌ను నిర్వహించాయని కూడా డెలాయిట్ అంటోంది. అంతేకాకుండా గ్రూప్‌లో రెండు ప్రధాన కంపెనీలైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్కు ఎర్నెస్ట్ అండ్ యంగ్ పార్ట్నర్ అయిన ఎస్ఆర్బీసీ అండ్‌కో 2017–18, 2018–19లో ఆడిట్ చేపట్టిందని పేర్కొంది. అదేవిధంగా ఐఎఫ్‌ఐఎన్‌కు 2018–19లో కేపీఎంజీ పార్ట్నర్ అయిన బీఎస్ఆర్ ఆడిట్ చేపట్టిందని వెల్లడించింది. చాలా ఏళ్లుగా తాము ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ ఆడిటింగ్ చేస్తున్నామని.. చాలా వరకూ రుణాలకు తగినంత తనఖాలు ఉన్నాయనేది డెలాయిట్ వాదన. నైట్‌ఫ్రాంక్ వంటి సంస్థలతో దీనిపై స్వతంత్ర వేల్యుయేషన్ కూడా జరిగిందని అంటోంది. నిషేధం ఎన్నాళ్లు... సత్యం స్కామ్‌లో ఇప్పటికే ఒక అంతర్జాతీయ ఆడిట్ అగ్రగామి ప్రైస్ వాటర్‌హౌస్(పీడబ్ల్యూ)పై 2018లో సెబీ రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా పీడబ్ల్యూకు చెందిన రెండు పార్ట్నర్ సంస్థలను మూడేళ్లు నిషేధించారు. ఇప్పుడు డెలాయిట్‌పైనా ఇదే తరహా కొరడా ఝళిపిస్తే.. నిషేధాన్ని ఎదుర్కొన్న రెండో అంతర్జాతీయ ఆడిట్ సంస్థగా నిలవనుంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఖాతాల్లో చోటుచేసుకున్న తీవ్రమైన ఆర్థిక అవకతవకలను కావాలనే చూసీచూడనట్లు వదిలేసినట్లు డెలాయిట్పై అంతర్గత వేగు(విజిల్‌బ్లోయర్) ఎస్‌ఎఫ్‌ఐఓకు రాసిన లేఖ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లో సంక్లిష్టతను ఆసరాగా చేసుకుని ఎగ్జిక్యూటివ్‌లతో డెలాయిట్ కుమ్మక్కయిందని.. ఇందుకుగాను భారీగా ఫీజులు, కాంట్రాక్టులను దక్కించుకుందనేది విజిల్‌బ్లోయర్ ఆరోపణ. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ మాజీ చీఫ్ రవి పార్థసారథి అక్రమాలకు డెలాయిట్ దన్నుగా నిలిచిందని కూడా లేఖలో సంచలన ఆరోపణలు ఉన్నాయి. గతవారంలో డెలాయిట్ మాజీ సిఈఓను ఈ కేసులో ఎస్ఎఫ్ఐఓ విచారించింది. డెలాయిట్పై ఈ ఆరోపణలు రుజువైతే ఐదేళ్ల వరకూ నిషేధాన్ని విధించొచ్చని కార్పొరేట్ వ్యవహారాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
ఐటీ దిగ్గజం డెలాయిట్పై హ్యాకర్ల దాడి
వాషింగ్టన్ : డెలాయిట్ కంపెనీకి చెందిన సర్వర్ హ్యాక్ అయినట్లు రిపోర్టులు వస్తున్నాయి. డెలాయిట్‌కు చెందిన 350 క్లయింట్ల వివరాలు తస్కరణకు గురైనట్లు సమాచారం. సమాచారం చోరికి గురైన క్లయింట్లలో అమెరికా ప్రభుత్వానికి చెందిన నాలుగు డిపార్ట్మెంట్లు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు ఓ అంతర్జాతీయ పత్రిక కథనాన్ని ప్రచురించింది. డెలాయిట్ ఊహించిన దాని కంటే పెద్ద మొత్తంలో డేటా చోరికి గురైందని హ్యాకింగ్ నిపుణులు భావిస్తున్నారు. కాగా, ఏంత మొత్తంలో సమాచారం చోరికి గురైందన్న విషయంపై డెలాయిట్ ఇంకా పెదవి విప్పడం లేదు. కేవలం ఆరుగురు క్లయింట్లకు చెందిన సమాచారమే హ్యాకింగ్‌కు గురైనట్లు డెలాయిట్ చెబుతోంది. పేరు చెప్పడానికి ఇష్టపడని వ్యక్తులు చెప్పిన సమాచారం ప్రకారం.. అమెరికాకు చెందిన రాష్ట్ర, ఎనర్జీ, హోం ల్యాండ్ సెక్యూరిటీ, రక్షణ శాఖ డిపార్ట్మెంట్లకు చెందిన వివరాలు తస్కరణకు గురయ్యాయి. -
డెలాయిట్పై భారీ సైబర్ దాడి
ప్రముఖ అంతర్జాతీయ అకౌంటింగ్ సంస్థ డెలాయిట్‌కు సైబర్ షాక్ తగిలింది. సంస్థ అందించిన సమాచారం ప్రకారం ఈ మెయిల్ వ్యవస్థపై సైబర్‌దాడి జరిగింది. దీంతో క్లయింట్లకు చెందిన విలువైన సమాచారం, రహస్యమైన మెయిల్స్ హ్యాకర్ల బారిన పడ్డాయి. దీనిపై పూర్తిగా విచారణ ప్రారంభించామని డెలాయిట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. చాలా కొద్ది మంది ఖాతాదారులను మాత్రమే ఈ దాడి ప్రభావితం చేసిందనీ, ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించామని తెలిపింది. క్లయింట్ బిజినెస్ వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేదనీ పూర్తి విచారణ జరిపిస్తున్నామని ప్రకటించింది. అలాగే తమ సైబర్-సెక్యూరిటీ వ్యవస్థ చాలా ఉత్తమమైందనీ, ఖాతాదారుల రహస్య సమాచారాన్ని రక్షించడంలోనూ, వారి సైబర్‌సెక్యూరిటీ భద్రతకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని సంస్థ పేర్కొంది. అయితే చాలా పెద్ద సంఖ్యలో ఖాతాదారుల నుండి సమాచారం లీక్ అయిందనీ ది గార్డియన్ దినపత్రిక సోమవారం నివేదించింది. ఇందులో పెద్ద సంస్థలు, అమెరికా ప్రభుత్వ విభాగాలు కూడా ఉన్నాయని తెలిపింది. అమెరికాలోనే అతి పెద్ద ప్రైవేట్ సంస్థ డెలాయిట్ డేటాపై గత ఏడాది అక్టోబర్ నుంచి మార్చి వరకూ హ్యాకర్లు కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలోనే భారీ సైబర్‌దాడికి గురైందట. -
భారత్‌లో పన్ను వ్యవస్థ సంక్లిష్టం: డెలాయిట్
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అతి క్లిష్టమైన పన్ను వ్యవస్థను కలిగిన రెండో దేశం భారత్ అని డెలాయిట్ సర్వే స్పష్టం చేసింది. పన్నులకు సంబంధించి క్లిష్టమైన చట్టం కలిగిన దేశంగా చైనా మొదటి స్థానంలో ఉంది. భారత్ తర్వాత జపాన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణ కొరియా వరుసగా ఉన్నాయి. చైనా, భారత్ విషయంలో పన్నుల పరంగా జటిలత్వం గత మూడేళ్లలో పెరిగిపోయినట్టు సర్వేలో పాల్గొన్న వారిలో సగానికిపైగా అభిప్రాయం వ్యక్తం చేశారు. సంక్లిష్టత అంటే పన్ను చట్టాలు, నిబంధనలు అర్థం చేసుకోవడం, వివరించడంలో ఉన్న కఠినత్వం. సర్వేలో 90 శాతానికి పైగా భారత్, చైనా, ఇండోనేషియాలో పన్ను సంస్కరణలను కోరుకుంటున్నట్టు చెప్పారు. మరీ ముఖ్యంగా భారత్‌లో కాలానుగుణంగా సంస్కరణలు, ఆడిట్లలో నాణ్యత, బీఈపీఎస్ సిఫారసుల అమలును ఆశిస్తున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 300 మందికిపైగా ట్యాక్స్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాలను డెలాయిట్ ఈ సర్వేలో భాగంగా సేకరించింది. -
కార్పొరేట్ మోసాలు పెరుగుతాయ్
• వచ్చే రెండేళ్లలో మరింత పైకి... • డెలాయిట్ సర్వే నివేదిక... ముంబై: దేశీయంగా కార్పొరేట్ మోసాలు వచ్చే రెండేళ్లలో మరింత పెరగనున్నాయని గ్లోబల్ అకౌంటింగ్ దిగ్గజం డెలాయిట్ పేర్కొంది. నైతిక విలువలు అంతకంతకూ దిగజారుతుండమే దీనికి ప్రధాన కారణంగా కార్పొరేట్ కంపెనీలు భావిస్తున్నట్లు సర్వే నివేదికలో వెల్లడించింది. డెలాయిట్ నిర్వహించిన ‘ఇండియా ఫ్రాడ్ సర్వే’లో 309 కార్పొరేట్ కంపెనీలకు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, వృత్తి నిపుణులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలివీ... ⇔ నైతిక విలువలు దిగజారడమే మోసాలు పెరిగేందుకు దారితీస్తోందని సర్వేలో పాల్గొన్న బడా కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో 38 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎస్ఎంఈ)లకు చెందిన 68 శాతం మంది ఎగ్జిక్యూటివ్‌లు, వృత్తి నిపుణుల్లో 42 శాతం మంది ఇదే కారణాన్ని పేర్కొన్నారు. ⇔ అవినీతి, లంచాలు, వెండార్లకు అనుకూలంగా వ్యవహరిం చడం, స్వప్రయోజనాలు వంటివి గడిచిన రెండేళ్లలో జరిగిన కార్పొరేట్ మోసాల్లో ఎక్కువగా చోటుచేసుకున్నాయి. ⇔ ఒకేవిధమైన మోసాలను ఎదుర్కోవడంలో కంపెనీలు అనుసరిస్తున్న విధానాల్లో తీవ్ర వ్యత్యాసాలు నెలకొన్నాయి. దీనిప్రకారం చూస్తే.. మోసాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయని.. వీటికి అడ్డుకట్టవేయడంలోకంపెనీలు తీవ్రంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉన్నట్లు అవగతమవుతోంది. ⇔ పెద్ద కంపెనీల్లో చాలావరకూ అందరికీ తెలిసిన మోసాలను అరికట్టడంపైనే దృష్టిపెడుతున్నాయి. సోషల్ మీడియా, పోటీ కంపెనీలు అనురిస్తున్న కొత్తరకం మోసాలను ఎదుర్కోవడానికి సమాయత్తంగా లేవు. ⇔ మోసం తీవ్రత ఆధారంగానే దర్యాప్తులను మొదలుపెడుతున్నట్లు 43 శాతం మంది పేర్కొన్నారు. ఇక మోసం చేసిన సిబ్బంది రాజీనామాకు అనుమతిస్తున్నట్లు 36 శాతం మంది వెల్లడించారు. ఇతరఉద్యోగులు, కంపెనీ బోర్డు, నియంత్రణ సంస్థలకు సబంధిత మోసం గురించిన సమాచారాన్ని అందిస్తున్నట్లు 33 శాతం మంది సర్వేలో పాల్గొన్న వారు వివరించారు. ⇔ ఎస్ఎంఈలకు సంబంధించి మోసాలను ఎదుర్కొనే సమాయత్తత, సంకల్పం లేదని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక ఇటువంటి కార్యకలాపాలను నివారించేందుకు తగిన బడ్జెట్, వనరుల కేటాయింపులేదని 42 శాతం మంది చెప్పారు. -
పొద్దున లేస్తే అదే పని
న్యూఢిల్లీ: గతంలో పొద్దున్నే లేవగానే హా... అంటూ కళ్లు తుడుముకునే వారంతా ఇప్పుడు మాత్రం నిద్రనుంచి మేల్కొంటుండగా కళ్లు తెరవకుండానే ముందు వారి చేతులు ముందు స్మార్ట్ ఫోన్‌ను వెతుకుతున్నాయట. అలా తీసుకునేది టైం ఎంతయిందో చూసుకోవడానికి కాదండోయ్.. వెంటనే డేటా ఆన్ చేసి వాట్సాప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో పడిపోతుంటారట. డెలాయిట్ లోని ఓ ప్రొఫెషనల్ సర్వీస్ సంస్థ ఈ మేరకు అధ్యయనం చేసి దాని వివరాలు తెలిపింది. డెలాయిట్ మొబైల్ వినియోగదారుల సర్వే 2015 ప్రకారం స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న 78 శాతం మంది కూడా నిద్ర నుంచి మేల్కొండగా, మేల్కొన్న తర్వాత కనీసం పదిహేను నిమిషాల్లోనే కచ్చితంగా సోషల్ మీడియాలోకి ప్రవేశిస్తారని తెలిపింది. మరో 52శాతంమంది మాత్రం నిద్రలోకి జారుకునే ముందు ఓ ఐదు నిమిషాలపాటు అందులో విహరిస్తారని తెలిపింది. ఇలా వారు చెక్ చేసే సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్, ఫేస్ బుక్, చాట్ బాక్సెస్, మెయిల్స్ వాటిని ఎక్కువగా తనిఖీ చేస్తుంటారని కూడా ఆ అధ్యయనం వెల్లడించింది. -
5 లక్షల నిర్మాణ కూలీలు కావలెను!
దుబాయ్: గల్ఫ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ లో నిర్మాణ కూలీల కొరత రియల్ ఎస్టేట్ రంగాన్ని పట్టిపీడిస్తోందని ఓ మీడియా నివేదికలో వెల్లడైంది. 2015 నాటికి నిర్మాణ కూలీల కొరత భారీగా పెరిగే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. 2015 నాటికి 5 లక్షల మంది నిర్మాణ కూలీల కొరత ఉంటుందని సర్వేలో వెల్లడైంది. ఇటీవల దుబాయ్ ఇంటర్నేషనల్ అకడమిక్ సిటీ(డీఐఏసీ), డెల్లాయిట్ కన్సల్టెన్సీ ఓ సర్వే నిర్వహించారు. పబ్లిక్, ప్రైవేట్ ప్రాజెక్ట్ లకు ఊహించని డిమాండ్ ఏర్పడటంతో నిర్మాణ రంగంలోని అన్ని విభాగాల్లో కూలీ, ఇతర సాంకేతిక నిపుణల కొరత ఏర్పడిందని నివేదికలో తెలిపారు. డిజైన్ ఇంజనీరింగ్, మధ్య స్థాయి నిపుణుల అవసరం ఉంటుందని మల్టీ నేషనల్ కంపెనీలు తెలిపాయి. వరల్డ్ ఎక్స్ పో 2020 నిర్వహించడానికి దుబాయ్ బిడ్ గెలుచుకోవడంతో రియల్ ఎస్టేట్ రంగానికి భారీగా డిమాండ్ పెరిగింది. పెద్ద ఎత్తున నిర్వహించే వరల్డ్ ఎక్స్ పో 2020 కు 45 వేల హోటల్ రూమ్ లు అవసరం ఉంటుందని హెచ్ ఎస్ బీసీ బ్యాంక్ తెలిపింది. వరల్డ్ ఎక్స్ పో 2020 కోసం 3.40 బిలియన్ డాలర్ల మేరకు ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పనులు నిర్వహించాల్సి ఉంటుందని.. అందుచేత స్కిల్డ్ లేబర్ కు యూఏఈలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని తెలిపారు. -
బిగ్ 4 ఆడిటింగ్ నుంచి నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
-
ట్యాబ్లెట్స్‌లో ఇంటర్నెట్ వాడకం తక్కువే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ వినియోగం విషయంలో ట్యాబ్లెట్స్ కంటే ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లనే ఎక్కువ మంది ఎంచుకుంటున్నారని డెలాయిట్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇంటర్నెట్ కోసం 69 శాతం మంది ల్యాప్‌టాప్‌లపై, 64 శాతం మంది స్మార్ట్ఫోన్లపై ఆధారపడుతున్నారట. కేవలం 24 శాతం మంది ట్యాబ్లెట్లను వాడుతున్నారట. హైదరాబాద్ సహా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణే, అహ్మదాబాద్ నగరాల్లోని 2 వేల మంది వినియోగదార్లపై డెలాయిట్ ఆన్లైన్ సర్వే నిర్వహించింది. స్మార్ట్‌ఫోన్ వినియోగదార్లలో 60 శాతం మంది డేటా కోసం మొబైల్ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నారు. ల్యాప్‌టాప్ వినియోగిస్తున్న వారిలో 80 శాతం మంది ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్‌ను వాడుతున్నారు. విభిన్న డేటా ప్లాన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది మొబైల్ కస్టమర్లు వైఫైకి మళ్లుతున్నారట. 12 నెలలుగా అంచనాలకు మంచి మొబైల్ బిల్లు వస్తోందని సర్వేలో పాల్గొన్న 60 శాతం మంది తెలిపారు. ఇక ట్యాబ్లెట్ కొనుగోలు సమయంలో కస్టమర్లకు బ్రాండ్ తొలి ప్రాధాన్యత కాగా, మన్నిక, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ జీవిత కాలం, డిజైన్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అదే స్మార్ట్‌ఫోన్లకైతే బ్యాటరీ సామర్థ్యం కీలకపాత్ర పోషిస్తోంది. డిజైన్, మన్నిక, బ్రాండ్, ఆపరేటింగ్ సిస్టమ్, కెమెరా సామర్థ్యం తర్వాతి ప్రాధాన్యతలని డెలాయిట్ వెల్లడించింది. -
ఓవరాల్ చాంప్ డెలాయిట్
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ ఒలింపిక్స్‌లో డెలాయిట్ ఉద్యోగులు సత్తాచాటారు. దీంతో డెలాయిట్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకుంది. మొత్తం 17 క్రీడాంశాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో డెలాయిట్ క్రీడాకారులు 26 స్వర్ణాలు, 17 రజతాలు, 25 కాంస్య పతకాలతో కలిపి 68 పతకాలు సాధించారు. ఈ పోటీల్లో హెచ్ఎస్బీసీ-ఈడీపీ ఓవరాల్ రన్నరప్‌గా నిలిచింది. వికలాంగ అథ్లెట్ కిరణ్ కానోజియా బ్లేడ్ సాయంతో పరుగెత్తి అందరినీ ఆకట్టుకుంది. 800 మీటర్ల పరుగులో ఆమె కనబరిచిన ప్రతిభకు గుర్తింపుగా నిర్వాహకులు ప్రత్యేక బహుమతిని అందజేశారు. పురుషుల 100 మీ. పరుగులో సమిరన్ భరద్వాజ్ (డెలాయిట్) 12.66 సెకన్లలో పోటీని పూర్తిచేసి స్వర్ణం సాధించాడు. చార్లెస్ బిన్నీ, రాజ్ కుమార్‌లకు వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కాయి. 200 మీటర్ల పరుగు పందెంలో అర్జున్ మారి (డెలాయిట్) పోటీని 25.12 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. రాజ్ కుమార్ (డెలాయిట్), కశ్యప్ (హెచ్ఎస్బీసీ-ఈడీపీ) వరుసగా రెండు, మూడు స్థానాలు పొందారు. రవీందర్ (డెలాయింట్) ఉత్తమ పురుష అథ్లెట్‌గా, జయంతి పాఠక్ (వెరిజాన్) ఉత్తమ మహిళా అథ్లెట్‌గా అవార్డులు గెలుపొందారు. ఏడీపీ బృందం స్ఫూర్తిదాయక జట్టుగా, టీసీఎస్ క్రమశిక్షణ జట్టుగా, వెరిజాన్ ప్రేరణ ఇచ్చిన జట్టుగా అవార్డులు దక్కించుకున్నాయి.